ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మరో మైలురాయి దాటుతూ 13 కోట్ల కరోనా టీకాలు


గత 24 గంటలలో 29 లక్షలకు పైగా టీకాలు

కొత్త కేసులలో 76 శాతం 10 రాష్ట్రాలలోనే

Posted On: 21 APR 2021 12:23PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 13 కోట్లు దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన

సమాచారం ప్రకారం 19,01,413 శిబిరాల ద్వారా 13,01,19,310 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో ఆరోగ్యసిబ్బంది

అందుకున్న  92,01,728 మొదటి డోసులు, 58,17,262 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,15,62,535 మొదటి

డోసులు,  58,55,821 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 4,73,55,942 మొదటి డోసులు,  53,04,679 రెండో

డోసులు, 45-60 ఏళ్ళ మధ్య ఉన్నవారు అందుకున్న 4,35,25,687 మొదటి డోసులు, 14,95,656 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ మధ్యవారు

 60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

92,01,728

58,17,262

1,15,62,535

58,55,821

4,35,25,687

14,95,656

4,73,55,942

53,04,679

13,01,19,310

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 59.25% వాటా ఎనిమిది రాష్ట్రాలదే.  

 

మొదటి ఎనిమిది రాష్ట్రాలలో ఇచ్చిన టీకా డోసుల వివరాలను ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు.

 

గత 24 గంటలలో 29 లక్షలకు పైగా టీకా డోసులపంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 95వ రోజైన ఏప్రిల్ 20 నాడు

29,90,197 టీకా డోసులు ఇవ్వగా 19,86,711మంది లబ్ధిదారులు 42,384 శిబిరాల ద్వారా మొదటి డోస్,  10,03,486

 మంది రెండో డోస్ తీసుకున్నారు.  

 

తేదీ: ఏప్రిల్ 20, 2021 (95వ రోజు)   

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45- 60 ఏళ్ల మధ్యవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

31,011

49,605

1,29,803

1,69,213

11,52,918

1,84,590

6,72,979

6,00,078

19,86,711

10,03,486

 

గడిచిన 24 గంటలలో 2,95,041 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. .పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక,

 కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ లలో 76.32% కొత్త కేసులు వచ్చాయి.  ఒక్క మహారాష్ట్రలోనే

అత్యధికంగా 62,097 కేసులురాగా, ఆ తరువాత స్థానాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 29,574 , ఢిల్లీలో 28,395 కొత్త కేసులు

నమోదయ్యాయి.

దిగువ చూపిన విధంగా పన్నెండు రాష్ట్రాలలో కరోనా కేసుల పెరుగుదల కనబడుతోంది.  .

చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 21,57,538 కు చేరుకున్నాయి. ఇవి మొత్తం పాజిటివ్ కేసులలో  13.82%. చికిత్సలో

ఉన్నవారి సంఖ్య గత 24 గంటలలో నికరంగా 1,25,561 పెరుగుదల నమోదు చేసుకుంది. ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర,

చత్తీస్ గఢ్, ఉత్తరప్రదే, కర్నాటక, కేరళలోనే చికిత్సలో ఉన్న కేసులు 60.86% ఉన్నాయి.

 

 

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారి నుంచి కోలుకొని బైటపడినవారి సంఖ్య 1,32,76,039 కి చేరింది. జాతీయ స్థాయిలో

కోలుకున్నవారి శాతం 85.01%. గత 24 గంటలలో 1,67,457 మంది కోలుకున్నారు. .

 జాతీయ స్థాయిలో మరణాల శాతం ప్రస్తుతం 1.17% గా నమోదైంది.

గడిచిన 24 గంటలలో 2,023 కరోనా మరణాలు సంభవించాయి. ఈ మరణాలలో పది రాష్ట్రాలవాటా 82.6% కాగా మహారాష్ట్రలో

అత్యధికంగా 519 మంది చనిపోయారు. ఆ తరువాత స్థానంలో ఉన్న ఢిల్లీలో 277 మంది మరణించారు.  

గత 24 గంటలలో కోవిడ్ మరణం ఒకటి కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి. అవి:

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మిజోరం, లక్షదీవులు, నాగాలాండ్, అండమాన్-నికోబార్

దీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

 

****



(Release ID: 1713218) Visitor Counter : 222