ప్రధాన మంత్రి కార్యాలయం

కోరాపుట్ లో ర‌హ‌దారి ప్ర‌మాద ఘ‌ట‌న బాధితుల‌ కు అనుగ్ర‌హ‌ పూర్వక రాశి ని చెల్లించడానికి ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 FEB 2021 5:26PM by PIB Hyderabad

ఒడిశా లోని కోరాపుట్ లో రోడ్డు ప్ర‌మాదం కార‌ణం గా ప్రాణాల‌ ను కోల్పోయిన వ్య‌క్తులకు చెందిన ద‌గ్గ‌రి సంబంధికుల‌ కు ‘ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి’ నుంచి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున అనుగ్ర‌హ పూర్వ‌క రాశి చెల్లింపున‌ కు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

తీవ్రంగా గాయ‌ప‌డిన వ్య‌క్తుల‌ కు 50,000 రూపాయ‌ల వంతున ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి కూడా ఆయ‌న తన ఆమోదాన్ని తెలియజేశారు.

‘‘ఒడిశా లోని కోరాపుట్ లో దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం ఘ‌ట‌న‌ లో ప్రాణాలు కోల్పోయిన వ్య‌క్తుల ద‌గ్గ‌రి సంబంధికుల‌ కు ‘ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి’ నుంచి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున అనుగ్ర‌హ పూర్వ‌క రాశి ని అందించ‌డం జ‌రుగుతుంది.  తీవ్రం గా గాయ‌ప‌డిన వారికి 50,000 రూపాయ‌ల చొప్పున ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేయ‌డం జ‌రుగుతుంది’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎమ్ ఒ) తెలిపింది.



PMO India
@PMOIndia
An ex-gratia of Rs. 2 lakh each from Prime Minister’s National Relief Fund would be given to the next of kin of those who have lost their lives due to the unfortunate road accident  in Koraput, Odissa. Rs. 50,000 would be given to those seriously injured.
4:57 PM · Feb 1, 2021
3.6K
678
Copy link to Tweet
 


 

***



(Release ID: 1694220) Visitor Counter : 109