ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 12.38 కోట్లు దాటిన కరోనా టీకాలు
10 రాష్టాల్లోనే 79% కరోనా కొత్త కేసులు
మరణాల శాతం 1.91%
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన బీమాపథకం
ఏప్రిల్ 24 వరకు పొడిగింపు, ఆ పై తాజా పాలసీ
Posted On:
19 APR 2021 10:53AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకాల సంఖ్య ఈరోజు 12.38 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 18,37,373 శిబిరాల ద్వారా 12,38,52,566 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 91,36,134 మొదటి డోసులు, 57,20,048 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,12,63,909 మొదటి డోసులు, 55,32,396 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 4,59,05,265 మొదటి డోసులు, 40,90,388 రెండో డోసులు, 45-60 ఏళ్లమధ్య
వారికిచ్చిన 4,10,66,462 మొదటి డోసులు, 11,37,964 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60ఏళ్ళ మధ్యవారు
|
60ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
91,36,134
|
57,20,048
|
1,12,63,909
|
55,32,396
|
4,10,66,462
|
11,37,964
|
4,59,05,265
|
40,90,388
|
12,38,52,566
|
దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలో 59.42% వాటా ఎనిమిది రాష్ట్రాలదే కావటం గమనార్హం
గత 24 గంటలలో 12 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
టీకాల కార్యక్రమం మొదలైన 93 వ రోజైన ఏప్రిల్ 18న 12,30,007 టీకా డోసులివ్వగా అందులో 9,40,725 మంది లబ్ధిదారులు 21,905 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 2,89,282 మందికి రెండో డోస్ ఇచ్చారు
తేదీ: ఏప్రిల్18, 2021 ( 93వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60ఏళ్ళ మధ్యవారు
|
60ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
8,000
|
11,825
|
30,513
|
22,158
|
5,91,469
|
56,205
|
3,10,743
|
1,99,094
|
9,40,725
|
2,89,282
|
దేశంలో రోజువారీ కొత్త కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 2,73,810 కొత్త కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు - మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిలనాడు, గుజరాత్, రాజస్థాన్ లలో 78.58% కేసులు వచ్చాయి. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 68,631 కేసులు రాగా ఉత్తరప్రదేశ్ లో 30,566,
ఢిల్లీలో 25,462 వచ్చాయి.
ఈ క్రింద సూచించిన విధంగా 20 రాష్టాలలో కొత్త కరోనా కేసులు వస్తున్నాయి.
దేశంలో మొత్తం చికిత్సలో ఉన్న కరోనా బాధితుల సంఖ్య 19,29,329 కు చేరుకోగా ఇది పాజిటివ్ కేసులన్నిటిలో 12.81%.
గత 24 గంటలలో నమోదైన చికిత్సలో ఉన్న కేసులు 1,28,013. ఈ కేసుల పెరుగుదలను ఈ చిత్రపటం చూపుతుంది.
ఐదు రాష్ట్రాలు- మహారాష్ట్ర, చతీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ కలసి మొత్తం చికిత్సలో ఉన్న కేసుల్లో 63.18% పొందాయి. .
ఇప్పటిదాకా దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,29,53,821 కాగా, కోలుకున్నవారి శాతం 86.00%.
గత 24 గంటలలో 1,44,178 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. నెలవారీ మరణాల శాతం శాతం ఇప్పుడు 1.91%.
గత 24 గంటలలో 1,619 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో 85.11% వాటా పది రాష్ట్రాలదే. మహారాష్ట్రలో
అత్యధికంగా ఒక్క రోజులో 503 మంది చనిపోగా చత్తీస్ గఢ్ లో 170 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పది ఉన్నాయి. అవి: లద్దాఖ్,డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, సిక్కిం, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, నాగాలాండ్, అండమాన్-నికోబార్
దీవులు, అరుణాచల్ ప్రదేశ్ 2020 మార్చి లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పాకేజ్ ప్రకటించగా దాన్ని 2021 ఏప్రిల్ 24 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
కోవిడ్ 19 మీద పోరులో పాల్గొంటున్న ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించటానికి, ఆ పోరులో పాల్గొంటూ మరణించిన వారి కుటుంబాలకు మనో ధైర్యం కల్పించే క్రమంలో ప్రభుత్వం రూ. 50 లక్షల బీమా వచ్చేలా పాలసీ రూపొందించింది. ఇప్పటివరకు
ఈ విధంగా 287 కుటుంబాలకు బీమా మొత్తం చెల్లింపు జరిగింది. ఇది ఆ కుటుంబాల మనో స్థైర్యాన్ని పెంచింది. ఇప్పుడున్న పథకం ఏప్రిల్ 24 వరకు అమలులో ఉండగా ఆ తరువాత మరో తాజా బీమా పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తుంది.
****
(Release ID: 1712651)
Visitor Counter : 228
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam