మంత్రిమండలి

హ్యాండీక్రాఫ్ట్స్ ఎండ్ హ్యాండ్ లూమ్స్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేశన్ ఇండియా లిమిటెడ్ మూసివేత కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 16 MAR 2021 3:57PM by PIB Hyderabad

జౌళి మంత్రిత్వ శాఖ ప‌రిపాల‌న సంబంధిత నిర్వ‌హ‌ణ లో న‌డుస్తున్న భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన హ్యాండీ క్రాఫ్ట్స్ ఎండ్ హ్యాండ్ లూమ్స్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేశన్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌హెచ్ఇసి) మూసివేత కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  

ఈ సంస్థ లో 59 మంది శాశ్వ‌త ఉద్యోగుల తో పాటు, ఆరుగురు మేనేజ్‌మెంట్ ట్రైనీలు కూడా ఉన్నారు.  వీరికి డిపార్ట్ మెంట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ నిర్దేశించిన నియ‌మాల ప్ర‌కారం స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ ప‌థ‌కం (విఆర్ఎస్‌) తాలూకు ల‌బ్ధి ని పొందేందుకు ఒక అవ‌కాశాన్ని ఇవ్వ‌డం జ‌రుగుతుంది.  

ఈ సంస్థ మూసివేత కు ఆమోదం తెలిపిన కార‌ణం గా ఎలాంటి కార్య‌క‌లాపాలు కొన‌సాగ‌ని, ఎలాంటి ఆదాయాన్ని ఆర్జించ‌న‌టువంటి ఖాయిలా బారిన ప‌డ్డ సిపిఎస్ఇ తాలూకు జీతం/వేత‌నాల ప‌ద్దుపై పున‌రావృత వ్య‌య భారాన్ని ప్ర‌భుత్వ ఖ‌జానా త‌గ్గించుకోవడానికి ఉప‌యుక్తం గా ఉంటుంది

ఈ సంస్థ 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి వ‌రుస‌ గా న‌ష్టాల పాల‌బ‌డుతూ సంస్థ నిర్వ‌హ‌ణ వ్య‌యాల‌ను అయినా భ‌రించేందుకు త‌గినంత ఆదాయాన్ని ఆర్జించ లేక‌పోయింది.  ఈ సంస్థ ను పున‌రుద్ధ‌రించ‌డానికి ఏమంత అవ‌కాశం లేక‌పోవ‌డం తో కంపెనీ ని మూసివేయక త‌ప్ప‌ని స్థితి ఎదురైంది.


 

*** 


(Release ID: 1705137) Visitor Counter : 166