ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా14.19 కోట్ల డోసులు దాటిన కోవిడ్ టీకాలు
100 రోజులు పూర్తి చేసుకున్న అతిపెద్ద టీకాల కార్యక్రమం
గత 24 గంటల్లో 2.19 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు
గత 24 గంటల్లో కోవిడ్ మరణాలు నమోదు కాని 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
Posted On:
26 APR 2021 10:42AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య్ 14.19 కోట్లు దాటగా టీకాల కార్యక్రమానికి నిన్న 100 రోజులు పూర్తయ్యాయి.
ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్నిబట్టి 20,44,954 శిబిరాల ద్వారా మొత్తం 14,19,11,223 టీకా డోసుల పంపిణీ జరిగింది.దులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 92,98,092 మొదటి డోసులు, 60,08,236 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన
1,19,87,192 మొదటి డోసులు, 63,10,273 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 4,98,72,209 మొదటి డోసులు, 79,23,295 రెండో డోసులు, 45-6- ఏళ్ళ మధ్యవయసున్నవారికిచ్చిన 4,81,08,293 మొదటి డోసులు, 24,03,633 రెండో డోసులు ఉన్నాయి.
అరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-6- ఏళ్ళ మధ్యవారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1 వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2 వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
92,98,092
|
60,08,236
|
1,19,87,192
|
63,10,273
|
4,81,08,293
|
24,03,633
|
4,98,72,209
|
79,23,295
|
14,19,11,223
|
మొత్తం కోవిడ్ టీకాలలో 58.78% వాటా ఎనిమిది రాష్ట్రాలదే కావటం గమనార్హం
గత 24 గంటలలో దాదాపు 10 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 100వ రోజైన ఏప్రిల్ 25న
9,95,288 టీకా డోసులిచ్చారు. అందులో 6,85,944 మంది లబ్ధిదారులు 11,984 శిబిరాల ద్వారా మొదటి డోస్ తీసుకోగా 3,09,344 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: 25, ఏప్రిల్, 2021 ( 100వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్యవారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
7,602
|
12,602
|
36,946
|
19,782
|
4,24,503
|
73,395
|
2,16,893
|
2,03,565
|
6,85,944
|
3,09,344
|
దేశవ్యాప్తంగా కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 1,43,04,382 కాగా, కోలుకున్నవారి శాతం 82.62%. గత 24 గంటలలో 2,19,272 మంది కోవిడ్ బారినుంచి కొలుకొని బైటపడ్దారు. కోలుకున్నవారిలో 78.98% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.
గడిచిన 24 గంటలలో 3,52,991 కొత్త కోవిడ్ కెసులు నిర్థారణ అయ్యాయి. పది రాష్ట్రాలు- మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ,
కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ లలోనే 74.5% కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్కరోజులో 66,191 కేసులు రాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 35,311. కర్నాటకలో 34,804 వచ్చాయి.
ఈ క్రింద చూపిన విధంగా 12 రాష్టాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది.
భారత్ లో మొత్తం చికిత్సలో ఉన్న కేసులు 28,13,658 కు చేరగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 16.25% . గత 24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్న కేసులు 1,30,907 పెరిగాయి. ఎనిమిది రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ కలిసి చికిత్సలో ఉన్న కేసుల్లో 69.67% వాటా పొందటం గమనార్హం. .
జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1.13% కు చేరింది.
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 2,812 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో 79.66% వాటా పది రాష్ట్రాలదే కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 832 మంది, ఢిల్లీలో 350 మంది చనిపోయారు.
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఐదు ఉండగా అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, లక్షదీవులు, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు.
****
(Release ID: 1714092)
Visitor Counter : 231
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam