ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
8 నెలల తరువాత 9000 కు దిగువన రోజువారీ కేసులు
గత 24 గంటలలో 8,635 కోవిడ్ కేసులు నమోదు
రోజువారీ మరణాలు 100 లోపు, 8.5 నెలల్లో అత్యల్పం
ఇప్పటిదాకా 39.5 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు
Posted On:
02 FEB 2021 11:33AM by PIB Hyderabad
భారతదేశంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిరుడు సెప్టెంబర్ 10న గరిష్ఠ స్థాయిలో నమోదైన కేసులు ఇప్పుడు 8 నెలల కనిష్ఠానికి తగ్గుతూ ఈ రోజు 8,635 గా నమోదయ్యాయి.
భారత దేశపు సగటు కొత్త కేసులు కూడా గత 5 వారాలుగా స్పష్టమైన తగ్గుదల నమోదు చేసుకుంటున్నాయి. 2020 డిసెంబర్ 30 – 2021 జనవరి 5 మధ్య సగటు 18,934 కాగా జనవరి 27-ఫిబ్రవరి 2 మధ్య 12,772 కు తగ్గింది.
మరో కీలకమైన అంశమేమిటంటే గత 24 గంటల్లో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 100 కంటే తక్కువ నమోదైంది. ఇది గత 8 నెలల్లో అత్యల్పం. 2020 మే 15న 100 మరణాలు నమోదయ్యాయి.
సగటు రోజువారీ మరణాలు కూడా గత 5 వారాల్లో ఇదే ధోరణి ప్రదర్శించాయి. 2021 జనవరి 27- ఫిబ్రవరి 2 మధ్య మరణాలు 128 కాగా 2020 డిసెంబర్ 30- 2021 జనవరి 5 మధ్య 242 సగటు మరణాలు నమోదయ్యాయి.
చికిత్సలో ఉన్న కేసుల విషయానికొస్తే, ఆ సంఖ్య మరింత తగ్గి ఈ రోజుకు 1,63,353 కు చేరింది. ఇది దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇవి 1.52% మాత్రమే. దేశంలో ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,04,48,406 కు చేరింది. కోలుకున్నవారి శాతం 97.05% గా నమోదైంది. కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 ఫిబ్రవరి 2 ఉదయం 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య 39,50,156 గా నమోదైంది.
క్రమసంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,727
|
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1,87,252
|
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
9,791
|
|
4
|
అస్సాం
|
39,724
|
|
5
|
బీహార్
|
1,84,215
|
|
6
|
చండీగఢ్
|
3,803
|
|
7
|
చత్తీస్ గఢ్
|
76,705
|
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
832
|
|
9
|
డామన్, డయ్యూ
|
441
|
|
10
|
ఢిల్లీ
|
64,711
|
|
11
|
గోవా
|
4,509
|
|
12
|
గుజరాత్
|
2,56,097
|
|
13
|
హర్యానా
|
1,26,759
|
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
33,434
|
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
26,634
|
|
16
|
జార్ఖండ్
|
48,057
|
|
17
|
కర్నాటక
|
3,16,228
|
|
18
|
కేరళ
|
1,93,925
|
|
19
|
లద్దాఖ్
|
1,234
|
|
20
|
లక్షదీవులు
|
807
|
|
21
|
మధ్యప్రదేశ
|
2,98,376
|
|
22
|
మహారాష్ట్ర
|
3,10,825
|
|
23
|
మణిపూర్
|
4,373
|
|
24
|
మేఘాలయ
|
4,564
|
|
25
|
మిజోరం
|
9,932
|
|
26
|
నాగాలాండ్
|
3,998
|
|
27
|
ఒడిశా
|
2,07,462
|
|
28
|
పుదుచ్చేరి
|
2,988
|
|
29
|
పంజాబ్
|
59,285
|
|
30
|
రాజస్థాన్
|
3,33,930
|
|
31
|
సిక్కిం
|
2,166
|
|
32
|
తమిళనాడు
|
1,12,687
|
|
33
|
తెలంగాణ
|
1,68,771
|
|
34
|
త్రిపుర
|
31,190
|
|
35
|
ఉత్తరప్రదేశ్
|
4,63,793
|
|
36
|
ఉత్తరాఖండ్
|
37,505
|
|
37
|
పశ్చిమ బెంగాల్
|
2,66,407
|
|
38
|
ఇతరాలు
|
54,019
|
|
మొత్తం
|
39,50,156
|
|
గత 24 గంటలలో 3,516 శిబిరాలలో 1,91,313 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు మొత్తం 72,731 శిబిరాలు నిర్వహించారు. ప్రతిరోజూ టీకాల లబ్ధి దారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
గత 24 గంటలలో 13,423 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారిలో 85.09% మంది 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా ఒకే రోజులో అత్యధికంగా కోలుకున్నవారిలో కేరళలో 5,215 మంది, మహారాష్ట్రలో 3,289 మంఇద్, చత్తీస్ గఢ్ లో 520 మంది ఉన్నారు.
కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 80.10% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా 3,459 కేసులు రాగా, మహారాష్ట్రలో 1,948, తమిళనాడులో 502 మంది పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. కోవిడ్ అదుపులో రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు కేరళ, మహారాష్ట్రలకు కేంద్రం ఉన్నతస్థాయి వైద్య ఆరోగ్య బృందాలను పంపింది.
గత 24 గంటలలో 94 మంది కోవిడ్ కారణంగా మరణించారు. మృతులలో 65.96% మంది ఐదు రాష్ట్రాలకు చెందినవారు. మహారాష్ట్రలొ గరిష్ఠంగా 27 మంది, ఆ తరువాత కేరళలో 17 మంది, తమిళనాడులో ఏడుగురు మరణించారు. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
****
(Release ID: 1694407)
Visitor Counter : 200