ఆర్థిక మంత్రిత్వ శాఖ
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు రూ .1,18,101 కోట్ల కేటాయింపు
1,08,230 కోట్ల రూపాయల అత్యధిక మూలధన వ్యయం
మార్చి 2022 నాటికి భారత్‌మాలా ప్రాజెక్టు కింద 8,500 కిలోమీటర్లపొడవైన రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
మార్చి 2022 నాటికి 11,000 కిలోమీటర్ల అదనపు హైవే కారిడార్లు పూర్తికానున్నాయి
మరిన్ని ఆర్థిక కారిడార్లు నిర్మించడానికి ప్రణాళిక
Posted On:
01 FEB 2021 1:50PM by PIB Hyderabad
మొత్తం రూ.5.35 లక్షల కోట్లతో చేపట్టిన ‘భారతమాల పరియోజన’ ప్రాజెక్టు కింద రూ.3.3 లక్షల కోట్లతో 13,000 కిలోమీటర్లకుపైగా రోడ్ల నిర్మాణ పనులు అప్పగించామని ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. వీటిలో ఇప్పటికే 3,800 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు 2020 మార్చినాటికి ప్రభుత్వం మరో 8,500 కిలోమీటర్ల పనులను అప్పగించనుండగా, 11,000 కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారి కారిడార్లు పూర్తికాగలవని చెప్పారు. దీంతోపాటు రోడ్ల మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఆర్థిక కారిడార్లపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రోడ్లు-రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు ఆమె రూ.1,18,101 లక్షల కోట్లదాకా కేటాయింపులు పెంచారు. ఇందులో ఇదివరకెన్నడూ లేనిరీతిలో రూ.1,08,230 కోట్లు మూలధనం కింద కేటాయించబడింది.'
***
(Release ID: 1694215)
Visitor Counter : 279