ప్రధాన మంత్రి కార్యాలయం

మ‌హిళల దినోత్సవం సందర్భం లో మ‌హిళా న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల నుంచి ఉత్ప‌త్తుల‌ ను కొనుగోలు చేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 MAR 2021 2:00PM by PIB Hyderabad

ఈ రోజు న మ‌హిళ‌ల దినోత్సవం సంద‌ర్భం లో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వివిధ మ‌హిళా స్వ‌యం సహాయక సమూహాలు, న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల వ‌ద్ద నుంచి ఉత్ప‌త్తుల‌ ను కొనుగోలు చేశారు.  ఇది మ‌హిళా న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌ కు, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు ప్రేరణ ను అంద‌జేసే ఓ ప్ర‌య‌త్నం గా ఉంది.

‘ఆత్మ‌నిర్భ‌ర‌త’ (లేదా స్వయంసమృద్ధి సాధన) కోసం భార‌త‌దేశం చేస్తున్న శోధన లో మ‌హిళ‌ల‌ పాత్ర‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఆత్మ‌నిర్భ‌ర్ గా మారేందుకు  భార‌త‌దేశం చేస్తున్న అన్వేషణ లో మ‌హిళ‌లు ఒక ప్ర‌ముఖ‌ పాత్ర‌ ను పోషిస్తున్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం నాడు మ‌హిళ‌ల్లో న‌వ‌పారిశ్రామిక‌త్వాన్ని ప్రోత్స‌హించేందుకు మ‌నం నిబద్ధులం అవుదాం. 

 

ఈ రోజు న నేను మ‌హిళ ల సాహసాన్ని, సృజ‌నాత్మకత ను, భారతదేశం సంస్కృతి ని వర్ధిల్లేటట్లు చేసే కొన్ని ఉత్ప‌త్తుల‌ ను కొనుగోలు చేశాను’’ #NariShakti ’’

 

త‌మిళ‌ నాడు కు చెందిన తోడా తెగ చేతి వృ త్తుల వారి వ‌ద్ద నుంచి బుటేదారు పనిత‌నం క‌లిగిన శాలువ ను తాను కొనుగోలు చేయ‌డం గురించి ఆయ‌న వెల్ల‌డిస్తూ, ‘‘త‌మిళ నాడు లోని తోడా హ‌స్త‌క‌ళాకారులు నైపుణ్యం తో త‌యారు చేసినటువంటి, బుటేదారు పనితనం క‌లిగినటువంటి శాలువా భలే గా ఉంది. 

 

అలాంటి ఒక శాలువా ను నేను కొనుగోలు చేశాను.  ఈ ఉత్ప‌త్తి ని ట్రైబ్స్ ఇండియా విక్ర‌యిస్తోంది. #NariShakti ’’ అని ట్విటర్ లో పేర్కొన్నారు.

 


అలాగే, గోండ్ ప‌నిత‌నం క‌లిగిన ఒక పేపర్ పెయింటింగు ను గురించి ఆయ‌న ‘‘  ప‌రిస‌రాల‌కు మ‌రింత శోభ‌ ను సంతరించడం! మ‌న ఆదివాసీ స‌ముదాయాల క‌ళ ఆకట్టుకొనేది గా ఉంది.  చేతి తో త‌యారు చేసిన ఈ గోండ్ పేప‌ర్ పేయింటింగ్ వ‌ర్ణాలను, సృజ‌నశీలత ను క‌ల‌గ‌లుపుతున్నది. 

ఈ పెయింటింగ్ ను ఈ రోజు న కొనుగోలు చేశాను. #NariShakti ’’


 

నాగాలాండ్‌ కు చెందిన ఒక సాంప్ర‌దాయ‌క శాలువా ను కూడా ప్ర‌ధాన మంత్రి కొనుగోలు చేశారు.  ‘‘ధైర్య సాహ‌సాలకు, క‌రుణ కు, సృజ‌నాత్మ‌క‌త‌ కు మారుపేరు గా ఉన్నటువంటి నాగా సంస్కృతి ని చూసుకొని భారతదేశం గర్వపడుతున్నది.

