ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దాదాపు 12 కోట్లకు చేరిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ


గత 24 గంటలలో 30 లక్షలకు పైగా టీకాలు

79% కొత్త కరోనా కేసులు 10 రాష్ట్రాలనుంచే

Posted On: 17 APR 2021 11:36AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కరోనా టీకాల సంఖ్య దాదాపు 12 కోట్లకు చేరింది.ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం  17,37,539 శిబిరాల ద్వారా 11,99,37,641 డొసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్యసిబ్బందికిచ్చిన 91,05,429 మొదటి డోసులు, 56,70,818 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,11,44,069 మొదటి డోసులు, 54,08,572  రెండో డోసులు,  60 ఏళ్ళు పైబడినవారికిచ్చిన 4,49,35,011 మొదటీ డోసులు,   34,88,257 రెండో డోసులు,

45-60 ఏళ్ళ మధ్య వయసున్న వారికిచ్చిన 3,92,23,975 మొదటి డోసులు, 9,61,510 రెండో డోసులు ఉన్నాయి. 

 

ఆరోగ్య సిబ్బంది

కొవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య వారు

 60 ళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

 

1వడోస్

2వ డోస్

1వడోస్

2వ డోస్

1వడోస్

2వ డోస్

1వడోస్

2వ డోస్

 

91,05,429

56,70,818

1,11,44,069

54,08,572

3,92,23,975

9,61,510

4,49,35,011

34,88,257

11,99,37,641

 

 

 ఎనిమిది రాష్ట్రాలలోనే 59.56% వాటా టీకా డోసుల పంపిణీ జరిగింది.  .

 

 

గడిచిన 24 గంటలలో 30 లక్షలకు పైగా టీకా డోసుల పంపినీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 91 వ రోజైన ఏప్రిల్ 16న

మొత్తం 30,04,544 టీకా డోసులివ్వగా అందులో 22,96,008 మంది లబ్ధిదారులకు 37,817 శిబిరాల ద్వారా మొదటి డోస్,

7,08,536 మందికి రెండో డోస్ ఇచ్చారు. 

తేదీ: ఏప్రిల్ 16, 2021 ( 91వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45- 60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

 1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

22,432

36,184

8,50,545

2,55,681

7,18,862

26,375

7,04,169

3,90,296

22,96,008

7,08,536

 

దేశంలో రోజువారీ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో కొత్తగా 2,34,692 కేసులు నమోదయ్యాయి.  పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, తమిళనాడు. రాజస్థాన్ లోనే మొత్తం కేసుల్లో 79.32% కేసులు వచ్చాయి. ఒక్క మహారాష్ట్రలోనే 63,729 కేసులు రాగా ఉత్తరప్రదేశ్ లో 27,360 ఢిల్లీలో 19,486 కేసులు వచ్చాయి.

ఈ క్రింద చూపిన విధంగా పదహారు రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు పెరుగుతోంది.

 

 

 

 

భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 16,79,740 కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 11.56%. దీనివలన

నికరంగా చికిత్సపొందుతున్నవారి సంఖ్య గత 24 గంటలలో  1,09,997 పెరిగింది. ఐదు రాష్టాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ కలిసి 65.02% కేసులవాటా పొందాయి. ఒక్క మహారాష్ట్రలోనే చికిత్సపొందుతున్న వారు దేశం

 

మొత్తం మీద చికిత్సలో ఉన్నవారిలో 38.09% మంది ఉన్నారు.

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,26,71,220కాగా కోలుకున్నవారి శాతం  87.23%.

గత 24 గంటలలో 1,23,354 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటలలో 1,341 మంది కోవిడ్ తో చనిపోయారు. ఇందులో  

85.83% మంది పది రాష్టాలవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 398 మంది, ఢిల్లీలో 141 మంది చనిపోయారు.  

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి. అవి: లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, సిక్కిం, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్.

.

 

****


(Release ID: 1712461) Visitor Counter : 184