ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మొత్తం 8.7 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసులు; నిన్న ఒక్కరోజే 33 లక్షల డోసులు


ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలిచ్చిన దేశంగా భారత్ 8 రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
కేసులు పెరుగుతున్న రాష్ట్రాలమీద కేంద్రం ప్రత్యేక దృష్టి

Posted On: 07 APR 2021 11:46AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 8 కోట్ల 70 లక్షలు దాటింది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 13,32,130 శిబిరాల ద్వారా 8,70,77,474 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన   89,63,724 మొదటి డోసులు, 53,94,913 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన  97,36,629 మొదటి డోసులు,   43,12,826 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  3,53,75,953 మొదటొ డోసులు,  10,00,787 రెండో డోసులు, 45 ఏళ్ళు 2,18,60,709 మొదటి డోసులు,   4,31,933 రెండో డోసులు కలిసి ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45ళ్ళు దాటినవారు

60 ఏళ్ళు దాటినవారు

 మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,63,724

53,94,913

97,36,629

43,12,826

2,18,60,709

4,31,933

3,53,75,953

10,00,787

8,70,77,474

గత 24 గంటలలో 33 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 81వ రోజైన ఏప్రిల్ 6న  

33,37,601 డోసులివ్వగా అందులో  30,08,087 మంది లబ్ధిదారులకు  41,396 శిబిరాల ద్వారా మొదటి డోసులివ్వగా 3,29,514 లబ్ధిదారులకు రెండో డోసులిచ్చారు.

తేదీ : ఏప్రిల్ 6, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ వారు

60 ఏళ్ళు దాటినవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

 

3,254

21,899

17,568

1,07,050

19,70,693

39,424

10,16,572

1,61,141

30,08,087

3,29,514

 

మరో కీలకమైన పరిణామంలో భారతదేశం టీకాల పంపిణీలో అమెరికాను దాటి ప్రపంచంలో అత్యధిక టీకా డోసులు పంపిణీ చేసిన మొదటి దేశంగా నిలిచింది. భారత లో రోజుకు ఇచ్చిన సగటు టీకాల సంఖ్య  30,93,861 గా నమోదైంది. 

 

భారతదేశంలొ కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటలలో 1,15,736 కొత్త కేసులు నమోదయ్యాయి.   ఎనిమిది రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ లో అత్యధికంగా కేసులు వస్తుండగా మొత్తం కేసులలో 80.70% వాటా ఈ ఎనిమిది రాష్ట్రాలదే. మహారాష్ట్రలో అత్యధికంగా

55,469 కేసులు రాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న చతీస్ గఢ్ లో  9,921 కేసులు, కర్నాటకలో 6,150 కేసులు వచ్చాయి 

ఈ దిగువ చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల నమోదవుతూ వస్తోంది.

 

 

రోజువారీ పాజిటివ్ శాతం పెరుగుతూ ప్రస్తుతం 8.40% వద్ద నిలిచింది

 

దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు  8,43,473 కి చేరాయి. ఇది ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 6.59%, గత 24 గంటలలో చికిత్సలో ఉన్నకేసుల నికర పెరుగుదల   55,250. ఇందులో  74.5% కేవలం మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలదే.  ఒక్క మహారాష్ట్రలొనే దేశంలోని 56.17% చికిత్సపొందుతున్న కేసులున్నాయి.

 

కేంద్రం వివిధ  రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలితప్రాంతాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, ముఖ్యంగా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఏప్రిల్ 4న ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం  జరపగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోవిడ్ పరిస్థితిని ఆయన సమీక్షించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  రోజువారీ కొత్త కెసులు, మరణాలను సమీక్షించారు. తీసుకుంతున్న జాగ్రత్తలను కూడా చర్చించారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రెండువారాలుగా రోజువారీ జరుపుతున్న సమీక్షల వివరాలను మరోమారు ఈ సమావేశం చర్చించింది. కేంద్రం  మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు సహాయంగా 50 ఉన్నతస్థాయి బృందాలను పంపటాన్ని కూడా చర్చించారు.ఈ బృమ్దాలు మూడు రోజులుగా అక్కడే ఉండి పరిస్థితిని అంచనావేస్తున్నాయి.   


దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి బైటపడ్డవారు 1,17,92,135 మంది కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 92.11%. గత 24 గంటలలో 59,856 మంది కోలుకున్నారు. చికిత్సలో ఉన్న కేసులు, కోలుకున్న కేసుల సమాచారాన్ని ఈ దిగువ చిత్రపటం చూపుతుంది.

 

దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిని ఈ దిగువ చిత్రపటం చూపుతోంది.

 

గడిచిన 24 గంటలలో 630 కోవిడ్ మరణాలు నమొదయ్యాయి. అందులో  8 రాష్ట్రాల వాటా 84.44% కాగా ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 297 మరణాలు, ఆ తరువాత పంజాబ్ లో 61 మరణాలు నమోదయ్యాయి.  

 

కోవిడ్ బాధితులలో మరణాల శాతం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1.30% వద్ద నిలిచింది..

 

గత 24 గంటలలో 11 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఒడిశా, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, లక్షదీవులు, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్

***



(Release ID: 1710053) Visitor Counter : 233