నాగాలాండ్ కు చెందిన ఒక సాంప్ర‌దాయ‌క శాలువా ను కొనుగోలు చేశాను.  #NariShakti ’’

 

ప్ర‌ధాన మంత్రి తాను కొనుగోలు చేసిన ఒక మ‌ధుబ‌ని చిత్ర‌క‌ళ తో కూడిన ఖాదీ కాట‌న్ స్టోల్ ను గురించి ..

‘‘ ఖాదీ కి, మ‌హాత్మ గాంధీ తో, భారతదేశ సుసంపన్న చరిత్ర తో స‌న్నిహిత‌ అనుబంధం ఉంది.  మ‌ధుబ‌ని చిత్ర‌క‌ళ తో శోభిల్లుతున్న ఒక ఖాదీ కాటన్ స్టోలు ను కొన్నాను.  అది ఒక మంచి నాణ్య‌మైనటువంటి ఉత్ప‌త్తి; మన పౌరుల సృజ‌నాత్మ‌క ప్ర‌తిభ దీనిలో ప్రస్ఫుటం అవుతోంది’’ అని ట్విటర్ లో పేర్కొన్నారు. #NariShakti ’’


 

ప‌శ్చిమ బంగాల్ కు చెందిన చేతి తో త‌యారైన జ‌నుప ఫైల్ ఫోల్డ‌రు ను గురించి శ్రీ న‌రేంద్ర మోదీ ట్విటర్ లో ‘‘నేను ప‌శ్చిమ బంగాల్ కు చెందినటువంటి, చేతి తో తయారైన ఈ జనుప ఫైల్ ఫోల్డరు ను త‌ప్ప‌క ఉప‌యోగిస్తాను.

ఆ రాష్ట్రాని కి చెందిన ఆదివాసీ స‌ముదాయాల వారు దీనిని తీర్చిదిద్దారు. మీరందరూ కూడా ప‌శ్చిమ బంగాల్ కు చెందిన ఓ జనుప ఉత్పత్తి ని మీ ఇళ్ళ‌ లో త‌ప్ప‌క అట్టిపెట్టుకోవలసిందే! #NariShakti ’’


 

ప్ర‌ధాన‌ మంత్రి అస‌మ్ లోని కాకాటిపాపూంగ్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్లాక్ కు చెందిన స్వ‌యం స‌హాయ స‌మూహాల వారు త‌యారు చేసిన ఒక గ‌మూసా ను కూడా కొనుగోలు చేశారు.

 

 ‘‘మీరు నేను తరచు గా గ‌మూసా ను ధ‌రించ‌డాన్ని చూసే ఉంటారు.  అది చాలా హాయి ని ఇస్తుంది.  ఈ రోజు న, నేను కాకాటిపాపూంగ్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్లాకు కు చెందిన వివిధ స్వ‌యం స‌హాయ స‌మూహాల వారి వద్ద నుండి ఒక గ‌మూసా ను కొనుగోలు చేశాను.  #NariShakti ”

 

శ్రీ నరేంద్ర మోదీ కేర‌ళ లోని మ‌హిళ‌లు త‌యారు చేసిన ఒక తాటి నీల‌విళ‌క్కు ను కూడా తాను కొనుగోలు చేసినట్లు కూడా ఓ ట్వీట్ లో వెల్ల‌డించారు. 

 

‘‘కేర‌ళ కు చెందిన మ‌హిళ‌లు రూపొందించిన ఒక చ‌క్క‌టి తాటి వ‌స్తువు నీల‌విళ‌క్కు ను ఎప్పుడెప్పుడు అందుకుంటానా అని నేను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. స్థానిక క‌ళ‌ల‌ ను, ఉత్ప‌త్తుల‌ ను మ‌న #NariShakti ఏ విధంగా ప‌రిర‌క్షిస్తూ, వాటికి ప్ర‌జాద‌ర‌ణ ను సాధించిపెడుతోందో అనేది కొనియాడదగ్గది’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

 

 

***



(Release ID: 1703191) Visitor Counter : 183