ప్రధాన మంత్రి కార్యాలయం

సిఇఆర్ఎ వీక్ గ్లోబ‌ల్ ఎన‌ర్జీ ఎండ్ ఎన్‌వైర‌న్‌మెంట్ లీడ‌ర్ ‌శిప్ అవార్డు ను స్వీక‌రించ‌నున్న ప్ర‌ధాన మంత్రి;  ఆయ‌నఈ నెల 5న ‘సిఇఆర్ఎ వీక్ 2021’ లో కీల‌కోప‌న్యాసాన్ని ఇవ్వ‌నున్నారు


Posted On: 04 MAR 2021 6:10PM by PIB Hyderabad


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంబ్రిడ్జ్ ఎన‌ర్జీ రిస‌ర్చ్ అసోసియేట్స్‌ వీక్ (సిఇఆర్ఎ వీక్) తాలూకు గ్లోబ‌ల్ ఎన‌ర్జీ ఎండ్ ఎన్‌వైర‌న్‌మెంట్ లీడ‌ర్ శిప్ అవార్డు ను స్వీక‌రించ‌నున్నారు. సిఇఆర్ఎ వీక్ 2021 సమావేశాల లో ఆయన ఈ నెల 5న రాత్రి 7 గంట‌ల స‌మ‌యం లో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా కీల‌కోప‌న్యాసం చేయ‌నున్నారు.

సిఇఆర్ఎవీక్ ను గురించి

సిఇఆర్ఎ వీక్ ను డాక్ట‌ర్ డేనియ‌ల్ ఎర్జిన్ 1983వ సంవ‌త్స‌రం లో స్థాపించడమైంది. 1983వ సంవత్సరం నుంచి ప్ర‌తి ఏటా మార్చి నెల‌ లో హ్యూస్ట‌న్ లో సిఇఆర్ఎ వీక్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. సిఇఆర్ఎ వీక్ ప్ర‌పంచం లో నిర్వహించే శ‌క్తి సంబంధిత ప్లాట్ ఫార్మ్ గా పేరు తెచ్చుకొంది. సిఇఆర్ఎ వీక్ 2021 సమావేశాలను ఈ నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ మ‌ధ్య కాలం లో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తి లో నిర్వహిస్తున్నారు.

అవార్డును గురించి

సిఇఆర్ఎ వీక్ గ్లోబ‌ల్ ఎన‌ర్జీ ఎండ్ ఎన్‌వైర‌న్‌మెంట్ లీడ‌ర్ శిప్ అవార్డు ను 2016వ సంవ‌త్స‌రం లో ప్రారంభించ‌డమైంది. ఇది ప్ర‌పంచం లో శ‌క్తి రంగ, ప‌ర్యావ‌ర‌ణ రంగ భ‌విష్య‌త్తు కు సంబంధించినటువంటి నాయ‌క‌త్వ నిబ‌ద్ధ‌త ను గుర్తిస్తుంది. అంతేకాదు, శ‌క్తి ని అందుబాటు లోకి తీసుకురావడానికి, త‌క్కువ వ్య‌యం తో శ‌క్తి లభ్యం అయ్యేటట్టు చూడటానికి, ప‌ర్యావ‌ర‌ణ ప‌ర‌మైన‌టువంటి సారథ్యానికి సంబంధించి పరిష్కార మార్గాలను అందించడానికి, తత్సంబంధిత విధానాల ను రూపొందించడానికి కూడా పాటుపడుతుంది.

 

***


(Release ID: 1702563) Visitor Counter : 264