ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో రికార్డ్ స్థాయిలో ఒక్క రోజులో 36.7 లక్షలకు పైగా టీకా డోసులు ఇప్పటివరకు 6.87కోట్లకు పైగా టీకాలు
కొత్త కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్
Posted On:
02 APR 2021 12:07PM by PIB Hyderabad
గత 24 గంటలలో 36.7 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసులివ్వటం ద్వారా ఒక్క రోజులో అత్యధిక టీకాలతో భారతదేశం మరో మైలురాయి దాటింది. టీకాల కార్యక్రమం మొదలైన 76వ రోజైన ఏప్రిల్ 1న 36,71,242 డోసుల టీకాలు ఇవ్వగా అందులో 33,65,597 మంది లబ్ధిదారులు 51,215 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 3,05,645 మంది రెండో డోస్ అందుకున్నారు.
తేదీ: ఏప్రిల్ 1, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 - 60 ఏళ్లమధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2nd Dose
|
1వ డోస్
|
2ndDose
|
1వ డోస్
|
2ndDose
|
1వ డోస్
|
2ndDose
|
45,976
|
33,860
|
1,78,850
|
1,51,838
|
19,46,948
|
21,552
|
11,93,823
|
98,395
|
33,65,597
|
3,05,645
|
ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్నిబట్టి 11,37,456 శిబిరాల ద్వారా 6,87,89,138 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 83,06,269 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 52,84,564 డోసులు వారికిచ్చిన రెండో డోసులు, 93,53,02 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 40,97,634డోసులు వారికిఒచ్చిన రెండో డోసులు, 97,83,615 డోసులు 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకిచ్చిన మొదటి డోసులు, 39,401డోసులు వారికిచ్చిన రెండో డోసులు, 3,17,05,893 డొసులు 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు, 2,18,741 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 - 60 ఏళ్లమధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
83,06,269
|
52,84,564
|
93,53,021
|
40,97,634
|
97,83,615
|
39,401
|
3,17,05,893
|
2,18,741
|
6,87,89,138
|
మొత్తం ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ డోసులలో 59.58% కేవలం 8 రాష్ట్రాలలో ఇచ్చినవే కాగా మహారాష్ట్రలోనే అత్యధికంగా 9.48% డోసులు తీసుకున్నారు. .
రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 8 రాష్ట్రాలలో ఎక్కువగా నమోదవుతున్నాయి. అవి: మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. కొత్త కేసులలో 81.25% వాటాఈ రాష్టాలదే.
గడిచిన 24 గంటలలో 81,466 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 43,183 కేసులు, చత్తీస్ గఢ్ లో 4,617 కర్నాటకలో 4,234 కేసులు వచ్చాయి.
క్రింద చూపిన పది రాష్ట్రాలలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది.
భారత దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 6,14,696 కాగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 5%. గత 24 గంటలలో కొత్తకేసులు, డిశ్చార్జ్ అయినవారిని లెక్కలోకి తీసుకున్నప్పుడు నికరంగా చికిత్సలో ఉన్న 30,641 కేసులు పెరిగాయి.
చికిత్సలో ఉన్న కేసులు ఐదు రాష్ట్రాలు. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్, కేరళ, పంజాబ్ కలసి 77.91% వాటా ఉండగా మహారాష్ట్ర లొనే 59.84% కేసులున్నాయి.
భారతదేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారు 1,15,25,039 కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 93.68%.
గత 24 గంటలలో 50,356 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో నమొదైన కోవిడ్ మరణాలలో
83.16% ఆరు రాష్ట్రాలలోనే నమోదు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 249 మంది, పంజాబ్ లో 58 మంది చనిపోయారు.
గత 24 గంటలలో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఒడిశా, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షదీవులు, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1709225)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam