ప్రధాన మంత్రి కార్యాలయం

‘‘పరీక్షా పే చర్చ 2021’’ లో భాగం గా విద్యార్థుల తో, ఉపాధ్యాయుల తో, తల్లితండ్రుల తో మాట్లాడ‌నున్న‌ ప్రధాన మంత్రి

Posted On: 18 FEB 2021 3:16PM by PIB Hyderabad

‘‘పరీక్షా పే చర్చ 2021’’ కార్య‌క్ర‌మం లో భాగం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌పంచ‌వ్యాప్తం గా విద్యార్థులతోను, ఉపాధ్యాయులతోను, త‌ల్లితండ్రుల తోను ఆన్‌లైన్ మాధ్య‌మం ద్వారా సంభాషించ‌నున్నారు.

’’మ‌న సాహ‌సిక #ExamWarriors వారి ప‌రీక్ష‌ల కోసం సిద్ధం అవుతున్న త‌రుణం లో, ‘‘పరీక్షా పే చర్చ 2021’’ కార్య‌క్ర‌మం మ‌రోసారి ముందుకు వ‌స్తున్న‌ది; ఈ ప‌ర్యాయం ఇది పూర్తి గా ఆన్ లైన్ మాధ్య‌మం లోనే జ‌రుగ‌నుంది. దీనిలో పాలుపంచుకోవడానికి ప్ర‌పంచ‌ం అంతటా ఉన్న విద్యార్థుల‌ కు అవ‌కాశం ఉంటుంది. రండి, మ‌నం చిరున‌వ్వు మోము తోను, ఎలాంటి ఒత్తిడి కి తావు ఇవ్వ‌కుండాను ప‌రీక్ష‌ల కు స‌న్న‌ద్ధం అవుదాం. #PPC2021

ప్ర‌జాబాహుళ్యం కోరిన మీదట ‘‘ప‌రీక్షా పే చ‌ర్చా 2021’’ కార్య‌క్ర‌మం లో ఉపాధ్యాయుల కు, త‌ల్లితండ్రుల కు  కూడా స్థానాన్ని ఇవ్వడం జ‌రుగుతుంది. ఇది అవడానికి గంభీరమైన విషయమే అయినప్పటికీ ఇందులో వినోద‌ భ‌రిత‌మైన‌టువంటి చ‌ర్చ చోటు చేసుకోనుంది. పెద్ద సంఖ్య ల‌లో #PPC2021 లో  పాల్గొనవల‌సిందిగా నా విద్యార్థి మిత్రుల‌ కు, స్నేహశీలురైన వారి త‌ల్లితండ్రుల‌ కు, శ్ర‌మ‌ కు ఓర్చే ఉపాధ్యాయుల‌ కు నేను పిలుపునిస్తున్నాను’’ అని అనేక ట్వీట్ ల‌లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

పాఠ‌శాల విద్యార్థుల తో, క‌ళాశాల విద్యార్థుల తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి గా భేటీ అయ్యే కార్య‌క్ర‌మం లో తొలి సంచిక ‘‘ప‌రీక్షా పే చ‌ర్చ 1.0’’ ను 2018వ సంవ‌త్స‌రం లో ఫిబ్ర‌వ‌రి 16 వ తేదీ న న్యూ ఢిల్లీ లోని తాల్ క‌టోరా స్టేడియ‌మ్ లో నిర్వ‌హించ‌డ‌ం జరిగింది. పాఠ‌శాల విద్యార్థుల తో, క‌ళాశాల విద్యార్థుల తో ఇదే త‌ర‌హా ముఖాముఖి సమావేశ కార్య‌క్ర‌మం రెండో సంచిక ‘‘ప‌రీక్ష పే చ‌ర్చ 2.0’’ ను కూడా న్యూ ఢిల్లీ లోని తాల్ క‌టోరా స్టేడియ‌మ్ లోనే 2019వ సంవ‌త్స‌రం జన‌వ‌రి 29న నిర్వ‌హించారు. ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి కార్యక్రమం ‘‘ప‌రీక్షా పే చ‌ర్చ 2020’’ లో మూడో సంచిక కింద‌టి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 20న న్యూ ఢిల్లీ లోని తాల్ క‌టోరా స్టేడియ‌మ్ లో జ‌రిగింది. అయితే, దీనిలో భాగం గా పాఠ‌శాల విద్యార్థుల తో మాత్ర‌మే ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి కార్య‌క్ర‌మం  సాగింది.

 

***



(Release ID: 1699091) Visitor Counter : 150