ప్రధాన మంత్రి కార్యాలయం

ఈశాన్య ప్రాంతం దేశం లో ఓ ప్రధాన వృద్ధి చోదక శక్తి గా మారుతోందన్న ప్రధాన మంత్రి


దశాబ్దాల తరబడి సాగిన బోడో సంక్షోభాన్ని సంబంధిత వర్గాలన్నిటిని ఒక చోటు కు తీసుకు రావడం ద్వారా పరిష్కరించడమైంది

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి లోక్ సభ లో సమాధానమిచ్చిన ప్రధాన మంత్రి

Posted On: 06 FEB 2020 5:48PM by PIB Hyderabad

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి లోక్ సభ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం లో భాగం గా, ఈశాన్య ప్రాంతం ఇక మీదట నిర్లక్ష్యాని కి లోనైన ఒక ప్రాంతం ఏమీ కాదు అని స్పష్టం చేశారు.

 

అనేక రంగాల లో ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందా అన్నట్టు ప్రస్తుతం ఈశాన్య ప్రాంతాలు దేశం లో ఒక ప్రధానమైనటువంటి వృద్ధి సంబంధిత చోదక శక్తి గా మారాయని ఆయన పేర్కొన్నారు.

 

‘‘ఢిల్లీ ఒక దూరం లో ఉన్న ప్రాంతం అని ఈశాన్య ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం అనుకోవడం లేదు.  ఇక ప్రభుత్వమే వారి ఇంటి వాకిట వాలింది.  మన మంత్రులు మరియు మన అధికారులు ఆ ప్రాంతాల ను క్రమం తప్పక సందర్శిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

 

విద్యుచ్ఛక్తి, రైలు మార్గ సంధానం, మొబైల్ సంధానం లతో పాటు ఆ ప్రాంతాల అభివృద్ధి కి సంబంధించినటువంటి మిగతా వివిధ అంశాల విషయం లో కూడాను తన ప్రభుత్వం శ్రమించిందని ప్రధాన మంత్రి తెలిపారు.

 

ఇటీవలే సంతకాలు అయిన బోడో ఒడంబడిక ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దశాబ్దాల చరిత్ర ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించాలనే ఒక నిజాయతీ తో సంబంధిత వర్గాల వారందరినీ ఒక చోటు కు తీసుకు రావడం వల్ల ఇది సాధ్యపడినట్లు పేర్కొన్నారు.

 

దశాబ్దుల నాటి అశాంతి ని సాగదీస్తూవచ్చినంత మాత్రాననే అది తక్కువ లో తక్కువ గా 40,000 మంది ప్రజలు చనిపోవడానికి దారితీసింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘ఇలా జరిగినప్పటికి ఈ పర్యాయం మేము సంబంధిత వర్గాలవారందరిని కలిపి ఒక చోటు కు తీసుకు వచ్చాము;  సంక్షోభానికి సంబంధించి అనిర్ణీత స్థితి లో ఉన్న సమస్య లు అంటూ ఏవీ లేవన్న సంగతి ని కూడా ఈ ఒడంబడిక స్పష్టం చేస్తోంది’’ అని ఆయన వివరించారు.

***



(Release ID: 1708292) Visitor Counter : 160