ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ India@75 కార్యక్రమాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
భారతదేశం తన స్వాతంత్య్ర యోధుల ను మరచిపోదు: ప్రధాన మంత్రి
అంతగా వెలుగు లోకి రానటువంటి కథానాయకుల చరిత్ర ను పదిలం గా ఉంచేందుకు గత ఆరేళ్ళ లో కృషి జరిగింది: ప్రధాన మంత్రి
మన రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామిక సంప్రదాయాన్ని చూసుకొని మనం గర్విస్తున్నాం: ప్రధాన మంత్రి
Posted On:
12 MAR 2021 2:15PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర యాత్ర) ప్రారంభానికి గుర్తు గా పచ్చ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) కార్యక్రమాల ను ప్రారంభించారు. India@75 ఉత్సవాలకై ఉద్దేశించినటువంటి ఇతర విభిన్న సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనేది భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావడాన్ని స్మరించుకొనేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల శ్రేణి కి పెట్టిన పేరు. ఈ మహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్య భావన తో ఒక జన ఉత్సవం రూపం లో నిర్వహించడం జరుగుతుంది.
సాబర్‌మతీ ఆశ్రమం లో జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 2022వ సంవత్సరం ఆగస్టు 15 కంటే 75 వారాల ముందే ఏర్పాటు చేస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ 2023వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. స్వాతంత్య్ర పోరాటం లో వారి ప్రాణాల ను అర్పించినటువంటి మహాత్మ గాంధీ కి, ఇతర మహాను భావుల కు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
కలల ను, కర్తవ్యాల ను ప్రేరణ గా తీసుకొని ముందుకు సాగిపోయేందుకు ఒక మార్గదర్శక శక్తి రూపం లో స్వాతంత్య్ర పోరాటం, ఐడియాస్ ఎట్ 75, అచీవ్‌మెంట్స్ ఎట్ 75, యాక్షన్ ఎట్ 75, రిజాల్వ్ స్ ఎట్ 75 అనే అయిదు ముఖ్య అంశాల ను గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే స్వాతంత్య్రాన్ని అందించే శక్తి తాలూకు అమృతం అని అర్థం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దీనికి అర్థం స్వాతంత్య్ర పోరాట యోధుల ప్రేరణ ల తాలూకు అమృతమూ, కొత్త కొత్త ఆలోచన ల సుధ, ఆత్మనిర్భరత తాలూకు ప్రతిజ్ఞ లు మరియు మకరందమూ ను అని ఆయన అన్నారు.
- కు సంబంధించిన సంకేతాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ను కేవలం దాని ఖరీదు ఆధారంగానే ఎన్నటికీ విలువ కట్టడమనేది జరుగనే లేదు అని పేర్కొన్నారు. భారతీయుల దృష్టి లో నిజాయతీ కి, నమ్మకానికి, విధేయత కు, శ్రమ కు, సమానత్వానికి, స్వావలంబన కు ప్రాతినిధ్యం వహిస్తుంది అని ఆయన అన్నారు. ఆ కాలం లో, భారతదేశ స్వావలంబన కు ఒక చిహ్నం గా నిలచింది అని ఆయన చెప్పారు. భారతదేశం విలువల తో పాటు బ్రిటిషు వారు ఈ స్వావలంబన ను కూడా దెబ్బతీశారు. భారతదేశ ప్రజలు ఇంగ్లండ్ నుంచి వచ్చే ఉప్పు పైన ఆధారపడవలసి వచ్చింది. దేశం దీర్ఘకాలం పాటు అనుభవిస్తూ వచ్చిన ఈ వేదన ను, ప్రజల నాడి ని గాంధీజీ అర్థం చేసుకొన్నారు; దీనిని ఒక ఉద్యమం గా ఆయన మలచారు అని శ్రీ మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి 1857వ సంవత్సరం లో భారతదేశ స్వాతంత్య్రం తాలూకు ఒకటో యుద్ధం, మహాత్మా గాంధీ విదేశాల నుంచి తిరిగి రావడం, సత్యాగ్రహం తాలూకు శక్తి ని దేశ ప్రజల కు గుర్తు చేయడం, లోక్ మాన్య తిలక్ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం, పిలుపునివ్వడం, నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నాయకత్వం లోని ఆజాద్ హింద్ ఫౌజ్ దిల్లీ కవాతు ను నిర్వహించడం, ఢిల్లీ చలో అనే నినాదం వంటి స్వాతంత్ర్య సమరం లోని ముఖ్య ఘట్టాలను గుర్తు కు తెచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమం తాలూకు ఈ జ్వాల ను ప్రతి దిశ లో, ప్రతి ప్రాంతం లో ఆరిపోకుండా వెలిగిస్తూ ఉంచే పని ని మన ఆచార్యులు, సాధువులు, గురువులు దేశం లోని ప్రతి మూల న చేస్తూ వచ్చారన్నారు.
