ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీఎస్టీ పరిహార లోటును తీర్చడానికి రాష్ట్రాలకు 14వ విడతగా రూ.6,000 కోట్ల విడుదల
రాష్ట్రాలకు, శాసనసభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం రూ. 84,000 కోట్లు విడుదల
ఇది రాష్ట్రాలకు మంజూరు చేసిన అదనపు రుణ అనుమతి రూ.1,06,830 కోట్లకి అదనం
Posted On:
03 FEB 2021 1:14PM by PIB Hyderabad
జీఎస్టీ పరిహార కొరతను పూడ్చుకునేందుకు రాష్ట్రాలకు 14వ వారపు వాయిదాగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ శాఖ రూ. 6,000 కోట్లను బుధవారం విడుదల చేసింది. ఈ మొత్తంలో, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులైన 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లను, శాసన సభలు గల మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఢిల్లీ, జమ్ము,కాశ్మీర్, పుదుచ్చేరి) రూ.483.40 కోట్లను విడుదల చేసింది. మిగిలిన ఐదు రాష్ట్రాలయిన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కింకు జీఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో లోటు ఏర్పడలేదు.
ఇప్పటివరకు, రాష్ట్రాలు, శాసన సభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం జిఎస్టీ పరిహార లోటు అంచనాలో 76శాతాన్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో రూ. 76,616.16 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు, రూ. 7,383.84 కోట్లను శాసనసభలు కలిగిన 3 కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేశారు.
జిఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో ఏర్పడిన రూ. 1.10 లక్షల కోట్ల మొత్తాన్ని పూడ్చేందుకు వెసులుబాటు కల్పించడంలో భాగంగా భారత ప్రభుత్వం అక్టోబర్ 2020లో ప్రత్యేక రుణ గవాక్షాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరఫున భారత ప్రభుత్వం ఈ గవాక్షం ద్వారా రుణాలు ఇచ్చిపుచ్చుకుంటోంది. అక్టోబర్ 23, 2020నుంచి ప్రారంభమై, నేటి వరకు 14 విడతల రుణాలు విడుదల చేయడం జరిగింది. ఈ వారం రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం నిధులు14 విడతవి.
ఈ వారం రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం నిధులు14 విడతవి.
ఈ వారం విడుదల చేసిన మొత్తం అటువంటి రాష్ట్రాలకు సమకూరుస్తున్న నిధుల 14వ విడత. ఈ వారం ఈ నిధులను 4.6144% వడ్డీ రేటుతో రుణాలను తీసకున్నారు. నేటివరకు ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా 4.7395% సగటు వడ్డీ రేటుతో రూ. 84,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం రుణంగా తీసుకుంది.
జిఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన ఆదాయ లోటును పూడ్చుకునేందుకు ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా నిధులను సమకూర్చడమే కాకుండా, జిఎస్టీ పరిహార లోటును తీర్చుకునేందుకు ఆప్షన్ 1ని ఎంచుకున్న రాష్ట్రాలకు అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తోడ్పడేందుకు భారత ప్రభుత్వం స్థూల రాష్ట్ర ఆదాయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 0.50%నికి సమానమైన రుణాన్ని అదనంగా పొందేందుకు అనుమతిని ఇచ్చింది. అన్ని రాష్ట్రాలూ ఆప్షన్-1ని ఎంచుకునేందుకు మొగ్గు చూపాయి. ఈ ప్రొవిషన్ కింద 28 రాష్ట్రాలు రూ.1,06,830 కోట్లను (0.50% జిఎస్డీపీ) అదనపు మొత్తాన్ని రుణంగా పొందేందుకు అనుమతిని ఇవ్వడం జరిగింది.
ఇప్పటి వరకు 28 రాష్ట్రాలకు అదనపు రుణాన్ని పొందేందుకు అనుమతినిచ్చిన మొత్తం, ప్రత్యేక గవాక్షం ద్వారా నిధులు తీసుకుని ఇప్పటి వరకు విడుదల చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వివరాలను అనుబంధంలో చేర్చడం జరిగింది.
జిఎస్‌డిపీలో 0.50% అదనపు రుణాలు, ప్రత్యేక గవాక్షం ద్వారా నిధులు తీసుకుని 01.02.2021 వరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించిన వివరాలు రాష్ట్రాల వారీగా ఇవ్వడం జరిగింది.
***
(Release ID: 1694841)
Visitor Counter : 247