ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో 28 రోజుల్లో 80 లక్షలు దాటిన కోవిడ్ టీకా లబ్ధిదారుల సంఖ్య


8 రాష్ట్రాల్లో నాలుగు లక్షలకు చేరిన టీకా లబ్ధిదారుల సంఖ్య

గత 24 గంటల్లో కోవిడ్ సంబంధ మరణాలు నమోదు కాని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

Posted On: 13 FEB 2021 11:27AM by PIB Hyderabad

భారతదేశం కోవిడ్-19 మీద పొరులో భాగంగా దాదాపు 80 లక్షలమందికి టీకాలు వేసింది. 2021 ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలకల్లా 79,67,647 మందికి టీకాలిచ్చారు. వీరిలో 59,09,136 మంది ఆరోగ్య సిబ్బంది కాగా 20,58,511 మంది కోవిడ్ యోధులు. వీరికోసం 1,64,781 శిబిరాలు నిర్వహించారు.

క్రమసంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

3,454

2

ఆంధ్రప్రదేశ్

3,51,993

3

అరుణాచల్ ప్రదేశ్

15,098

4

అస్సాం

1,25,038

5

బీహార్

4,71,683

6

చండీగఢ్

8,017

7

చత్తీస్ గఢ్

2,47,745

8

దాద్రా, నాగర్ హవేలి

2,890

9

డామన్, డయ్యూ

1,095

10

ఢిల్లీ

1,77,439

11

గోవా

12,949

12

గుజరాత్

6,67,073

13

హర్యానా

1,94,124

14

హిమాచల్ ప్రదేశ్

79,166

15

జమ్మూ-కశ్మీర్

1,11,470

16

జార్ఖండ్

1,88,095

17

కర్నాటక

4,91,552

18

కేరళ

3,45,197

19

లద్దాఖ్

2,854

20

లక్షదీవులు

1,776

21

మధ్యప్రదేశ్

5,26,095

22

మహారాష్ట్ర

6,49,660

23

మణిపూర్

19,563

24

మేఘాలయ

12,797

25

మిజోరం

11,332

26

నాగాలాండ్

9,125

27

ఒడిశా

3,99,670

28

పుదుచ్చేరి

5,510

29

పంజాబ్

1,01,861

30

రాజస్థాన్

6,06,694

31

సిక్కిం

8,335

32

తమిళనాడు

2,27,542

33

తెలంగాణ

2,78,250

34

త్రిపుర

65,288

35

ఉత్తరప్రదేశ్

8,58,602

36

ఉత్తరాఖండ్

1,04,052

37

పశ్చిమ బెంగాల్

4,85,054

38

ఇతరములు

99,509

మొత్తం

79,67,647

 

28వ రోజైన ఫిబ్రవరి 12న టీకాల కార్యక్రమంలో మొత్తం 4,62,637 మంది టీకాలు వేయించుకోగా, వారిలో ఆరోగ్య్ సిబ్బంది 94,160 మంది, కోవిడ్ యోధులు 3,68,477 మంది ఉన్నారు. వీరికోసం 10,411 శిబిరాలు నిర్వహించారు. టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారిలో 60% (59.70%) మంది ఎనిమిది రాష్టాలకు చెందినవారున్నారు. ఈ రాష్ట్రాలలో నాలుగేసి లక్షలకు మించి టీకా లబ్ధిదారులున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10.8% (8,58,602) మంది టీకాలు తీసుకున్నారు.

రోజువారీ కోవిడ్ మరణాలు గత 24 గంటలలో బాగా తగ్గాయి. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మాత్రం 1-5 మధ్య మరణాలు నమోదయ్యాయి.

17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, పుదుచ్చేరి, చందీగఢ్, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, సిక్కిం, మేఘాలయ, లద్దాఖ్, మిజోరం, అండమాన్, నికోబార్ దీవులు, త్రిపుర, లక్షదీవులు, అరుణాచల్ ప్రదేశ్, డయ్యూ-డామన్, దాద్రా-నాగర్ హవేలి.

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,36,571 కి తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.25% మాత్రమే.

ఇప్పటిదాకా 1,06,00,625 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, గత 24 గంటలలో కోలుకున్నవారు 11,395 మంది. జాతీయ స్థాయిలొ కోలుకున్నవారి శాతం 97.32%. కు పెరిగింది. కొత్తగా కోలుకున్నవారిలో 81.93% మంది 6 రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక రోజులో 5,332 మంది కోలుకోగా, ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర (2422) మంది, తమిళనాడు (486) మంది ఉన్నాయి.

 

12,143 కేసులు కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయ్యాయి. అందులో 86.01% కేవలం ఆరు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అత్యధిక కొత్త కేసుల్లో కేరళ ముందుండగా అక్కడ 5,397 కేసులు వచ్చాయి. ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర (3,670), తమిళనాడు(483) ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లొ 103 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో 80.58% మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 36 మంది చనిపోగా, కేరళలో 18 మంది, పంజాబ్ లో 8 మంది చనిపోయారు.

******

 


(Release ID: 1697684) Visitor Counter : 229