ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త మూడో దశ టీకాల కార్యక్రమం ప్రారంభంతో
15.68 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
మూడోదశ టీకాల మొదటి రోజే 18-44 ఏళ్ల మధ్యవారికి 86 వేల డోసులు
గత 24 గంటలలో 3 లక్షలు పైబడ్డ కోలుకున్నవారి సంఖ్య
Posted On:
02 MAY 2021 10:29AM by PIB Hyderabad
రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ భారత ప్రభుత్వం కోవిడ్ సంక్షోభ నివారణకు, నియంత్రణకు చేపట్టిన
ఐదు అంశాల వ్యూహం ( పరీక్షించు, బాధితుల ఆనవాలు పట్టు, చికిత్స అందించు, కోవిడ్ నియంత్రణకు అనుగుణ ప్రవర్తనను
ప్రోత్సహించు, టీకాలు వెయ్యి) లో అత్యంత కీలకమైన టీకాల కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తోంది. సరళీకరించి వేగవంతం చేసిన
టీకాల కార్యక్రమం కింద మూడో దశ నిన్నటి నుంచి ( మే 1) అమలులోకి వచ్చింది. కొత్తగా అర్హులైన వారందరికీ ఏప్రిల్ 28న
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
ఒకవైపు దేశవ్యాప్తంగా మూడో దశ ప్రారంభంకాగా ఇప్పటిదాకా ఇచ్చిన ఇచ్చిన మొత్తం కోవిడ్ టీకా డోసుల సంఖ్య 15.68 కోట్లు
దాటింది. 18-44 ఏళ్ళ మధ్యవారు 11 రాష్ట్రాలలో నిన్న 86,023 మంది మొదటి డోస్ తీసుకున్నారు.
ఆ రాష్ట్రాలు చత్తీస్ గఢ్ (987), ఢిల్లీ(1,472), గుజరాత్ (51,622), జమ్మూ-కశ్మీర్ (201), కర్నాటక (649), మహారాష్ట్ర
(12,525), ఒడిశా (97), పంజాబ్ (298), రాజస్థాన్ (1853), తమిళనాడు (527), ఉత్తరప్రదేశ్ (15,792).
ఈరోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 22,93,911శిబిరాల ద్వారా 15,68,16,031 టీకా డోసుల
పంపిణీ పూర్తయింది. ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న మొదటి డోసులు 94,28,490, రెండో డోసులు 62,65,397,
కోవిడ్ యోధులు తీసుకున్న మొదటి డోసులు 1,27,57,529, రెండో డోసులు 69,22,093, 18045 ఏళ్ళ మధ్యనున్నవారు
తీసుకున్న మొదటి డోసులు 86,023, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న మొదటి డోసులు 5,26,18,135, రెండో డోసులు
1,14,49,310, 60 ఏళ్లు పైబడ్డవారు తీసుకున్న మొదటి డోసులు 5,32,80,976, రెండో డోసులు 40,08,078 ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 ఏళ్ళు
|
45-60 ఏళ్ళవారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వడోస్
|
2వ డోస్
|
1వడోస్
|
2వ డోస్
|
1వడోస్
|
1వడోస్
|
2వ డోస్
|
1వడోస్
|
2వ డోస్
|
94,28,490
|
62,65,397
|
1,27,57,529
|
69,22,093
|
86,023
|
5,32,80,976
|
40,08,078
|
5,26,18,135
|
1,14,49,310
|
15,68,16,031
|
ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 67.00% వాటా పది రాష్టాలదే కావటం గమనార్హం
గత 24 గంటలలో 18 లక్షలకు పైగా టీకా డోసులపంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 106వ రోజైన మే 1న
18,26,219 డోసుల పంపిణీ జరిగింది. 15,968 శిబిరాల ద్వారా 11,14,214 మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా
7,12,005 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: మే 1, 2021 ( 106 వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 ఏళ్ళు
|
45-60 ఏళ్ళవారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వడోస్
|
2వ డోస్
|
1వడోస్
|
2వ డోస్
|
1వడోస్
|
1వడోస్
|
2వ డోస్
|
1వడోస్
|
2వ డోస్
|
1వడోస్
|
2వ డోస్
|
16,351
|
23,482
|
1,99,460
|
1,06,978
|
86,023
|
5,72,861
|
2,33,148
|
2,39,519
|
3,48,397
|
11,14,214
|
7,12,005
|
భారతదేశంలో ఇప్పటిదాకా మొత్తం 1,59,92,271 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. జాతీయ స్థాయిలో కోలుకున్న
వారి శాతం 81.77% గా నమోదైంది. గత 24 గంటలలో 3,07,865 కోలుకోగా వారిలో 75.59% మంది పది రాష్ట్రాలవారు. .
గత 24 గంటలలో 3,92,488 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు- మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక,
కేరళ, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలో 72.72% కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా
63,282 కేసులు రాగా ఆ తరువాత స్థానాలలో కర్నాటక(40,990), కేరళ (35,636) ఉన్నాయి.
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 33,49,644కు చేరాయి. ఇవి మొత్తం పాజిటివ్ కేసులలో 17.13%.
దీంతో గత 24 గంటలలో నికరంగా పెరిగిన చికిత్సలో ఉన్న కేసులు 80,934 గా నమోదయ్యాయి. వీటిలో 81.22% వాటా
పన్నెండు రాష్ట్రాలది కావటం గమనార్హం.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. అయితే మొత్తం పాజిటివిటీ శాతం 6.74%.
జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం తగ్గుతూ 1.10% కు చేరింది. గత 24 గంటలలో 3,689 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
అందులో పది రాష్టాల వాటా 76.01% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 802 మంది, ఢిల్లీలో 412 మంది చనిపోయారు.
గత 24 గంటలలో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.
అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లక్షదీవులు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం
.
****
(Release ID: 1715513)
Visitor Counter : 278