సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 45 ఏళ్లు లేదా ఆ వయసు దాటిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కొవిడ్ టీకా తీసుకోవాలని సూచన
Posted On:
06 APR 2021 5:19PM by PIB Hyderabad
కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు, 45 ఏళ్లు లేదా 45 ఏళ్లు దాటిన దాటిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కొవిడ్ టీకా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజేషన్, మాస్కు లేదా ముఖ కవచం ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కొవిడ్ సంబంధిత ప్రవర్తనతో మెలగాలని 'కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ' తన ఆదేశంలో సూచించింది.
కొవిడ్ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకొచ్చిన సామూహిక టీకా కార్యక్రమంలో భాగంగా, 45 ఏళ్లు లేదా ఆ వయసు దాటినవారంతా ప్రస్తుతం టీకా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
కరోనా వ్యాప్తిని అడ్డుకునే నివారణ చర్యల్లో భాగంగా మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోందని తన ఆదేశ ప్రతిలో 'కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ' పేర్కొంది.
***
(Release ID: 1709968)
Visitor Counter : 206