ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గత 24 గంటల్లో వచ్చిన కొత్త కోవిడ్ కేసుల్లో 77.7% వాటా
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ లదే
ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులు 4.4 కోట్లకి పైనే
గత 24 గంటల్లో 25 లక్షలకు పైగా టీకా డోసులు
Posted On:
21 MAR 2021 12:09PM by PIB Hyderabad
దేశంలో కొన్ని రాష్ట్ర్రాలు ప్రధానంగా కోవిడ్ కేసుల పెరుగుదల చూపుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ కలిసి కొత్త కేసులలో 77.7% వాటా పొందాయి. గత 24 గంటలలో 43,846 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా 83.14% ఆరు రాష్ట్రాలలోనే కావటం గమనార్హం. 27,126 కొత్త కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా పంజాబ్ లో 2578 కేసులు, కేరళలో 2078 కేసులు నమోదయ్యాయి.
ఎనిమిది రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదలను, అందులో ఆ పెరుగుదలకు కారణమైన మొదటి ఐదు జిల్లాలను ఈ క్రింది చిత్రపటాలు చూపుతున్నాయి.
ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 7,25,138 శిబిరాల ద్వారా 4,46,03,841 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 77,79,985 మొదటి డోసులు అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 48,77,356 రెండో డోసులు అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 80,84,311 మొదటి డోసులు అందుకున్న కోవిడ్ యోధులు, 26,01,298 రెండో డోసులు అందుకున్న కోవిడ్ యోధులు, 36,33,473 మంది 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 1,76,27,418 మంది 60 ఏళ్ళుపైబడ్డ లబ్ధిదారులు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
77,79,985
|
48,77,356
|
80,84,311
|
26,01,298
|
36,33,473
|
1,76,27,418
|
4,46,03,841
|
టీకాలు మొదలైన 64వ రోజైన్ అమార్చి 20 నాడు దాదాపు 25లక్షలు (25,40,449) టీకా డోసులిచ్చారు. అందులో 22,83,157 మంది లబ్ధిదారులు 38,669 శిబిరాలద్వారా మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కాగా, 2,57,292 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ అందుకున్నావారు.
తేదీ: మార్చి20, 2021
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
|
73,146
|
73,071
|
1,26,705
|
1,84,221
|
4,09,861
|
16,73,445
|
22,83,157
|
2,57,292
|
|
|
|
|
|
|
|
|
|
|
|
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 3,09,087 కి చేరింది. గత 24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల 20,693 గా నమోదైంది. మరోవైపు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,11,30,288కి చేరగా కోలుకున్నవారి శాతం 95.96%. గత 24 గంటలలో 22,956 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో 197 మంది కోవిడ్ తో చనిపోయారు. వీరిలో 86.8% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 92 మంది చనిపోగా పంజాబ్ లో 38 మంది, కేరళలో 15 మంది చనిపోయారు.
గత 24 గంటలలో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: రాజస్థాన్, అస్సాం, గోవా, ఉత్తరాఖండ్, ఒడిశా, జార్ఖండ్, లక్షదీవులు, సిక్కిం, పుదుచ్చేరి, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, లద్దాఖ్, మణిపూర్, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1706505)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam