ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులు 15.5 కోట్లు


గత 24 గంటల్లో ఇచ్చిన టీకా డోసులు 27 లక్షలు
గత 24 గంటల్లో కోలుకున్న కోవిడ్ బాధితులు 3 లక్షలమంది

ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితులు 1,56 కోట్లు
గత 24 గంటల్లో చేసిన కోవిడ్ పరీక్షలు 19.45 లక్షలు అత్యధికం

Posted On: 01 MAY 2021 11:26AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇస్తున్న టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 15,49,89,635 టీకా డోసులివ్వగా గత 24 గంటలలో 27 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 94,12,140  మొదటి డోసులు,  62,41,915 మందికి రెండో డోస్ ఇచ్చారు. కోవిడ్ యోధులు తీసుకున్న  1,25,58,069 మొదట డోసులు,   రెండో డొసులు 68,15,115, 45-60 ఏళ్ళ మధ్యవారు తీసుకున్న   5,27,07,921 మొదటి డోసులు,  రెండో డోసులు  37,74,930, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 5,23,78,616 మొదటి డోసులు,  1,11,00,929 రెండోడోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 మధ్య వారు

60 పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

94,12,140

62,41,915

1,25,58,069

68,15,115

5,27,07,921

37,74,930

5,23,78,616

1,11,00,929

15,49,89,635

పది రాష్ట్రాలలో ఇచ్చిన డోసుల వాటా  67.0% ఉంది.  

టీకాల కార్యక్రమం మొదలైన 105 వ రోజైన ఏప్రిల్ 30న  27,44,485 టీకా డోసులిచ్చారు. 23,356 శిబిరాల ద్వారా

15,69,846 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 11,74,639 రెండో డోస్ ఇచ్చారు. 

తదీ: ఏప్రిల్ 30, 2021 ( 105వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 మధ్యవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

25,253

50,797

1,38,116

1,07,253

9,29,079

3,57,019

4,77,398

6,59,570

15,69,846

11,74,639

 

భారత దేశంలో ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,56,84,406కు చేరింది.  జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 81.84% కాగా గత 24 గంటలలో 2,99,988 మంది కోలుకున్నారు.  వీరిలో పది రాష్ట్రాల్లోనే కొత్తగా కోలుకున్నవారు 76.09% ఉన్నారు.

 

దేశవ్యాప్తంగా ఒక్క రోజులో In 19,45,299 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరగగా ఇప్పటివరకు ఇది అత్యధికం. దేసంలో పాజిటివిటీ శాతం  20.66%.

 

గత 24 గంటలలో 4,01,993 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పది రాష్టాలు – మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బీహార్ కలిసి కొత్త కేసుల్లో 73.71% ఉన్నాయి. మహారాష్టలో అత్యధికంగా  ఒక్క రోజులో  62,919 కొత్త కేసులు రాగా కర్నాటకలో  48,296 , కేరళలో 37,199 కేసులు వచ్చాయి. .

భారత దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 32,68,710 కు చేరింది. ఇది ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 17.06%. చికిత్సలో ఉన్నవారి సంఖ్య గత 24 గంటలలో నికరంగా  98,482 పెరిగింది.

పదకొండు రాష్ట్రాలు – మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ బీహార్ కలిసి చికిత్సలో ఉన్నవారిలో 78.22% వాటా ఉండటం గమనార్హం.

 

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.11% కు చేరింది. గత 24 గంటలలో 3,523 కోవిడ్ మరణాలు సంభవించాయి.  పది రాష్ట్రాలలో 76.75% కోవిడ్ మరణాలు నమోదు కాగా మహారాష్టలో అత్యధికంగా 828 మంది, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్ లొ 332 మంది చనిపోయారు

గత 24 గంటలలో నాలుగు రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లక్షదీవులు, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవులు  

*****(Release ID: 1715399) Visitor Counter : 245