ప్రధాన మంత్రి కార్యాలయం

జలవాయు అంశం పై నేత ల శిఖర సమ్మేళనం (ఏప్రిల్ 22-23, 2021)

Posted On: 21 APR 2021 5:10PM by PIB Hyderabad

అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  2021 ఏప్రిల్ 22-23 తేదీల లో జలవాయు అంశం పై జరిగే నేతల శిఖర సమ్మేళనం లో వర్చువల్ పద్ధతి న పాల్గొననున్నారు.  ప్రధాన మంత్రి ఏప్రిల్ 22న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు జరిగే నేత ల ఒకటో సమావేశం లో తన అభిప్రాయాల ను ప్రకటిస్తారు.  ‘‘2030వ సంవత్సరం వైపు మన అందరి వేగవంతమైన పరుగు’’ అనేది ఈ సమావేశానికి ఇతివృత్తం గా ఉంది.

దాదాపు మరో 40 మంది ప్రపంచ నేతలు కూడా ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోనున్నారు.  వారు మేజర్ ఎకోనామీజ్ ఫోరమ్ (దీనిలో భారతదేశానికి సభ్యత్వం ఉంది) లో సభ్యత్వం కలిగివున్న దేశాల కు  ప్రాతినిధ్యం వహిస్తారు.  మేజర్ ఎకోనామీజ్ ఫోరమ్ ఇతర అంశాల  తో పాటు జలవాయు పరివర్తన పట్ల సంవేదనశీలంగా ఉన్నది.  నేత లు జలవాయు పరివర్తన, జలవాయు చర్యల ను ముందుకు తీసుకు పోవడం, జలవాయు శమనం మరియు అనుకూలనం, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, జలవాయు సురక్ష తో పాటు స్వచ్ఛ శక్తి కోసం సాంకేతిక నూతన ఆవిష్కరణల కు నిధుల ను సమీకరిస్తారు.

జాతీయ పరిస్థితులు, నిలకడతనం కలిగిన ప్రగతి ప్రాథమ్యాలను గౌరవిస్తూ, ప్రపంచం అన్ని పక్షాలను కలుపుకొని పోయేటటువంటి , ప్రతిస్పందన పూర్వకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి తో పాటు జలవాయు చర్యల ను ఎలా చేపట్టగలుగుతుదనే అంశాల పైన కూడా నేత లు చర్చిస్తారు.  

ఈ శిఖర సమ్మేళనం జలవాయు సంబంధి అంశాల పై దృష్టి ని కేంద్రీకరించినటువంటి ప్రపంచ సమావేశాల పరంపర లో ఒక భాగం. ఈ ప్రపంచ సమావేశాలు 2021 నవంబరు లో జరప తలపెట్టిన ‘సిఒపి26’ వరకు కొనసాగుతాయి.  

అన్ని సమావేశాల ను ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది;  ప్రసార మాధ్యమాలు, ప్రజలు వీటి లో పాలుపంచుకోవచ్చును.

 


 

***



(Release ID: 1713307) Visitor Counter : 209