ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

9.8 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసులు గత 24 గంటల్లో 34 లక్షలకు పైగా టీకాలు


రోజువారీ సగటు టీకాల సంఖ్యలో భారత్ దే పైచేయి

10 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనాకేసుల ఉద్ధృతి

దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో 45.65% కోవిడ్ బాధితులు

Posted On: 10 APR 2021 11:56AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 9.8 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం

14,75,410 శిబిరాల ద్వారా 9,80,75,160 టీకాల పంపిణీ జరిగింది.   ఇందులో 89,88,373 డోసులు ఆరోగ్య సిబ్బంది కిచ్చిన

మొదటి డోసులు కాగా 54,79,821 రెండో డోసులు. అదే విధంగా 98,67,330 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు

కాగా 46,59,035 రెండో డోసులున్నాయి.  60 ఏళ్ళు పైబడ్డవారు 3,86,53,105 మొదటి డోసులు తీసుకోగా 15,90,388 రెండో

డోసులు అందుకున్నారు. 45-6- ఏళ్ళ మధ్య వారు   2,82,55,044  మొదటి డోసులు,   5,82,064 రెండో డోసులు తీసుకున్నారు.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

 45-60 ఏళ్ళ మధ్య వారు

 60 ఏళ్ళు దాటినవారు

 

మొత్తం

1వ  డోస్

2వ డోస్

1వ  డోస్

2వ డోస్

1వ  డోస్

2వ డోస్

1వ  డోస్

2వ డోస్

89,88,373

54,79,821

98,67,330

46,59,035

2,82,55,044

5,82,064

3,86,53,105

15,90,388

9,80,75,160

 

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకాలలో 60.62% వాటా ఎనిమిది రాష్ట్రాలదే. 

 

గడిచిన 24 గంటలలో 34 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 84వ రోజైన ఏప్రిల్ 9న

34,15,055 టీకాలివ్వగా అందులో 46,207 శిబిరాల ద్వారా 30,06,037 మంది మొదటి డోస్ అందుకోగా  4,09,018 మంది

రెండో డోస్ తీసుకున్నారు. 

తేదీ: ఏప్రిల్ 9, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ వారు

60 ఏళ్ళు దాటిన వారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

11,975

29,051

53,152

1,11,697

19,79,517

54,504

9,61,393

2,13,766

30,06,037

4,09,018

 

ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్న రోజువారీ టీకా డోసుల సంఖ్య దృష్ట్యా చూస్తే భారత దేశం రోజుకు సగటున 38,93,288 డోసులతో ముందుంది.

రోజువారీ కొత్త కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 1,45,384 కొత్త కేసులు నమోదయ్యాయి.  

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తో కూడిన పది రాష్ట్రాలలో

కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది. ఈ రాష్ట్రాలవాటా 82.82% ఉండటం గమనార్హం.  మహారాష్ట్రలో అత్యధికంగా 58,993 కొత్త

కేసులు రాగా, చత్తీస్ గఢ్ లో11,447, ఉత్తరప్రదేశ్ లో 9,587 నమోదయ్యాయి.

 

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య   10,46,631 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 7.93%.  గత 24 గంటలలో

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య నికరంగా 67,023 పెరిగింది. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ అనే ఐదు రాష్ట్రాల ఉమ్మడి వాటా ఇందులో 72.23% కాగా ఒక్క మహారాష్ట్రలోనే

51.23% కేసులు చికిత్సలో ఉండటం గమనార్హం.  

 

 

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులలో కేవలం 10 జిల్లాల్లోనే 45.65% కేసులు ఉండటం గమనార్హం.

 దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారు 1,19,90,859 కాగా జాతీయ స్థాయి కోలుకున్నవారిశాతం 90.80% ఉంది.

గత 24 గంటలలో 77,567 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. గత 24 గంటలలో 794 మంది కోవిడ్ తో చనిపోయారు.

 తాజా మరణాలలో 86.78% వాటా పది రాష్ట్రాలదేమహారాష్ట్రలో అత్యధికంగా  301 మంది చనిపోగా 91 మరణాలతో చత్తీస్ గఢ్

 రెండో స్థానంలో ఉంది.  

గడిచిన 24 గంటలలో పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: పుదుచ్చేరి, లద్దాఖ్,

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, అండమాన్-నికోబార్

దీవులు, అరుణాచల్ ప్రదేశ్.   

 

****



(Release ID: 1710878) Visitor Counter : 202