ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీమద్ భగవద్గీత లోని శ్లోకాలకు 21 మంది పండితుల వ్యాఖ్యాన సహిత రాత ప్రతి ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి

Posted On: 09 MAR 2021 6:08PM by PIB Hyderabad

శ్రీమద్ భగవద్గీత లోని శ్లోకాల కు 21 మంది పండితులు చేసిన వ్యాఖ్యానాలతో కూడిన లిఖిత ప్రతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమం లో జమ్ము- కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా తో పాటు ధర్మార్థ ట్రస్టు జమ్ము- కశ్మీర్ అధ్యక్షుడు డాక్టర్ కరణ్ సింహ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భం లో భారత తత్త్వశాస్త్రం పై డాక్టర్ కరణ్ సింహ్ చేసిన పనులను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.  డాక్టర్ కరణ్ సింహ్ కృషి ఫలితం గా జమ్ము-  కశ్మీర్ తాలూకు గుర్తింపు ను పునర్జీవింపచేయడం  సాధ్యపడిందని, అది శతాబ్దాలుగా సాగుతున్న భారతదేశ ఆలోచన సంప్రదాయానికి నాయకత్వం వహించిందని ఆయన అన్నారు. గీతను గురించి వేల కొద్దీ పండితులు లోతైన అధ్యయనం చేయడం కోసం వారి యావత్తు జీవనాన్నే అంకితం చేశారని, దీనిని ఒక గ్రంథం లోని ప్రతి ఒక్క శ్లోకం పైన విభిన్నమైన వ్యాఖ్యలతో కూడిన విశ్లేషణ, వివిధ రహస్యాల అభివ్యక్తి ల రూపం లపో స్పష్టం గా చూడవచ్చని ఆయన అన్నారు.  ఇది భారతదేశ సైద్ధాంతిక స్వతంత్రం, సహనాలకు కూడా ప్రతీక గా ఉందని, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కి తనదైనటువంటి దృష్టికోణం కలిగివుండేటట్టు స్ఫూర్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకు వచ్చిన ఆది శంకరాచార్యులు గీత ను ఆధ్యాత్మిక చైతన్య వాహిని గా పరిగణించారు అని ప్రధాన మంత్రి అన్నారు.  రామానుజాచార్య వంటి సాధువులు ఆధ్యాత్మిక జ్ఞాన వ్యక్తీకరణ గా గీత ను అభివర్ణించారు. స్వామి వివేకానంద విషయం లో ఆయనకయితే గీత కఠోర పరిశ్రమ కు, తిరుగులేనటువంటి ఆత్మవిశ్వాసానికి వనరు గా ఉండిందని ప్రధాన మంత్రి చెప్పారు.  శ్రీ అరబిందో గీత ను జ్ఞానం, మానవతల నిజ అవతారం గా ఎంచారు; గీత అనేది మహాత్మ గాంధీ కి అన్నిటికన్న కష్టమైనటువంటి సమయాలలో  ప్రకాశస్తంభం గా నిలచిందన్నారు.  గీత నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దేశభక్తి కి, వీరత్వానికి ప్రేరణ అయిందన్నారు.  గీత ను గురించి బాల గంగాధర్ తిలక్ చేసిన వ్యాఖ్య స్వాతంత్య్ర సంగ్రామానికి ఒక కొత్త బలాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు.

మన ప్రజాస్వామ్యం మనకు ఆలోచనపరమైనటువంటి స్వేచ్ఛ ను, పని పరం గా స్వేచ్ఛ ను, జీవనం లో ప్రతి ఒక్క రంగం లో సమాన హక్కులను ఇస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్య సంస్థ ల నుంచి దక్కింది, ఆ సంస్థ లు మన రాజ్యాంగానికి సంరక్షకులు గా ఉన్నాయి అని ఆయన అన్నారు.  ఈ కారణం గా మనం మన హక్కులను గురించిన ప్రస్తావన ను తీసుకు వచ్చినప్పుడల్లా మనం మన ప్రజాస్వామ్య సంబంధి కర్తవ్యాలను కూడా గుర్తు కు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.

గీత మొత్తం ప్రపంచానికి, ప్రతి ప్రాణి కి ఒక మహత్వపూర్ణమైనటువంటి  గ్రంథం అని ప్రధాన మంత్రి అన్నారు.  దీనిని భారతదేశం లో అనేక  భాషల లోకి, ప్రపంచంలో అనేక భాషల లోకి అనువాదం చేయడం జరిగిందని, అనేక  దేశాలలో అనేక అంతర్జాతీయ పండితులు దీనిని గురించి పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు.

జ్ఞానాన్ని పంచుకోవడం భారతదేశం సంస్కృతి లో భాగంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  గణితం, వస్త్ర- లోహవిజ్ఞానం లేదా ఆయుర్వేదం లో మన జ్ఞానాన్ని సదా మానవ జాతి తాలూకు సంపద గా భావన చేయడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.  ఈ రోజున మరొక్క సారి, భారతదేశం యావత్తు ప్రపంచం తాలూకు ప్రగతి కి తోడ్పడడం తో పాటు మానవాళి కి సేవ చేయడానికి  తన సామర్థ్యాన్ని పెంచుకొంటోందని ఆయన చెప్పారు.  ఇటీవలి కాలం లో భారతదేశం సహకార స్ఫూర్తి ని ప్రపంచం ప్రత్యక్షం గా చూసిందని ఆయన అన్నారు.  అలాగే ఆత్మనిర్భర్ భారత్ (లేదా స్వయంస‌మృద్ధ‌ియుత భారతదేశం)  ను ఆవిష్కరించే దిశ లో జరుగుతున్న ప్రయాసలతో కూడిన ఈ తోడ్పాటు తో మొత్తం ప్రపంచానికి విస్తృత స్థాయి లో సహాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.



 

***


(Release ID: 1703723) Visitor Counter : 205