ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొ-విన్‌ 1.0 నుంచి కొ-విన్‌ 2.0కు సాంకేతికతను మారుస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో కొవిడ్‌ టీకాలు వేయట్లేదు

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2021 12:27PM by PIB Hyderabad

గత నెల 16వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొవిడ్‌ టీకాల కార్యక్రమం ప్రారంభమయింది. 60 ఏళ్లు దాటినవారికి లేదా ఇతర అనారోగ్యాలున్న 45 ఏళ్లు దాటినవారికి వచ్చేనెల 1 నుంచి దేశవ్యాప్తంగా టీకాలు వేసేందుకు కూడా ఇప్పటికే నిర్ణయించారు.

    ఈ శని, ఆదివారాల్లో (ఫిబ్రవరి 27, 28 తేదీలు) కొ-విన్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను కొ-విన్‌ 1.0 నుంచి కొ-విన్‌ 2.0కు ఆధునీకరిస్తున్నారు. కాబట్టి ఈ రెండు రోజులు టీకా కార్యక్రమానికి మినహాయింపునిచ్చారు. సాంకేతికత మార్పు గురించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే సమాచారం అందింది.

 

***


(రిలీజ్ ఐడి: 1701104) సందర్శకుల సూచీ సంఖ్య : : 273
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Assamese , Malayalam , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil