ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రికార్డ్ స్థాయిలో భారత్ లో 20 కోట్లమందికి కోవిడ్ పరీక్షలు

8 నెలల కనిష్ఠ స్థాయిలో చికిత్సలో ఉన్నవారు 1.5 లక్షల లోపు మొత్తం 54 లక్షలమందికి పైగా టీకాల లబ్ధిదారులు

21 రోజుల్లో 50 లక్షల టీకాల మైలురాయి వేగంగా చేరుకున్న భారత్

Posted On: 06 FEB 2021 12:04PM by PIB Hyderabad

భారత దేశం ఇప్పటివరకు అత్యధిక కోవిడ్ పరీక్షలు చేయించిన దేశంగా అరుదైన మైలురాయి చేరుకుంది. 20 కోట్ల స్థాయి దాటి

 నేటికి 20,06,72,589 చేరుకుంది. గత 24 గంటల్లోనే  7,40,794 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా వ్యాధి నిర్థారణ పరీక్షలకు

అవసరమైన మౌలికసదుపాయాలు పెరగటంతో ఈ విధంగా పరీక్షల సంఖ్య పెరిగింది. దేశంలో ప్రస్తుతం 2369 పరీక్షల లాబ్ లు

ఉండగా అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 1214, ప్రైవేట్ రంగంలో 1155 లాబ్ లు ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల శాతం

కూడా క్రమంగా తగ్గుతూ 5.39 శాతానికి చేరింది. 

పెద్ద ఎత్తున వ్యాధి నిర్థారణ పరీక్షలు జరపటం వలన కూడా  జాతీయ స్థాయిలో పాజిటివ్ శాతం తగ్గటానికి దారితీసింది. అలా

పరీక్షలు పెరుగుతూ ఉండటాం. తక్కువ కేసులు నమోదు కావటం ఫలితంగా పాజిటివ్ శాతం తగ్గుతూ వచ్చింది.

భారతదేశంలో ఇంకా కోవిడ్ కు చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అది 1.5 లక్షల కంటే తగ్గి

నేడు 1,48,590 కి చేరింది. ఇది గత 8 నెలల్లో అత్యల్పం. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు మొత్తం పాజిటివ్ కేసుల్లో 1.37%

దేశంలో గత 24 గంటలలో మరణాలు కూడా 100 లోపుకు తగ్గి 95 నమోదయ్యాయి.

 

దేశవ్యాప్తంగా సాగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 8 గంటలకు 

మొత్తం టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 54 లక్షలు దాటి 54,16,849 గా నమోదైంది.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం  

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

3,161

2

అంధ్రప్రదేశ్

2,72,190

3

అరుణాచల్ ప్రదేశ్

11,834

4

అస్సాం

77,225

5

బీహార్

3,54,360

6

చండీగఢ్

5,234

7

చత్తీస్ గఢ్

1,50,487

8

దాద్రా, నాగర్ హవేలి

1,214

9

డామన్, డయ్యూ

674

10

ఢిల్లీ

1,00,079

11

గోవా

7,939

12

గుజరాత్

3,94,416

13

హర్యానా

1,37,706

14

హిమాచల్ ప్రదేశ్

51,555

15

జమ్మూ, కశ్మీర్

41,624

16

జార్ఖండ్

85,580

17

కర్నాటక

3,60,592

18

కేరళ

2,86,132

19

లద్దాఖ్

1,745

20

లక్షదీవులు

831

21

మధ్యప్రదేశ్

3,40,625

22

మహారాష్ట్ర

4,34,943

23

మణిపూర్

6,874

24

మేఘాలయ

6,213

25

మిజోరం

10,555

26

నాగాలాండ్

4,515

27

ఒడిశా

2,35,680

28

పుదుచ్చేరి

3,532

29

పంజాబ్

72,855

30

రాజస్థాన్

4,14,422

31

సిక్కిం

5,139

32

తమిళనాడు

1,57,324

33

తెలంగాణ

1,93,667

34

త్రిపుర

37,359

35

ఉత్తరప్రదేశ్

6,73,542

36

ఉత్తరాఖండ్

70,292

37

పశ్చిమ బెంగాల్

3,44,227

38

ఇతరములు

60,507

                                      మొత్తం

54,16,849

 

ప్రతిరోజూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుదల నమోదు చేసుకుంటోంది.

కోవిడ్ టీకాలలో 50 లక్షల మైలురాయి అత్యంత వేగంగా దాటిన దేశం భారత్. దీన్ని కేవలం 21 రోజుల్లో సాధించగలిగింది.

అనేక దేశాలకు ఈ స్థాయికి చేరుకోవటానికి 60 రోజులకు పైగా పట్టింది.

 

 

గత 24 గంటలలో 10,502 శిబిరాలలో 4,57,404 మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం

1,06,303 శిబిరాలు నిర్వహించారు. టీకాలు వేయించుకున్నవారిలో 3,01,537  మంది ఆరోగ్య సిబ్బందికాగా 1,55,867

మంది కరోనా సంక్షోభ సమయంలో ముందుండి సేవలందించిన  కరోనా యోధులు. భారత్ లో రోజువారీ కోలుకుంటున్నవారి

సంఖ్య కూడా పెరుగుతూ ప్రస్తుతం కోలుకున్నవారి శాతం  97.19% కు చేరింది. ఇప్పటిదాకా కోలుకున్నవారు

1,05,10,796 మంది కాగా, గత 24 గంటలలో  14,488 మంది కొకోలుకున్నారు.

 

కొత్తగా కోలుకున్నవారిలో 82.07% మంది ఆరు రాష్టాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా ఒక్కరోజులోనే

6,653 మంది, మహారాష్ట్రలో 3,573 మంది, తమిళనాడులో 506 మంది కోలుకున్నారు.

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసుల్లో 83.3% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా

5,610 కొత్త కేసులు రాగా, మహారాష్ట్రలో 2,628, తమిళనాడులో  489 కొత్త కేసులు వచ్చాయి.

 

గత 24 గంటల్లో నమోదైన మరణాలలో ఆరు రాష్ట్రాలవాటా 81.05% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 40 మంది, ఆ

తరువాత కేరళలో 19 మంది, చత్తీస్ గఢ్ లో 8 మంది చనిపోయారు.

 

***



(Release ID: 1695871) Visitor Counter : 174