ఒక రకం గా భక్తి ఉద్యమం దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమాని కి రంగాన్ని సిద్ధం చేసింది అని ఆయన అన్నారు. చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస, శ్రీమంత్ శంకర్ దేవ్ ల వంటి సాధువులు దేశవ్యాప్తం గా స్వాతంత్య్ర సమరం తాలూకు పునాది ని ఏర్పరచారన్నారు. అదే విధంగా, అన్ని ప్రాంతాల కు చెందిన సాధువులు దేశ ప్రజల అంతరాత్మ ను చైతన్యపరచి, స్వాతంత్య్ర పోరాటానికి తోడ్పడ్డారన్నారు. అసంఖ్యాకమైన త్యాగాల ను చేసిన దళితులు, ఆదివాసీలు, మహిళలు, యువత దేశం అంతటా ఎంతో మంది ఉన్నారని ఆయన వివరించారు. తమిళ నాడు లో 32 ఏళ్ళ వయస్సు లో కొడి కాథ్ కుమరన్ వంటి అంతగా గుర్తింపున కు నోచుకోని కథానాయకులు చేసిన త్యాగాల ను జ్ఞప్తి కి తెచ్చారు. బ్రిటిషు వారు కుమరన్ తల లోకి తుపాకిగుండు ను కాల్చినప్పటికీ అతడు దేశ జెండా ను నేల మీద కు జారిపడిపోనివ్వలేదు అంటూ ఆయన వివరించారు. తమిళ నాడు కు చెందిన వేలూ నాచియార్ బ్రిటిషు ఏలుబడి కి వ్యతిరేకంగా పోరాడిన మొదటి మహారాణి గా ప్రసిద్ధి పొందారు.
మన దేశ ఆదివాసీ సమాజం తన సాహసం తో, పరాక్రమం తో విదేశీ పాలకుల ను మోకాళ్ళ మీద నిల్చొనేటట్టు చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఝార్ ఖండ్ లో బిర్సా ముండా బ్రిటిషు వారిని ఎదురించారని, అలాగే ముర్మూ సోదరులు సంథాల్ ఉద్యమాని కి నాయకత్వం వహించారని చెప్పారు. ఒడిశా లో చక్ర బిసోయి బ్రిటిషు వారికి వ్యతిరేకం గా పోరు ను సాగించారని, లక్ష్మణ్ నాయక్ గాంధేయ పద్ధతి లో చైతన్యాన్ని విస్తరింప చేశారన్నారు. బ్రిటిషు వారికి వ్యతిరేకం గా నిలబడి పోరాటం చేసి, అంతగా వెలుగు లోని రానటువంటి ఆదివాసీ కథానాయకులలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు రంప ఉద్యమానికి సారధ్యం వహించగా, పాసల్థా ఖుంగ్ చేరా మిజోరమ్ కొండల లో బ్రిటిషు వారి తో తలపడ్డారని వివరించారు. దేశ స్వాతంత్య్రాని కి తమ వంతు గా తోడ్పడ్డ అసమ్ కు, ఈశాన్య ప్రాంతాల కు చెందిన ఇతర స్వాతంత్య్ర యోధులైన గోమ్ ధర్ కోంవర్, లసిత్ బోర్ ఫుకన్, సీరాత్ సింగ్ లను గురించి పేర్కొన్నారు. గుజరాత్ లో జాంబుఘోడా లో నాయక్ ఆదివాసీ ల త్యాగాన్ని, మాన్‌గఢ్ లో వందల కొద్దీ ఆదివాసీ ల నర మేధాన్ని దేశం ఎప్పటికీ స్మరించుకొంటుంది అని ఆయన అన్నారు.
