ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వేగంగా తగ్గుతున్న కోవిడ్ మరణాలు; రోజువారీ మరణాలు 100 లోపు


మరణాలు 1.5% లోపు; ప్రపంచంలోనే అత్యల్పాలలో ఒకటి

కోలుకున్నవారి శాతం 97.31%; ప్రపంచ అత్యధికాలలో ఒకటి

ఇప్పటిదాకా 82 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు

Posted On: 14 FEB 2021 11:53AM by PIB Hyderabad

2020 అక్టోబర్ 1 నుంచి భారతదేశంలో కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటలలో 92 మరణాలు నమోదయ్యాయి.

2020 అక్టోబర్ 1 నుంచి కోవిడ్ మరణాలు తగ్గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మరణాల శాతం 1.5 కంటే తక్కువగా 1.43% గా నమొదైంది. ఇది ప్రపంచంలో అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి.

ఇప్పటిదాకా 1,06,11,731 మంది కోవిడ్ బారినపడి కోలుకున్నారు. గత 24 గంటలలో 11,016  మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో కోలుకున్నవారి శాతం 97.31% గా నమోదు కాగా ఇది ప్రపంచంలో అత్యధిక శాతాల్లో ఒకటి కావటం గమనార్హం.  కొలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం అది 1,04,74,164 కి చేరింది.

2021 ఫిబ్రవరి 14 ఉదయం 8 గంటలకల్లా దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కలిసి మొత్తం 82 లక్షలు దాటింది.

82,63,858 మంది లబ్ధిదారులు  1,72,852 శిబిరాలలో టీకాలు వేయించుకున్నారు. వీరిలో 59,84,018 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా  23,628 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ కూడా అందుకున్నారు. మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధుల సంఖ్య 22,56,212

రెండో డోస్ కోవిడ్ టీకా నిన్ననే మొదలయింది. మొదటి విడత డోస్ అందుకొని 28 రోజులు గడిచిన అనంతరం రెండో డోస్ ఇవ్వటం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

 

క్రమసంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1వ డోస్

2 వ డోస్

మొత్తం డోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

3,646

0

3,646

2

ఆంధ్రప్రదేశ్

3,56,521

5,820

3,62,341

3

అరుణాచల్ ప్రదేశ్

15,633

461

16,094

4

ఆస్సాం

1,27,566

2,215

1,29,781

5

బీహార్

4,91,233

0

4,91,233

6

చండీగఢ్

8,660

143

8,803

7

చత్తీస్ గఢ్

2,61,274

833

2,62,107

8

దాద్రా, నాగర్ హవేలి

2,922

41

2,963

9

డామన్, డయ్యూ

1,121

30

1,151

10

ఢిల్లీ

1,89,351

1,856

1,91,207

11

గోవా

13,166

517

13,683

12

గుజరాత్

6,80,326

0

6,80,326

13

హర్యానా

1,95,745

588

1,96,333

14

హిమాచల్ ప్రదేశ్

81,482

475

81,957

15

జమ్మూ, కశ్మీర్

1,28,822

807

1,29,629

16

జార్ఖండ్

1,99,008

1,873

2,00,881

17

కర్నాటక

4,96,159

0

4,96,159

18

కేరళ

3,56,322

0

3,56,322

19

లద్దాఖ్

2,904

77

2,981

20

లక్షదీవులు

1,776

0

1,776

21

మధ్యప్రదేశ్

5,57,105

0

5,57,105

22

మహారాష్ట్ర

6,82,420

189

6,82,609

23

మణిపూర్

22,362

55

22,417

24

మేఘాలయ

13,998

91

14,089

25

మిజోరం

11,494

74

11,568

26

నాగాలాండ్

9,684

0

9,684

27

ఒడిశా

4,11,939

0

4,11,939

28

పుదుచ్చేరి

5,953

71

6,024

29

పంజాబ్

1,03,799

59

1,03,858

30

రాజస్థాన్

6,09,568

0

6,09,568

31

సిక్కిం

8,335

0

8,335

32

తమిళనాడు

2,46,420

1,154

2,47,574

33

తెలంగాణ

2,78,915

3,273

2,82,188

34

త్రిపుర

69,196

366

69,562

35

ఉత్తరప్రదే

8,58,602

0

8,58,602

36

ఉత్తరాఖండ్

1,08,974

0

1,08,974

37

పశ్చిమ బెంగాల్

5,12,772

2,345

5,15,117

38

ఇతరములు

1,15,057

215

1,15,272

 

మొత్తం

82,40,230

23,628

82,63,858

 

టీకాల కార్యక్రమం మొదలైన 29వ రోజు అయిన ఫిబ్రవరి 13న మొత్తం 2,96,211 మంది టీకాలు వేయించుకున్నారు. వారిలో 2,72,583 మందికోసం  8,071 శిబిరాలలో మొదటి డోస్ ఇవ్వగా  23,628 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు.  దేశమంతటా టీకాలు వేయించుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

టీకాలు వేయించుకున్నవారిలో 68.55% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే. 

గత 24 గంటలలో కోలుకున్నవారిలో 81.58% మంది కేవలం ఆరు రాష్టాలకు చెందినవారే ఉన్నారు. .

కేరళలో అత్యధికంగా ఒక రోజులోనే  5,835 మంది కోలుకోగా మహారాష్ట్రలో 1,773 మంది, తమిళనాడులో 482  మంది కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితులు  మొత్తం కోవిడ్ కేసులలో  of కేవలం 1.26%. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ  నేడు 1,37,567 కు చేరింది

గత 24 గంటల్ళొ నమోదైన కొత్త కోవిడ్ కేసుల్లో 86.25% కేవలం ఆరు రాష్టాలకు చెందినవే.

రోజువారీ కొత్త కెసుల్లో కేరళ తన మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. నిన్న  కేరళలో 5,471 కొత్త కేసులు రాగా, మహారాష్ట్రలో 3,611, తమిళనాడులో 477 కేసులు వచ్చాయి.

గత 24 గంటలలో నమోదైన కొత్త మరణాలలో 78.3% ఆరు రాష్ట్రాలలో సంభవించినవే.  మహారాష్ట్రలో అత్యధికంగా 38 మరణాలు నమోదు కాగా, కేరళలో 16 మంది, తమిళనాడు, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు.

*****

 


(Release ID: 1697901) Visitor Counter : 259