ఆర్థిక మంత్రిత్వ శాఖ
32 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 'వన్ నేషన్ వన్రేషన్ కార్డ్' పథకం అమలులో 69 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారు: ఆర్థిక మంత్రి
అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేకపోర్టల్
వేదికలు మరియు ప్లాట్‌ఫాం కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలనుఅందించడానికి నాలుగు లేబర్ కోడ్‌లు అమలు చేయబడతాయి
సింగిల్ రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ యజమానులపై కాంప్లయన్స్ భారంతగ్గుతుంది.
Posted On:
01 FEB 2021 1:43PM by PIB Hyderabad
వలస కార్మికులు, పనివారు..
దేశంలో ఎక్కడైనా లబ్ధిదారులు తమ రేషన్‌ను క్లయిమ్ చేసుకొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం 32 రాష్ట్రాలు, యుటీలలో అమలులో ఉంది. 69 కోట్ల మంది లబ్ధిదారులకు చేరువైంది. అంటే ఇది మొత్తం లబ్ధిదారులలో 86 శాతానికి సమానం. మిగిలిన 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ రాబోయే కొద్ది నెలల్లో ఈ పథకంలో విలీనం చేయబడతాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు ప్రక్రియనిక ముగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా సామాజిక భద్రత ప్రయోజనాలు జట్కాబండ్లు, ప్లాట్‌ఫాం కార్మికులకు విస్తరించనున్నాము. అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనం వర్తిస్తుంది. దీనికి తోడు అందరికీ కార్మిక రాజ్య బీమా రక్షణ కల్పించబడుతుంది. మహిళలకు అన్ని విభాగాలలో మహిళలు పని చేసేలా అనుమతించబడుతుంది. రాత్రి షిఫ్టులలో తగిన రక్షణతో పనిచేయడానికి వీలుగా అనుమతి ఉంటుంది. అదే సమయంలో ఒకే రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ మరియు ఆన్‌లైన్ రాబడితో యజమానులపై సమ్మతి భారం తగ్గుతుంది.
***
(Release ID: 1694144)
Visitor Counter : 313
Read this release in:
Hindi
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Urdu
,
Assamese
,
English
,
Marathi
,
Manipuri
,
Tamil
,
Malayalam