గత ఆరు సంవత్సరాల లో ఈ చరిత్ర ను ప్రతి రాష్ట్రం లో, ప్రతి మండలం లో పదిలంగా ఉంచేందుకు దేశం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. దాండీ యాత్ర తో ముడిపడ్డ ప్రదేశాన్ని పునరుద్ధరించే కార్యం రెండు సంవత్సరాల క్రితం పూర్తి అయిందన్నారు. దేశం లో తొలి స్వాతంత్య్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేతాజీ సుభాశ్ అండమాన్ లో మువ్వన్నెలను ఎగురవేసిన స్థలాన్ని కూడా పునరుద్ధరించడం జరిగిందన్నారు. అండమాన్, నికోబార్ దీవుల కు స్వాతంత్య్ర సంగ్రామం పేరుల ను పెట్టడమైందని ఆయన అన్నారు. బాబా సాహెబ్ తో అనుబంధం ఉన్నటువంటి స్థలాల ను పంచతీర్థ గా అభివృద్ధి చేయడం జరిగిందని, జాలియాఁవాలా బాగ్ లో స్మారకాన్ని, పైకా ఉద్యమం తాలూకు స్మారకాన్ని కూడా అభివృద్ధి పరచడమైందన్నారు.
మన కఠోర శ్రమ తో భారతదేశం లోను, విదేశాల లోను మనల ను మనం నిరూపించుకొన్నామని ప్రధాన మంత్రి అన్నారు. మనకు మన రాజ్యాంగం అన్నా, ప్రజాస్వామిక సంప్రదాయాలన్నా గర్వం గా ఉంటుంది అని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాని కి తల్లి అయినటువంటి భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బలపరచుకొంటూ ముందంజ వేస్తోంది అని ఆయన అన్నారు. భారతదేశం కార్యసాధన లు యావత్తు మానవ జాతి కి ఆశ ను రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశం అభివృద్ధి యాత్ర ఆత్మనిర్భరత తో పెనవేసుకొందని, అది యావత్తు ప్రపంచ అభివృద్ధి యాత్ర కు వేగ గతి ని అందించనుందని కూడా ఆయన చెప్పారు.
మన స్వాతంత్య్ర యోధుల చరిత్ర లను గ్రంథస్తం చేయడం లో బాధ్యత ను తీసుకోవలసింది గా యువతీ యువకుల ను, పండితుల ను ప్రధాన మంత్రి కోరారు. స్వాతంత్య్ర ఉద్యమంలోని కార్యసిద్ధుల ను ప్రపంచానికి చాటిచెప్పాలి అని వారికి ఆయన సూచించారు. గతించిన కాలం లో చెల్లాచెదరు గా పడిపోయిన మన విశిష్ట గాథల ను వెదకి వెలికితీసి మరీ వాటికి ప్రాణం పోయాలి అని కూడా ఆయన కళలు, సాహిత్యం, నాటక జగతి, చిత్ర పరిశ్రమ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల తో సంబంధం ఉన్న వారికి విజ్ఞప్తి చేశారు.
****
(Release ID: 1704392)
Visitor Counter : 470
Read this release in:
Urdu
,
Bengali
,
Marathi
,
Odia
,
Malayalam
,
English
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada