ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కోవిడ్ కేసుల్లో 80% పైగా మహారాష్ట్ర, పంజాబ్,

కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ లోనే

దేశవ్యాప్తంగా 4.5 కోట్ల డోసుల కోవిడ్ టీకాల పంపిణీ మొత్తం కోవిడ్ మరణాల శాతం 1.37% కు తగ్గుదల

Posted On: 22 MAR 2021 11:12AM by PIB Hyderabad

మహారాష్ట్ర, పంజాబ్,  కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ లో కోవిడ్ కేసుల పెరుగుదల కొనసాగుతోంది.  చేసుకున్నాయి. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు 46,951 కాగా అందులో80.5% ఈ ఐదు రాష్ట్రాలదే. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్  కలిసి 84.49% వాటా కేసులు పంచుకున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా

30,535 (65.03%) కేసులు నమోదు కాగా తరువాత స్థానంలో పంజాబ్ (2,644), కేరళ (1,875) ఉన్నాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YW27.jpg

ఈ క్రింది పేర్కొన్న ఎనిమిది రాష్టాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BN8Z.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0038XR4.jpg

దృష్టిపెట్టాల్సిన 8 రాష్ట్రాలలో జరిపిన కోవిడ్ పరీక్షలు, సంబంధిత కొత్త కేసులు ఈ దిగువ చిత్రపటాల్లో చూడవచ్చు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00418DB.jpg

దేశవ్యాప్తంగా ఇంకా చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు ఈ రోజుకు  3,34,646 కు చేరగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 2.87%. గత 24 గంటలలో నికరంగా పెరిగిన కోవిడ్ చికిత్సలో కేసులు  25,559

రోజువారీ పాజిటివ్ కేసుల శాతం గత వారపు సగటు ప్రస్తుతం 3.70% కి చేరింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ZE86.jpg

ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జాతీయ సగటుకంటే ఎక్కువగా పాజిటివ్ శాతం నమోదైంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006Y1S6.jpg

మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా డోసుల సంఖ్య నాలుగున్నర కోట్లు దాటింది. ఈరోజు ఉదయం 7 గంటలవరకు అంఇద్న సమాచారాన్ని బట్టి 7,33,597 శిబిరాల ద్వారా 4,50,65,998 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో 77,86,205 మంది మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది,   48,81,954 మంది రెండో డోస్ ఆరోగ్య సిబ్బంది, 80,95,711 మంది మొదటి డోస్ కొవిడ్ యోధులు,   26,09,742 రెండో డోస్ కోవిడ్ యోధులు, 37,21,455 మంది 45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధి గ్రస్తులు, 1,79,70,931 మంది 60 ఏళ్ళు పైబడ్డ వారు ఉన్నారు. 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

 60 ఏళ్ళు  పైబడినవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

77,86,205

48,81,954

80,95,711

26,09,742

37,21,455

1,79,70,931

4,50,65,998

 

టీకాల కార్యక్రమం మొదలైన 65వ రోజైన మార్చి 21న మొత్తం 4,62,157 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఆదివారం కావటంతో ఎక్కువ రాష్ట్రాలు టీకా కార్యక్రమం చేపట్టలేదు. నిన్న వేసిన టీకాలలో 4,49,115 మంది లబ్ధిదారులు  8,459 శిబిరాలలో మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది కోవిడ్ యోధులు ఉండగా 13,042 మంది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. 

 

తేదీ : మార్చి 21, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు  పైబడినవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

6,220

4,598

11,400

8,444

87,982

3,43,513

4,49,115

13,042

 

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,11,51,468 కు చేరుకోగా, జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం  95.75% అయింది. గత 24 గంటలలో 21,180 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో  212 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  అందులో 85.85% మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 99 మంది చనిపోగా పంజాబ్ లో 44 మంది, కేరళలో 13 మంది చనిపోయారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007SR5W.jpg

కోవిడ్ బారిన పడిన వారిలో మరణాల శాతం  1.37% నమోదై క్రమంగా తగ్గుతోంది.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008UZM8.jpg

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 14. అవి: ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, లక్షదీవులు, సిక్కిం, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

 

****



(Release ID: 1706607) Visitor Counter : 175