ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగ 2.4 కోట్ల పైగా వాక్సిన్ మోతాదులను వేశారు

గత 24 గంటల్లో 13.5 లక్షల మోతాదులు ఇచ్చారు

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రోజువారీ కోవిడ్ కేసులలో అధిక పెరుగుదలను సూచిస్తున్నాయి

Posted On: 10 MAR 2021 12:09PM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక నివేదిక ప్రకారం రాష్ట్రాలు మరియు యుటిలలో 3,39,145 సెషన్ల ద్వారా 2.43 కోట్ల (2,43,67,906) వ్యాక్సిన్ మోతాదులను అందించారు. 

వీటిలో 71,30,098 హెచ్‌సిడబ్ల్యు (1 వ మోతాదు), 38,90,257 హెచ్‌సిడబ్ల్యు (2 వ మోతాదు), 69,36,480 ఎఫ్‌ఎల్‌డబ్ల్యు (1 వ మోతాదు) మరియు 4,73,422 ఎఫ్‌ఎల్‌డబ్ల్యు (2 వ మోతాదు), 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల 8,33,526 లబ్ధిదారులు నిర్దిష్ట కో -మోర్బిడిటీస్ (1 వ మోతాదు) మరియు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల 51,04,123 లబ్ధిదారులు (1 వ మోతాదు) వాక్సిన్ వేయించుకున్నారు.

 

హెచ్‌సిడబ్ల్యు

ఎఫ్‌ఎల్‌డబ్ల్యు

దీర్ఘ అనారోగ్యాలతో ఉన్న 45 నుండి <60 సంవత్సరాలు

60 ఏళ్ల పైబడ్డ వారు 

 

Total

మొదటి మోతాదు 

రెండవ మోతాదు 

మొదటి మోతాదు 

రెండవ మోతాదు 

మొదటి మోతాదు 

మొదటి మోతాదు 

71,30,098

38,90,257

69,36,480

4,73,422

8,33,526

51,04,123

2,43,67,906


టీకా డ్రైవ్ (9 మార్చి 2021) 53 వ రోజు నాటికి, 13.5 లక్షలకు పైగా (13,59,173) వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చారు. అందులో, 10,60,944 మంది లబ్ధిదారులకు 52,351 సెషన్లలో 1 వ మోతాదు (హెచ్‌సిడబ్ల్యు మరియు ఎఫ్‌ఎల్‌డబ్ల్యు) మరియు 2,98,229 హెచ్‌సిడబ్ల్యు, ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలకు 2 వ మోతాదు వ్యాక్సిన్ ఇచ్చారు.

 

తేదీ : 9 మర్చి 2021

హెచ్‌సిడబ్ల్యు

ఎఫ్‌ఎల్‌డబ్ల్యు

దీర్ఘ అనారోగ్యాలతో ఉన్న 45 నుండి <60 సంవత్సరాలు

60 ఏళ్ల పైబడ్డ వారు 

మొత్తం ఫలితం 

మొదటి మోతాదు 

రెండవ మోతాదు 

మొదటి మోతాదు 

  రెండవ మోతాదు  

మొదటి మోతాదు 

మొదటి మోతాదు 

  మొదటి మోతాదు  

  రెండవ మోతాదు  

55,088

1,50,779

1,44,161

1,47,450

1,31,717

7,29,978

10,60,944

2,98,229

 

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్ మరియు తమిళనాడులోని ఆరు రాష్ట్రాలు రోజువారీ కొత్త కోవిడ్ కేసులను నివేదిస్తున్నాయి. గత 24 గంటల్లో 17,921 కొత్త రోజువారీ కేసులు నమోదయ్యాయి. 

కొత్త కేసులలో 83.76% పైన పేర్కొన్న ఆరు రాష్ట్రాల నుండి వచ్చాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా రోజువారీ 9,927 కేసులు నమోదవుతున్నాయి. దీని తరువాత కేరళలో 2,316 ఉండగా, పంజాబ్‌లో 1,027 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

 

ఎనిమిది రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్న ధోరణితో ఉన్నాయి. 

 

భారత్ లో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య నేడు 1.84 లక్షలు (1,84,598) దగ్గర ఉంది. 

కింది గ్రాఫ్ 2021 జనవరి 17 నుండి 2021 మర్చి 10వ తేదీ వరకు  రోజు విడిచి రోజు క్రియాశీల కేసుల సంఖ్య లో మార్పును సూచిస్తున్నాయి. 

 ప్రతిరోజూ పరీక్షించబడుతున్న కోవిడ్ నమూనాలు నిరంతర పెరిగే పథాన్ని సూచిస్తున్నాయి. భారతదేశంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు 22 కోట్లు (22,34,79,877) దాటాయి.

 

 

రోజూ పాజిటివ్ కేసుల రేటు 2.43% గా ఉంది. 

 

 గత 24 గంటల్లో 133 మరణాలు నమోదయ్యాయి. 

కొత్త మరణాలలో 77.44% ఐదు రాష్ట్రాలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో గరిష్ట మరణాలు (56) సంభవించాయి. రోజువారీ 20 మరణాలు పంజాబ్ లో నమోదయ్యాయి. కేరళలో 16 మంది మరణించారు.

 

గత 24 గంటల్లో పంతొమ్మిది రాష్ట్రాలు / యుటిలు కోవిడ్ -19 మరణాల నమోదు కాలేదు.

అవి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, పుదుచ్చేరి, లక్షద్వీప్, సిక్కిం, లడఖ్ (యుటి), మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, డి అండ్ డి & డి అండ్ ఎన్ దీవులు, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ 

 

                                                                                                                                               

****


(Release ID: 1703781) Visitor Counter : 172