మంత్రిమండలి
భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ ల చట్టాల (సవరణ) బిల్లు-2020కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
05 FEB 2020 1:44PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దిగువ పేర్కొన్న అంశాలకు ఆమోదం తెలిపింది:-
i. భారతీయ సమాచార సాంకేతిక విద్యా సంస్థల చట్టాల (సవరణ) బిల్లు-2020ని ప్రవేశపెట్టడం.
ii. దేశం లోని 20 ఐఐఐటి (పిపిపి)లలో ఒక్కొక్కటి, ఐఐఐటిడిఎమ్, కర్నూలు (ఐఐటి-సిఎఫ్‌టిఐ)లో ఒకటి వంతున 21 డైరెక్టర్ పోస్టుల కు ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం.
iii. దేశం లోని 20 ఐఐఐటి (పిపిపి)లలో ఒక్కొక్కటి, ఐఐఐటిడిఎమ్, కర్నూలు (ఐఐటి-సిఎఫ్‌టిఐ)లో ఒకటి వంతున 21 రిజిస్ట్రార్ పోస్టుల కు ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం.
ప్రభావం
ఈ బిల్లు ద్వారా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లోని ప్రస్తుత 15 ఐఐఐటిలతో పాటు మిగిలిన 5 ఐఐఐటి లు కూడా పట్టా ప్రదానం చేయగల అధికారాల తో ‘‘జాతీయ ప్రాధాన్య సంస్థ లు’’గా ప్రకటించబడతాయి. ఆ మేరకు ‘బాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బి.టెక్) లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎం.టెక్) లేదా పిహెచ్.డి పేర్లతో ఒక విశ్వవిద్యాలయం లేదా జాతీయ ప్రాధాన్య విద్యా సంస్థల తరహా లో పట్టా ప్రదానం చేసే అధికారం ఈ విద్యా సంస్థల కు దఖలు పడుతుంది. అంతేకాకుండా సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం లో దేశాని కి బలమైన పరిశోధ పునాది దిశ గా తగిన సంఖ్య లో విద్యార్థుల ను ఈ సంస్థ లు ఆకర్షించగలుగుతాయి.
వివరాలు
i. భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ ల చట్ట (సవరణ) బిల్లు-2020ని ప్రవేశపెట్టడం లోని ప్రధాన లక్ష్యం 2014, 2017 సంవత్సరాల కు చెందిన అసలు చట్టాల ను సవరించడం.
ii. సూరత్, భోపాల్, భాగల్ పుర్, అగర్ తలా, రాయ్‌చూర్ లలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లో గల 5 భారత సమాచార సాంకేతిక సంస్థల కు ఈ రంగం లోని ప్రస్తుత 15 ఐఐఐటిల తో సమానం గా చట్టబద్ధ హోదా మంజూరు. తద్వారా వాటి ని కూడా భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ ల (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) చట్టం-2017 కింద జాతీయ ప్రాధాన్య సంస్థలు గా ప్రకటించడం.
సూరత్, భోపాల్, భాగల్ పుర్, అగర్ తలా, రాయ్‌చూర్‌ల లోని ఐఐఐటిల కు అధికార హోదా ను కల్పించడమే కేంద్ర మంత్రివర్గ ఆమోదం యొక్క లక్ష్యం గా ఉంది. ఈ 5 ఐఐఐటి లు సొసైటీల రిజిస్ట్రేశన్ చట్టం-1860 కింద సొసైటీలు గా నమోదై ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యం లో తాజా సవరణ బిల్లు వల్ల మిగిలిన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లో నడుస్తున్న 15 ఐఐఐటి ల తరహా లో ఈ 5 ఐఐఐటి లు కూడా (పిపిపి) చట్టం-2017 పరిధి లోకి వస్తాయి. అంతేకాకుండా భారత ఐఐఐటి విద్యాసంస్థ ల చట్టం-2014 కింద ఏర్పాటైన ఐఐఐటి, అలహాబాద్; ఐఐఐటిఎమ్, గ్వాలియర్; ఐఐఐటిడిఎమ్, జబల్ పుర్; ఐఐఐటిడిఎమ్, కాంచీపురం సంస్థ ల తరహా లో ఐఐఐటిడిఎమ్, కర్నూలు కూడా ఏర్పాటై పనిచేస్తోంది. ఈ ఐఐఐటిల లో డైరెక్టర్, రిజిస్ట్రార్ పోస్టు లు ఉండగా, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తో వీటి కి ఎటువంటి అదనపు ఆర్థిక భారం తో నిమిత్తం లేకుండా అధికార ముద్ర పడింది.
పూర్వరంగం
I. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం లో ఉన్నత విద్య ను ప్రోత్సహించడ లక్ష్యం గా ఈ ఐఐఐటి లు రూపు దిద్దుకున్నాయి.
II. ఈ పథకం కింద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లో 20 కొత్త ఐఐఐటి (పిపిపి)ల ను స్థాపించేందుకు కేంద్ర మంత్రివర్గం 2010వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ న ఆమోదం తెలిపింది. ఆ మేరకు 15 ఐఐఐటి లు ఇప్పటికే ఐఐఐటి (పిపిపి) చట్టం-2017 పరిధి లో ఉండగా, మిగిలిన 5 ఐఐఐటి లు ఇప్పుడు ఆ పరిధి లోకి రానున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల కు పరిష్కారాన్వేషణ లో భాగం గా విజ్ఞాన వ్యాప్తి లక్ష్యం గా ప్రభుత్వం చేపట్టిన విశిష్ట చర్యల కు భారతీయ ఐఐఐటి విద్యాసంస్థ ల చట్టం-2014, భారతీయ ఐఐఐటి (పిపిపి) విద్యాసంస్థ ల చట్టం-2017 నిదర్శనం గా నిలుస్తున్నాయి.
***
(Release ID: 1708486)
Visitor Counter : 146
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam