ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, చత్తీస్ గఢ్, తమిళనాడులో కోవిడ్ కేసుల పెరుగుదల, కొత్త కేసుల్లో 81% వాటా
5 కోట్లకు దగ్గరవుతున్న కోవిడ్ టీకాల సంఖ్య గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 32,53,095 టీకాల పంపిణీ
Posted On:
23 MAR 2021 11:40AM by PIB Hyderabad
ఆరు రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, చత్తీస్ గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల నమొదవుతూ వస్తోంది. గత 24 గంటలలో 40,715 తాజా కోవిడ్ కేసులు నమోదు కాగా ఈ ఆరు రాష్ట్రాలలోనే 80.90% కేసులు ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవటం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆ రాష్టంలో అత్యధికంగా 24,645 (60.53%)కేసులు నమోదు కాగా ఆ తరువాత స్థానంలొ ఉన్న పంజాబ్ లో 2,299 కేసులు, గుజరాత్ లో while 1,640 కేసులు వచ్చాయి.
ఈ క్రింద స్పష్టంగా పేర్కొన్న పది రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల నమోదవుతూ వస్తోంది.
దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య కూడా ఫిబ్రవరి మధ్యలో బాగా దిగువ స్థాయికి చేరినా, ఇప్పుడు మళ్ళీ పెరుగుదలబాటలో సాగుతోంది. ఈరోజు అది 3.45 లక్షల స్థాయి (3,45,377) దాటింది. గత 24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 10,731 మేర పెరుగుదల నమోదు చేసుకున్నాయి.
దేశమంతటా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులలో మూడు రాష్ట్రాలు – మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ మాత్రమే 75.15% వాటా నమొదు చేసుకోవటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే 62.71% కేసులున్నాయి.
దేశంలో కోవిడ్ కేసులు రెట్టింపు కావటానికి పడుతున్న సమయాన్ని ఈ క్రించి చిత్రపటం చూపుతోంది. 2021 మార్చి 1న రెట్టింపయ్యే వ్యవధి 504.4 కాగా 2021 మార్చి 23 నాటికి అది 202.3 కు చేరింది.
ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం 7,84,612 శిబిరాల ద్వారా 4.8 కోట్లకు పైగా (4,84,94,594) టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో మొదటి డోస్ టీకాల సంఖ్య ఈ రోజు 4 కోట్లు దాటి, 4,06,31,153 కు చేరింది. ఇందులో 78,59,579 డోసులు ఆరోగ్య సిబ్బందికి ఇచ్చిన మొదటి డోస్, 49,59,964 మంది ఆరోగ్య సిబ్బందికి ఇచ్చిన రెండో డోస్, 82,42,127 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోస్, 29,03,477 డొసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోస్, 42,98,310 మంది 45-60 ఏళ్ల దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల మొదటి డోస్, దాదాపు 2 కోట్ల (2,02,31,137) మంది మొదటి డోస్ అందుకున్న 60 ఏళ్లపైబడ్డవారు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్లమధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
78,59,579
|
49,59,964
|
82,42,127
|
29,03,477
|
42,98,310
|
2,02,31,137
|
4,84,94,594
|
టీకాల కార్యక్రమం మొదలైన 66వ రోజైన మార్చి 32 లక్షలకు పైగా (32,53,095) టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో48,345 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకున్న 29,03,030 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు ఉండగా 3,50,065 మంది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
తేదీ: మార్చి 22, 2021
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్లమధ్య
దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
|
69,929
|
73,804
|
1,42,159
|
2,76,261
|
5,59,930
|
21,31,012
|
29,03,030
|
3,50,065
|
|
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి కోలుకున్నవారుt 1,11,81,253 మంది కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 95.67% గా నమోదైంది. గత 24 గంటలలో 29,785 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 199 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో ఆరు రాష్ట్రాలవాటా 80.4%. మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలలో అత్యధికంగా 58 మంది చొప్పున కోవిడ్ తో చనిపోగా కేరళ, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో 12 మంది చొప్పున చనిపోయారు.
గత 24 గంటలలో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవిళ్ జమ్మూ-కశ్మీర్, గోవా, ఉత్తరాఖండ్, ఒడిశా, లక్షదీవులు, సిక్కిం, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్.
****
(Release ID: 1706918)
Visitor Counter : 250
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam