ప్రధాన మంత్రి కార్యాలయం
వర్చువల్ మాధ్యమం ద్వారా భారతదేశాని కి, సెశెల్స్ కు మధ్య జరుగనున్న ఉన్నత స్థాయి కార్యక్రమం (ఏప్రిల్ 8, 2021)
Posted On:
07 APR 2021 5:35PM by PIB Hyderabad
సెశెల్స్ లో భారతదేశాని కి చెందిన అనేక పథకాల ను ప్రారంభించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెశెల్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ వేవెల్ రామ్ కలావన్ తో పాటు ఈ నెల 8న ఒక ఉన్నత స్థాయి వర్చువల్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.
వర్చువల్ మాధ్యమం ద్వారా జరిగే ఈ ఉన్నత స్థాయి కార్యక్రమం లో..
ఎ) సెశెల్స్ లో మేజిస్ట్రేట్స్ కోర్టు తాలూకు కొత్త భవనాన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కలసి ప్రారంభించడం;
బి) సెశెల్స్ కోస్తా తీర రక్షక దళానికి ఒక ఫాస్ట్ పాట్రల్ వెసల్ అప్పగింత;
సి) ఒక మెగా వాట్ సౌర విద్యుత్తు ప్లాంటు అప్పగింత;
డి) పది హై ఇమ్పాక్ట్ కమ్యూనిటీ డివెలప్ మెంట్ ప్రాజెక్ట్ స్ (హెచ్ఐసిడిపి స్) ను ప్రారంభించడం.. వంటి కార్యాలు భాగం గా ఉంటాయి
సెశెల్స్ రాజధాని నగరం విక్టోరియా లో నిర్మాణం జరిగిన మేజిస్ట్రేట్స్ కోర్టు నూతన భవనం భారతదేశం పక్షాన మంజూరైన ఆర్థిక సహాయం తో కొలువుదీరిన ఒకటో ప్రధాన పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. మేజిస్ట్రేట్స్ కోర్టు ఒక అత్యాధునిక భవనం. ఇది సెశెల్స్ న్యాయవ్యవస్థ సామర్ధ్యాన్ని గణనీయం గా పెంపొందించడం తో పాటు సెశెల్స్ ప్రజానీకానికి ఉత్తమమైన న్యాయ సేవలను అందించడం లో తోడ్పడనుంది.
50-ఎమ్ ఫాస్ట్ పాట్రల్ వెసల్ అనేది ఒక ఆధునికమైనటువంటి, అన్ని హంగుల తో కూడినటువంటి నౌకాదళ ఓడ. దీనిని భారతదేశం లోని కోల్‌కాతా లో గల మెస్సర్స్ జిఆర్ఎస్ఇ నిర్మించింది. సముద్ర సంబంధిత గస్తీ సామర్ధ్యాల ను బలోపేతం చేయడం కోసమని భారతదేశం తరఫున ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి, ఈ ఓడ ను నిర్మించి సెశెల్స్ కు ఒక బహుమతి గా అందించడం జరుగుతోంది.
సెశెల్స్ అమలు చేయతలపెట్టిన ‘సోలర్ పివి డెమోక్రటైజేశన్ ప్రాజెక్టు’లో భాగం గా సెశెల్స్ లోని రోమన్ విల్లే దీవి లో ఒక మెగా వాట్ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్లాంటు ను నిర్మించడం జరిగింది. దీని నిర్మాణాని కి భారత ప్రభుత్వం గ్రాంటు రూపం లో సహాయాన్ని అందించింది.
వర్చువల్ మాధ్యమం ద్వారా 10 హై ఇమ్పాక్ట్ కమ్యూనిటీ డివెలప్ మెంట్ ప్రాజెక్ట్ స్ (హెచ్ఐసిడిపి స్) ను అప్పగించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ను స్థానిక సంస్థ లు, విద్యా సంస్థ లు, వృత్తి విద్యా సంస్థ ల సహకారం తో భారతదేశ హై కమిశన్ తీర్చిదిద్దింది.
ప్రధాన మంత్రి దార్శనికత లో భాగం అయిన ‘సాగర్’ (‘ఎస్ఎజిఎఆర్’ - సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫార్ ఆల్ ఇన్ ద రీజియన్) లో సెశెల్స్ ఒక కేంద్రీయ స్థానాన్ని కలిగి ఉంది. ఈ కీలక ప్రాజెక్టు ల ప్రారంభోత్సవం సెశెల్స్ తన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భద్రత పరమైన అవసరాల ను తీర్చుకోవడం లో భారతదేశం సెశెల్స్ కు ఒక ప్రత్యేకమైన, కాల పరీక్ష కు తట్టుకొని నిలచిన విశ్వసనీయ భాగస్వామ్య దేశం గా ఉందనే విషయాన్ని చాటి చెప్పడమే కాకుండా భారతదేశం ప్రజల కు, సెశెల్స్ ప్రజల కు మధ్య గాఢమైన మైత్రి సంబంధాలు నెలకొన్నాయనడానికి ఒక నిదర్శనం గా కూడా నిలుస్తోంది.
***
(Release ID: 1710209)
Visitor Counter : 251
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam