ప్రధాన మంత్రి కార్యాలయం

కేరళలో విద్యుత్తు, పట్టణ రంగాల కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి

ఈ రోజు ప్రారంభమవుతున్న అభివృద్ధి పనులు కేరళలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి, అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి : ప్రధానమంత్రి

గత ఆరేళ్ళలో, భారతదేశ సౌర విద్యుత్తు సామర్థ్యం 13 రెట్లు పెరిగింది: ప్రధానమంత్రి

మన అన్న దాతలు, విద్యుత్తు దాతలుగా మారడానికి, రైతులు సౌర విద్యుత్తు రంగంతో అనుసంధానించబడుతున్నారు : ప్రధానమంత్రి

అభివృద్ధి మరియు సుపరిపాలనలకు - కులం, మతం, జాతి, లింగం, విశ్వాసం లేదా భాష తెలియవు : ప్రధానమంత్రి

Posted On: 19 FEB 2021 6:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ,  వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.  ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో - కేరళ ముఖ్యమంత్రి శ్రీ పునరాయ్ విజయన్ తో పాటు,  కేంద్ర విద్యుత్తూ, నూతన మరియు పునర్వినియోగ ఇంధన శాఖల (ఐ.సి) సహాయ మంత్రి  శ్రీ రాజ్ కుమార్ సింగ్;  కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు ప్రారంభమవుతున్న అభివృద్ధి పనులు కేరళలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి, అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చనున్నాయని, పేర్కొన్నారు.  భారతదేశ ప్రగతికి గొప్ప కృషి చేస్తున్న కేరళ ప్రజలకూ, వారి సుందరమైన రాష్ట్రానికీ, ఈ అభివృద్ధి పనులు,విద్యుత్తును అందించడంతో పాటు సాధికారతను కల్పిస్తాయి. 

ఈ రోజు ప్రారంభించబడిన, అత్యాధునిక, 2000 మెగా వాట్ల, పుగళూరు - త్రిస్సూర్ హై వోల్టేజ్ డైరెక్ట్ విద్యుత్తు వ్యవస్థ, కేరళకు చెందిన, నేషనల్ గ్రిడ్‌ తో మొదటి హెచ్.‌వి.డి.సి. ఇంటర్ కనెక్షన్ ప్రాజెక్టు. ఇది, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్లను తీర్చడానికి భారీ మొత్తంలో విద్యుత్తు బదిలీని సులభతరం చేస్తుంది.  దీంతోపాటు, దేశంలో ప్రసారం కోసం, వి.ఎస్.సి. కన్వర్టర్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం కూడా ఇదే మొదటిసారి. అంతర్గత విద్యుత్తు ఉత్పత్తి యొక్క కాలానుగుణ స్వభావం కారణంగా,  కేరళ నేషనల్ గ్రిడ్ నుండి విద్యుత్తు దిగుమతిపై ఎక్కువగా ఆధారపడి ఉందనీ, హెచ్.‌వి.డి.సి. వ్యవస్థ అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుందనీ, ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన హెచ్‌.వి.డి.సి. పరికరాలు భారతదేశంలో తయారయ్యాయనీ, ఇది, స్వావలంబన భారత్ ఉద్యమానికి బలాన్ని చేకూరుస్తుందని, ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

సౌర విద్యుత్తులో మన లాభాలు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా బలమైన పోరాటాన్ని నిర్ధారిస్తాయనీ, ఇది మన పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహాన్నిస్తోందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  మన అన్నదాతలు, విద్యుత్తు దాతలుగా మారడానికి వీలుగా రైతులు కూడా సౌర విద్యుత్తు రంగంతో అనుసంధానించబడుతున్నారని ఆయన చెప్పారు.  ప్రధానమంత్రి-కుసుం యోజన కింద 20 లక్షలకు పైగా సౌర విద్యుత్తు పంపులను రైతులకు అందజేస్తున్నారు.  గత ఆరేళ్ళలో, భారతదేశ సౌర విద్యుత్తు సామర్థ్యం 13 రెట్లు పెరిగిందని, ఆయన చెప్పారు.  అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా భారతదేశం ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. మన నగరాలు వృద్ధికి మరింత ముందుకు తీసుకువెళ్ళే ఇంజిన్లు వంటివనీ, ఆవిష్కరణలకు శక్తి క్షేత్రాలనీ, ప్రధానమంత్రి అభివర్ణించారు.  మన నగరాలు ప్రోత్సాహకరమైన మూడు పోకడలను చూస్తున్నాయి: అవి, సాంకేతిక అభివృద్ధి, అనుకూల జనాభా డివిడెండ్ మరియు పెరుగుతున్న దేశీయ డిమాండ్. 

స్మార్ట్ సిటీస్ మిషన్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, మంచి పట్టణ ప్రణాళిక మరియు నిర్వహణలో నగరాలకు సహాయం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  54 కమాండ్ సెంటర్ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయనీ, వీటిలో 30 ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలులో ఉన్నాయనీ, ఆయన ప్రకటించారు. ముఖ్యంగా మహమ్మారి రోజుల్లో, ఈ కేంద్రాలు, బాగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు.  స్మార్ట్ సిటీస్ మిషన్ కింద, కేరళ లోని రెండు స్మార్ట్ సిటీలు - కొచ్చి మరియు తిరువనంతపురం గణనీయమైన పురోగతిని సాధించాయి.  773 కోట్ల రూపాయల విలువైన 27 ప్రాజెక్టులు పూర్తయ్యాయి, సుమారు 2000 కోట్ల రూపాయల విలువైన 68 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.

నగరాలు తమ వ్యర్థ జల శుద్ధి మౌలిక సదుపాయాలను విస్తరించడానికి మరియు పెంపొందించడానికీ, అమృత్ పధకం సహాయపడుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.  కేరళలో, అమృత్ పధకం కింద మొత్తం 175 నీటి సరఫరా ప్రాజెక్టులు 1100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. 9 అమృత్ నగరాల్లో సార్వత్రిక సేవలు అందుబాటులో ఉన్నాయి.  ఈ రోజు ప్రారంభించిన అరువిక్కర నీటి శుద్ధి ప్లాంటు 70 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి అయ్యింది.  ఇది సుమారు 13 లక్షల మంది పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుంది.  ఇది తిరువనంతపురంలో తలసరి నీటి సరఫరాను రోజుకు 150 లీటర్లకు పెంచడానికి సహాయపడుతుంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం భారతదేశ వ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరే స్వరాజ్య విధానానికి శివాజీ ప్రాధాన్యతనిచ్చారని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  శివాజీ పటిష్టమైన నావికాదళాన్ని నిర్మించారనీ, తీరప్రాంత అభివృద్ధితో పాటు, మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారనీ ప్రధానమంత్రి పేర్కొంటూ - శివాజీ ఆలోచనా విధానాన్ని, తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని వివరించారు.  రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారతదేశం పయనిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.  రక్షణ, మరియు అంతరిక్ష రంగాలలో, విప్లవాత్మక సంస్కరణలు జరిగాయని తెలిపారు.  ఈ ప్రయత్నాల ఫలితంగా, అనేకమంది ప్రతిభావంతులైన భారతీయ యువకులకు ఉపాధి అవకాశాలు లభించాయని, ఆయన చెప్పారు.  భారతదేశం నీలి ఆర్ధికవ్యవస్థలో పెట్టుబడులు పెడుతోందని ఆయన అన్నారు.  మరింత క్రెడిట్, పెరిగిన సాంకేతికత, అత్యుత్తమ నాణ్యమైన మౌలిక సదుపాయాలతో పాటు, సహాయక ప్రభుత్వ విధానాలు వంటి వాటిపై, మత్స్యకారుల సంఘాల కోసం, మనం చేసే ప్రయత్నాలు ఆధారపడి ఉన్నాయి.  సముద్ర-ఆహార ఎగుమతులకు భారతదేశం కేంద్రంగా మారడానికి వీలుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రముఖ మలయాళ కవి కుమారనాషన్ మాటలను ప్రధానమంత్రి, ఉటంకిస్తూ,

“ నేను అడగటం లేదు, 

సోదరీ, నీ కులాన్ని,  

నేను అడుగుతున్నాను నీటిని,  

నాకు దాహంగా ఉందని." అనే కవితను వినిపించారు. 

అభివృద్ధి మరియు సుపరిపాలనలకు - కులం, మతం, జాతి, లింగం, విశ్వాసం లేదా భాష తెలియవని పేర్కొన్నారు. అభివృద్ధి అనేది, అందరి కోసం, అదే, "సబ్-కా-సాథ్, సబ్-కా-వికాస్, సబ్-కా-విశ్వస్"  యొక్క సారాంశం. సమైక్యత, అభివృద్ధి యొక్క ఈ భాగస్వామ్య దృష్టిని సాకారం చేయడానికి సహకరించాలని, ప్రధానమంత్రి, కేరళ ప్రజలను కోరారు.

*****



(Release ID: 1699588) Visitor Counter : 202