ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కోవిడ్ కేసులలో 80% వాటా మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలదే


5.8 కోట్ల డోసులతో టీకాలివ్వటంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్
మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో 50 లక్షలకు పైగా టీకాలు

Posted On: 27 MAR 2021 11:19AM by PIB Hyderabad

రోజువారీ కొత్త కోవిడ్ కేసులు అత్యధికంగా వస్తున్న ఆరు రాష్ట్రాలలో మహారాష్ట్ర, పంజాబ్,  చత్తీస్ గఢ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ లోనే 79.57%  కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  62,258  కొత్త కేసులు రాగా మహారాష్ట్రలో అత్యధికంగా 36,902, పంజాబ్ లో 3,122, చత్తీస్ గఢ్ లో 2,665 కొత్తకేసులు నమోదయ్యాయి.

 

 

 ఈ క్రింద పేర్కొన్న విధంగా పది రాష్ట్రాలలో కొత్త కేసుల పెరుగుదల కనబడుతోంది.

 

 

 

భారతదేశ వ్యాప్తంగా చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ఈ రోజుకు  4,52,647 కు చేరింది. ఇది ఇప్పటిదాకా వ్యాధి సోకిన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 3.8%. గత 24 గంటలలో నికరంగా పెరిగిన చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య   31,581. ఈ సంఖ్యలో మహారాష్ట్రమ్ కేరళ, పంజాబ్ రాష్ట్రాల వాటా 73%

మరోవైపు దేశవ్యాప్తంగా వేసిన టీకా డోసుల సంఖ్య 5.8-కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 9,45,168 శిబిరాల ద్వారా 5,81,09,773 టీకా డోసుల పంపిణీ జరిగింది.   ఇందులో  80,96,687 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోస్ కాగా 51,44,011 డోసులు వారికిచ్చిన రెండో డోసులు, అదే విధంగా   87,52,566 డోసులు కోవిడ్ యోధుల మొదటి డోసులు. 35,39,144 డోసులు వారికిచ్చిన రెండో డోసులు, 61,72,032 డోసులు 45 ఏళ్ళు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారి మొదటి డోసులు,   2,64,05,333 డోసులు 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు కలిసి ఉన్నాయి.   

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్లున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్దవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

80,96,687

51,44,011

87,52,566

35,39,144

61,72,032

2,64,05,333

5,81,09,773

 

 2021 మార్చి 25 నాటికి ప్రపంచంలో అత్యధికంగా టీకా డోసులు ఇచ్చిన దేశాలలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.

 భారత్ లోను, ఇతరదేశాలలోను టీకాల పంపిణీ వేగాన్ని ఈ క్రింది చిత్ర పటం చూపుతుంది.

..

 దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలో 60% టీకాలు కేవలం ఎనిమిది రాష్ట్రాలలోనే  ఇవ్వటం గమనార్హం. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఒక్కొక్కటీ 50 లక్షలకు పైగా టీకాలిచ్చాయి.

 టీకాల కార్యక్రమం మొదలైన 70వ రోజైన ఫిబ్రవరి 26 నాడు 26,05,333 టీకాడోసులిచ్చారు. అందులో  24,25,146 మంది లబ్ధిదారులు  43,281 శిబిరాల ద్వారా  మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కాగా 1,80,187 మమ్ది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది.

తేదీ : మార్చి 26, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

62,140

39,613

1,52,585

1,40,574

5,72,260

16,38,161

24,25,146

1,80,187

 

రోజువారీ సగటు టీకా డోసులు క్రమంగా పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.   

 

దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకొని బైటపడినవారి మొత్తం సంఖ్య పెరుగుతూ నేటికి1,12,95,023 కి చేరింది. ఇది కోలుకున్నశాతాన్ని   94.84% కి చేర్చింది.  గత 24 గంటలలో 30,386  మంది కోలుకున్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 17,019 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో 291 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో ఐదు రాష్ట్రాలలోనే 75.6% మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే  112 మంది,  పంజాబ్ లో 59 మంది చనిపోయారు.

 

పద్నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో  ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.  అవి: అస్సాం, ఒడిశా, పుదుచ్చేరి, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లక్షదీవులు, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ 

***



(Release ID: 1708083) Visitor Counter : 206