ప్రధాన మంత్రి కార్యాలయం

ఓమన్ సుల్తాన్ మాన్య‌ శ్రీ సుల్తాన్‌ హైథ‌మ్ బిన్ తారిక్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 17 FEB 2021 9:20PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుధ‌వారం నాడు, అంటే ఈ నెల 17న, ఓమన్ సుల్తాన్ మాన్య‌ శ్రీ సుల్తాన్‌ హైథ‌మ్ బిన్ తారిక్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.

కోవిడ్‌-19 టీకామందు ను ఓమ‌న్ కు స‌ర‌ఫ‌రా చేసినందుకు గాను భారతదేశాన్ని మాన్య‌శ్రీ సుల్తాన్ ప్రశంసించారు.  మ‌హ‌మ్మారి కి వ్య‌తిరేకం గా సంయుక్తం గా పోరాడడం లో స‌న్నిహిత స‌హ‌కారాన్ని కొన‌సాగించుకోవాలంటూ నేత‌ లు వారి అంగీకారాన్ని వ్య‌క్తం చేశారు.

మాన్య శ్రీ సుల్తాన్ త‌న ప‌ద‌వీకాలం లో ఒక సంవత్సరం పూర్తి చేసుకొన్నందుకు, ఓమ‌న్ కోసం విజ‌న్ 2040 కి రూపకల్పన చేసినందుకు గాను ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ర‌క్ష‌ణ‌, ఆరోగ్యం, వ్యాపారం, పెట్టుబ‌డి రంగాలు స‌హా అన్ని రంగాల లో భార‌త‌దేశం- ఓమ‌న్ స‌హ‌కారం పెరుగుతూ ఉండ‌డం ప‌ట్ల నేత‌ లు వారి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య దేశాలైన భార‌త‌దేశం, ఓమ‌న్ ల మ‌ధ్య ఆర్థిక‌ సంబంధాలను, సాంస్కృతిక బంధాల‌ ను పెంపొందింప చేయ‌డం లో భార‌తీయ ప్రవాసులు చక్కని పాత్ర ను పోషిస్తున్నారంటూ ఇరువురు నేత లు మెచ్చుకొన్నారు.



 

*** 


(Release ID: 1698995) Visitor Counter : 95