ప్రధాన మంత్రి కార్యాలయం
రత్నగిరి జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
20 MAR 2021 3:53PM by PIB Hyderabad
రత్నగిరి జిల్లాలోని ఒక ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా ఆయన ఒక సందేశమిస్తూ, రత్నగిరి జిల్లాలోని ఒక ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిసి బాధేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.
***
(Release ID: 1706341)
Visitor Counter : 150
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam