హోం మంత్రిత్వ శాఖ

నాగా గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందాలు పొడిగింపు

Posted On: 12 APR 2021 4:32PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం మరియు నాగాలాండ్  నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ / ఎన్‌కే (ఎన్ఎస్‌సీఎన్‌/ ఎన్‌కే), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ / రిఫార్మేషన్ (ఎన్ఎస్‌సీఎన్‌/ ఆర్) మరియు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ / కే-ఖాంగో (ఎన్ఎస్‌సీఎన్‌ /కే-ఖాంగో) మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు అమలులో ఉన్నాయి. ఎన్ఎస్‌సీఎన్‌/ ఎన్‌కే మ‌రియు ఎన్ఎస్‌సీఎన్‌/ఆర్ సంస్థ‌ల‌తో అమ‌లులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాలను 2021 ఏప్రిల్ 28 నుండి 2022 ఏప్రిల్ 27 వరకు.. ఎన్ఎస్‌సీఎన్‌ /కే-ఖాంగోతో ఉన్న కాల్పుల విర‌మ‌ణ‌
ఒప్పందాన్ని 2021 ఏప్రిల్ 18 నుండి 2022 ఏప్రిల్ 17 వరకు పొడిగించాలని నిర్ణయించారు.  ఈ కాల్పుల విరమణ ఒప్పందాలు 2021 ఏప్రిల్ 12న సంతకం చేయబడ్డాయి.
                                 

*****(Release ID: 1711501) Visitor Counter : 174