ప్రధాన మంత్రి కార్యాలయం
పెట్టుబడుల ఉపసంహరణ, అసెట్ మానిటైజేషన్ లకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
Posted On:
24 FEB 2021 7:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు డిఐపిఎఎంలో వీడియోకాన్ఫరెన్సుద్వారా బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇండియాను తిరిగి అత్యధిక వృద్ధి పథంలో పయనింపచేసేలా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను బడ్జెట్ చూపిందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ అభివృద్ధిలో ప్రైవేటురంగం బలమైన పాత్రపై బడ్జెట్ దృష్టి పెట్టినట్టు ప్రధానమంత్రి అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ, అసెట్ మానిటైజేషన్ ప్రాధాన్యత గురించి ఆయన నొక్కి చెప్పారు.
ప్రభుత్వ రంగసంస్థలను నెలకొల్పినప్పుడు ఉన్న కాలం , ఆనాటి అవసరాలు ప్రస్తుత కాలానికి భిన్నమైనవని ప్రధానమంత్రి అన్నారు. ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం ప్రజాధనాన్ని సక్రమంగా సద్వినియోగం చేయడమని అన్నారు. చాలా ప్రభుత్వరంగ సంస్థలు నష్టాలలో నడుస్తున్నాయని ఇవి పన్ను చెల్లింపుదారుల అండతో నిలబడుతున్నాయని అందువల్ల ఇవి ఆర్ధిక వ్యవస్థకు భారం మోపుతున్నాయన్నారు. కేవలం చాలా ఏళ్లుగా ప్రభుత్వరంగ సంస్థలు నడుస్తున్నాయి కనుక అన్న వాదనతో వాటిని నడిపించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎంటర్‌ప్రైజ్‌లకు ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని అయితే అదే సమయంలో వ్యాపార కార్యకలాపాలలో ఉండడం ప్రభుత్వ వ్యవహారం కాదని ఆయన అన్నారు.
ప్రభుత్వ దృష్టి ప్రజల సంక్షేమంపై , అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులపై ఉండాలని అన్నారు. ప్రభుత్వం పలు పరిమితులకు లోబడి పనిచేస్తుందని అందువల్ల వాణిజ్యపరమైన నిర్ణయాలను తీసుకోవడం అంత సులభం కాదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. దానితోపాటు ప్రజల జీవితాలలో ప్రభెఉత్వ అనవసర జోక్యాన్ని తగ్గిస్తుందని అన్నారు. ప్రజల జీవనంలో ప్రభుత్వం లేకుండా ఉండడం కానీ లేదా ప్రభుత్వ ప్రభావం ఉండకూడదన్నారు.దేశంలో తక్కువగా వినియోగిస్తున్న లేదా ఉపయోగించని ఆస్తులు ఉన్నాయని ఇలాంటి స్థితిలో నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను ఈ దృష్టితో ప్రకటించడం జరిగిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రభుత్వం మానిటైజ్, మోడర్నైజ్ మంత్రంతో ముందుకు వెళుతున్నదని ,దీనిని ప్రైవేటు రంగంతో భర్తీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రైవేటు రంగం పెట్టుబడులు తెస్తుందని, తమ తోపాటు ప్రపంచంలోని అత్యున్నత విధానాలను తీసుకువస్తాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్ వల్ల వచ్చే మొత్తం, ప్రైవేటైజేషన్ లను ప్రజా సంక్షేమ పథకాలకు వినియోగించనున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ప్రైవేటీకరణ మెరుగైన ఉపాధి అవకాశాలతో యువతకు సాధికారత కల్పించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలను ప్రైవేటీకరించేందుకు కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన మార్గసూచిని రూపొందించడం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్పారు. ఇది దేశంలో కొత్త పెట్టుబడి అవకాశాలు కల్పించడంతోపాటు, ప్రతిరంగంలో అద్భుత ఉపాధి అవకాశాలను కల్పించనున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ దిశగా పూర్తి చిత్తశుద్ధితో , ఈ విధానాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేసే దిశగా ముందుకు పోతున్నదని ప్రధానమంత్రి అన్నారు. పారదర్శకతను పాటించేందుకు, మన విధానాలు పోటీకి వీలు కల్పించేవిధంగా ఉండేందుకు, సుస్థిరమైన విధానం ఉండడం అవసరం.
ఇన్వెస్టర్లతో అనుసంధానం కావడానికి సాధికారతా కార్యదర్శుల గ్రూప్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, వారి సమస్యలను సత్వరం తొలగించడం జరిగిందని చెప్పారు. అలాగే దేశంలో సులభతర వ్యాపారాన్ని సాధించేందుకు సింగిల్ పాయింట్ కాంటాక్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మన ప్రభుత్వం వ్యాపారానికి ప్రధాన గమ్యంగా భారతదేశాన్ని తీర్చి దిద్దేందుకు నిరంతరాయంగా పలు సంస్కరణలు తీసుకువచ్చిందని , ప్రస్తుతం ఇండియా ఒక మార్కెట్, ఒక పన్ను వ్యవస్థలో ఉందన్నారు. ఇవాళ భారతదేశంలోని కంపెనీలకు ప్రవేశం, నిష్క్రమణకు అద్భుత ఛానళ్లు ఉన్నాయన్నారు. మనం ప్రస్తుతం వివిధ సంక్లిష్టతలను తొలగించి లాజిస్టికల్ సమస్యలను పరిష్కరిస్తున్నామని, సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నామని అన్నారు.భారతదేశంలోని పన్నుల విధానం సులభతరమైందని, పారదర్శకతను బలోపేతం చేయడం జరుగుతోందని అన్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ఇండియా మున్నెన్నడూ లేనంతటి సంస్కరణలను తీసుకువచ్చిందని, ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. దీనివల్ల గత కొద్దినెలల్లో రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి వచ్చినట్టు ఆయన తెలిపారు. ఆత్మనిర్భర భారత్‌ను అభివృద్ధి చేసేందుకు మనం ఆధునిక మౌలిక సదుపాయాలపై పనిచేస్తున్నామని, బహుళ పక్ష అనుసంధానతపై కృషిచేస్తున్నామన్నారు. రాగల ఐదు సంవత్సరాలలో మనం 111 ట్రిలియన్ల రూపాయలను నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద్వారా అప్‌గ్రేడ్ చేసేందుకు మనం ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఆకాంక్షలు ప్రపంచంలోనే అత్యంత యువ దేశానివని,ఇవి కేవలం ప్రభుత్వ ఆకాంక్షలు మాత్రమే కాక, ప్రైవేటు రంగం ఆకాంక్షలు కూడా అని ఆయన అన్నారు. ఈ ఆకాంక్షలు వ్యాపారంలో అద్భుత అవకాశాలను తెచ్చాయని అందువల్ల మనం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
***
(Release ID: 1700823)
Visitor Counter : 168
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam