ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు స‌మావేశంలో ప్ర‌సంగించిన‌ ప్రధాన‌మంత్రి


Posted On: 06 MAR 2021 8:40PM by PIB Hyderabad

గుజరాత్‌లోని కెవాడియాలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు స‌మావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పాల్గొని  ప్రసంగించారు. ఈ ఏడాది సదస్సులో జరిగిన చర్చల గురించి ర‌క్ష‌ణ సిబ్బంది చీఫ్ ప్రధాన మంత్రికి వివరించారు. సదస్సు నిర్వ‌హ‌ణ‌, ఎజెండా పట్ల ప్రధాని ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది సదస్సులో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమీషన్డ్ ఆఫీసర్లను చేర్చడాన్ని దేశ ప్ర‌ధాని ప్రత్యేకంగా అభినందించారు.

జాతీయ రక్షణ వ్యవస్థ అత్యున్నత పౌర, సైనిక నాయకత్వంతో మాట్లాడుతూ, కోవిడ్‌-19 మహమ్మారి విస్త‌ర‌ణ‌, ఉత్తర సరిహద్దుల్లో సవాళ్ల‌తో కూడిన‌ పరిస్థితుల నేపథ్యంలోనూ.. గత ఏడాది కాలంలో భారత సాయుధ దళాల‌ను చూపించిన  దృఢ‌మైన అంకితభావానికి ప్రధాని తన బ‌ల‌మైన ప్రశంసలను తెలియజేశారు.

జాతీయ భద్రతా వ్యవస్థలో పరికరాలు, ఆయుధాలను సోర్సింగ్ చేయడంలోనే కాకుండా, సాయుధ దళాలలో పాటిస్తున్న సిద్ధాంతాలు, విధానాలు మరియు ఆచారాలలో కూడా స్వదేశీకరణను పెంచడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. జాతీయ భద్రతా నిర్మాణంలోని సైనిక, పౌర విభాగాలలో మానవశక్తి ప్రణాళికను గ‌ర‌ష్టం చేయవలసిన అవసరాన్ని ఆయన ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. సివిల్-మిలిటరీ విధానంలో లోపాల‌ను విచ్ఛిన్నం చేయడం మరియు నిర్ణయం తీసుకోవ‌డంలో వేగాన్ని పెంచ‌డంపై త‌గిన దృష్టి సారించే సమగ్ర విధానానికి ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు. చిత్యం కంటేనూ ఎక్కువ కాలం గడిచిన.. వారసత్వ వ్యవస్థలు మరియు గ‌త అభ్యాసాల నుండి బయటపడాలని ఆయన ర‌క్ష‌ణ శాఖ సిబ్బందికి సూచించారు. చాలా వేగంగా మారుతున్న సాంకేతికత‌ను గమనించిన ప్రధాని భారత సైన్యాన్ని 'భవిష్యత్ శక్తి'గా అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఎత్తిచూపారు. వచ్చే ఏడాదికి దేశం స్వాతంత్రం పొంది 75 సంవ‌త్స‌రాలు కావ‌స్తున్న నేప‌థ్యంలో దేశ యువతకు స్ఫూర్తినిచ్చే కార్యకలాపాలు, కార్యక్రమాలను చేపట్టేందుకు ఈ మ‌హ‌త్త‌రమైన‌ సందర్భంను ఉపయోగించుకోవాలని ప్ర‌ధాన మంత్రి సాయుధ దళాలకు పిలుపునిచ్చారు.

 *****



(Release ID: 1702953) Visitor Counter : 262