ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు శ్రీ లంక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ గోటబయ రాజపక్స మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 13 MAR 2021 3:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, శ్రీ లంక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ గోటబయ రాజపక్స తో టెలిఫోనులో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఇరువురు నాయకులు,  సమయోచిత పరిణామాలతో పాటు, ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.  కొనసాగుతున్న కోవిడ్-19 సవాళ్ళ నేపథ్యంతో సహా సంబంధిత అధికారుల మధ్య క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించడానికి వారు అంగీకరించారు.

పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత అనే భారతదేశ విధానం గురించి, ఈ సందర్భంగా, ప్రధానమంత్రి,  శ్రీలంక కు మరోసారి తెలియజేశారు.

*****(Release ID: 1704599) Visitor Counter : 228