ప్రధాన మంత్రి కార్యాలయం
భారత , బంగ్లాదేశ్ ల మధ్య మార్చి 9న మైత్రి సేతును ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
త్రిపురలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి
Posted On:
07 MAR 2021 7:47PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 9 వ తేదీన భారత్ , బంగ్లాదేశ్ ల మధ్య మైత్రి సేతును వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించనున్నారు. అలాగే ఈ సందర్భంగా ప్రధానమంత్రి త్రిపురలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
త్రిపుర, బంగ్లాదేశ్‌ల మధ్య ప్రవహించే పెని నదిపై నిర్మించిన బ్రిడ్జి మైత్రి సేతు. ఈ మైత్రి సేతు వారధి ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలకు సంకేతంగా నిలవనుంది. ఈ వారధి నిర్మాణ పనులను నేషనల్ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌లిమిటెడ్ చేపట్టింది. ఈ ప్రాజెక్టు వ్యయం 133 కోట్లరూపాయలు. 1.9 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జి ఇండియాలోని సబ్‌రూమ్, బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘడ్‌లను కలుపుతుంది. ఈ వారధి భారత బంగ్లాదేశ్ మధ్య ప్రజల రాకపోకలు, వాణిజ్యం విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టుతో అనుసంధానం ఏర్పడడంతో, త్రిపుర రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా మారుతుంది. సబ్‌రూమ్‌కు ఇది కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి సబ్‌రూమ్‌లో సమీకృత చెక్‌పోస్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇది రెండు దేశాల మధ్య సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలకు వీలు కల్పించడంతోపాటు, ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పిస్తుంది. అలాగే ప్రయాణిలు ఇండియానుంచి బంగ్లాదేశ్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్టును ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియ 232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనుంది.
ప్రధానమంత్రి ఉనకోటి జిల్లా కేంద్రాన్ని కైలాశ్‌హర్‌వద్ద , ఖోవై జిల్లా కేంద్రంతో కలిపే ఎన్.హెచ్ 208 కు శంకుస్థాపన చేయనున్నారు. ఇది ఎన్‌హెచ్ 44 కు ప్రత్యామ్నాయ మార్గాన్ని కల్పించనుంది. 80 కిలోమీటర్ల పొడవు గల ఎన్.హెచ్ 208 ప్రాజెక్టును నేషనల్ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 1,078 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనుంది..
ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం 63.75 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రాష్ట్ర జాతీయరహదారులు, ఇతర జిల్లా రహదారులును సైతం ప్రారంభించనున్నారు. ఇవి అన్ని కాలాలలో త్రిపుర ప్రజలకు అనుసంధానతను కల్పించనున్నాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్ ) కింద నిర్మించిన 40,978 ఇళ్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. వీటిని 813 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. అలాగే ప్రధానమంత్రి అగర్తల స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
అలాగే ప్రధానమంత్రి , ఓల్డ్ మోటార్ స్టాండ్ వద్ద మల్టీలెవల్ కార్ పార్కింగ్ , కమర్షియల్‌కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. దీనిని 200 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నారు. అలాగే ప్రధానమంత్ఇర లిచుబగాన్ నుంచి విమానాశ్రయానికి రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లరహదారిగా మార్చే రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు.ఈ పనిని అతర్తల స్మార్ట్‌సిటీ మిషన్ 96 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపట్టనుంది.
*******
(Release ID: 1703073)
Visitor Counter : 228
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam