ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా-నెదర్లాండ్స్ వర్చువల్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 09 APR 2021 7:32PM by PIB Hyderabad

ఎక్స్ లన్సి,

అభినందన లు, మీ ఆలోచనల ను వెల్లడించినందుకు గాను మీకు అనేక ధన్యవాదాలు.

మీ నాయకత్వం లో మీ పార్టీ వరుస గా నాలుగో సారి పెద్ద విజయాన్ని దక్కించుకొంది. దీనికి గాను ట్విటర్ మాధ్యమం ద్వారా వెనువెంటనే నేను మీకు అభినందనల ను తెలియజేశాను. అయితే ఈ రోజు న వర్చువల్ పద్ధతి లో మనం సమావేశమయ్యాం, అందువల్ల ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొంటూ మిమ్మల్ని నేను మరోసారి అభినందిస్తూ, మీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.

ఎక్స్ లన్సి,

ప్రజాస్వామ్యం, చట్ట పరమైన ఏలుబడి ల వంటి ఉమ్మడి విలువల పై మన సంబంధాలు ఆధారపడి ఉన్నాయి.  జలవాయు పరివర్తన, ఉగ్రవాదం, మహమ్మారి ల వంటి ప్రపంచ సవాళ్ల విషయం లో మన వైఖరి కూడా ఒకే విధం గా ఉంది.  ఇండో-పసిఫిక్ రిజిలియంట్ సప్లయ్ చైన్ స్ , గ్లోబల్ డిజిటల్ గవర్నెన్స్ ల వంటి కొత్త రంగాల పట్ల మన ఆలోచనల లో సైతం పొంతన కుదురుతున్నది.  ఈ రోజు న మనం నీటి పట్ల మన వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఈ బంధాని కి ఒక కొత్త పార్శ్వాన్ని జోడిద్దాం.  పెట్టుబడి ని ప్రోత్సహించడానికి శీఘ్ర గతిన పనిచేసే ఒక యంత్రాంగాన్నంటూ ఏర్పాటు చేయడం కూడా మన బలమైనటువంటి ఆర్థిక సహకారానికి నూతన వేగాన్ని ఇవ్వగలుగుతుంది.  కోవిడ్ అనంతర కాలం లో అనేక కొత్త అవకాశాలు అంది వస్తాయి; మరి ఆ సందర్భం లో మన వంటి భావ సారూప్య దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకొంటాయన్న విశ్వాసం నాకుంది.  

ఎక్స్ లన్సి,

దైర్ మెజస్టీస్ 2019 వ సంవత్సరం లో భారతదేశంలో జరిపిన యాత్ర తో  భారతదేశం- నెదర్లాండ్స్ సంబంధాల కు ఒక కొత్త శక్తి అందింది.  ఈ నాటి మన వర్చువల్ సమిట్ ఈ సంబంధాల కు మరింత గతి ని జత చేస్తుంది అన్న విశ్వాసం నాకుంది.

ఎక్స్ లన్సి,

భారతీయ ప్రవాసుల విషయం లో మీరు ప్రస్తావించిన మాదిరి గానే,  భారతీయ మూలాలు కలిగిన ప్రజలు పెద్ద సంఖ్య లో యూరోపు లో నివసిస్తున్నారన్న మాట నిజం; అయితే, ఈ కరోనా కాలం లో భారతీయ మూలాలు కలిగిన ప్రజల పట్ల మీరు చూపిన కరుణ కు, శ్రద్ధ కు గాను మీకు నేను నా హృద‌య‌పూర్వక కృత‌జ్ఞ‌త‌ల ను వ్యక్తం చేస్తున్నాను.  మనం సిఒపి-26 సందర్భం లోను, యూరోపియన్ యూనియన్ తో ఇండియా-ఇయు సమిట్ జరిగే సందర్భం లోను మనకు వివిధ అంశాలను చర్చించే అవకాశాలు అందనున్నాయి.

అస్వీకరణ:  ప్రధాన మంత్రి ప్రసంగానికి ఉజ్జాయింపు అనువాదం ఇది.  సిసలు ప్రసంగం హిందీ భాష లో సాగింది.
 


 

***

 



(Release ID: 1710950) Visitor Counter : 160