ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆరోగ్యం, శ్రేయస్సు ఆత్మ నిర్భర్ భారత్  ఆరు ప్రధాన స్తంభాలలో ఒకటి

నీరు, పారిశుధ్యం మరియు స్వచ్ఛమైన గాలి  -ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క సమగ్ర భాగాలు 

రూ.2,87,000 కోట్ల తో జల్ జీవన్ మిషన్ (అర్బన్)

 అర్బన్ క్లీన్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ .1,41,678 కోట్లు కేటాయింపు  

పెరుగుతున్న వాయు కాలుష్యం సమస్యను అధిగమించడానికి రూ .2,217 కోట్లు 

స్వచ్ఛంద వాహన స్క్రాప్ విధానం ప్రకటన

Posted On: 01 FEB 2021 2:04PM by PIB Hyderabad

నీటి సరఫరా మరియు స్వచ్ఛ భారత్ మిషన్ యూనివర్సల్ కవరేజ్

2.86 కోట్ల నివాసాల్లో కుళాయి కనెక్షన్లతో పాటు మొత్తం 4,378 పట్టణ స్థానిక సంస్థలలో సార్వత్రిక నీటి సరఫరాతో పాటు 500 అమృత్‌ నగరాల్లో ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం జల్‌జీవన్‌ మిషన్ (పట్టణ) ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.2,87,000 కోట్ల రూపాయలతో ఇది 5 సంవత్సరాలు అమలు చేయబడుతుంది.  అంతేకాకుండా అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2021-2026 నుండి 5 సంవత్సరాల కాలంలో మొత్తం రూ .1,41,678 కోట్ల ఆర్థిక కేటాయింపుతో అమలు చేయబడుతుంది.  వాయు కాలుష్యం కారణంగా తలెత్తున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో 10 లక్షలకు మించి జనాభా ఉన్న 42 పట్టణాలకు 2,217 కోట్లు కేటాయించింది.  పాత మరియు అనర్హమైన వాహనాలను తొలగించడానికి స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానాన్ని కూడా ప్రకటించారు. వ్యక్తిగత వాహనాల విషయంలో 20 సంవత్సరాల తరువాత, మరియు వాణిజ్య వాహనాల విషయంలో 15 సంవత్సరాల తరువాత ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ కేంద్రాల్లో వాటికి ఫిట్‌నెస్ పరీక్షలు ప్రతిపాదించబడ్డాయి.

 

Universal Coverage of Water Supply.jpg

 

***




(Release ID: 1694097) Visitor Counter : 309