సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
100 శాతం సామర్ధ్యంతో తెరుచుకోడానికి సినిమా హాళ్లకు అనుమతి
మార్గదర్శకాలు విడుదల చేసిన శ్రీ ప్రకాష్ జవదేకర్
प्रविष्टि तिथि:
31 JAN 2021 12:55PM by PIB Hyderabad
దేశంలో సినిమా హాళ్లు 100 శాతం సామర్ధ్యంతో పనిచేయడానికి అనుమతి ఇస్తున్నట్టు కేంద్రమంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. కోవిడ్ నిబంధనలు, శానిటైసెషన్ మార్గదర్శకాలను థియేటర్లు అమలుచేయవలసి ఉంటుందని మంత్రి తెలిపారు.కోవిడ్ వ్యాప్తి చెందకుండా సినిమా హాళ్లు, థియేటర్లు పాటించవలసిన విధివిధానాలను మంత్రి ఈరోజు విడుదల చేశారు. నిబంధనలను అమలుచేస్తూ హాళ్లు, థియేటర్లు 100 శాతం సామర్ధ్యంతో పనిచేయవచ్చునని ఆయన తెలిపారు. అయితే, ప్రేక్షకులు థియేటర్లలో వుండే ప్రాంతాల నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది. కోవిడ్ వ్యాప్తితో విధించిన ఆంక్షలు ముగింపు దశకు వచ్చాయని అన్నారు.
సినిమా థియేటర్లు, హాళ్లను తెరవడానికి అనుమతి ఇస్తూ 2021 జనవరి 27వ తేదీన ఆర్డర్ నెం. 40-3 / 2020-డిఎం-ఐ (ఎ) ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు.
వీటి ప్రకారం కంటైనర్ జోన్లలో చిత్రాల ప్రదర్శనకు అనుమతి ఉండదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు / కేంద్ర పాలిట ప్రాంతాలు అదనపు చర్యలను సిఫార్సు చేయవచ్చును. సినిమా థియేటర్లలో సీట్ల సామర్ధ్యాన్ని 100 శాతంకి పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు మార్గదర్శకాలలో పేర్కొన్నారు.
సినిమా హాళ్లు, థియేటర్లలో కోవిడ్ సంబంధిత భద్రతా చర్యలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఫేస్ మాస్కుల వినియోగం, థియేటర్ల బయట, కామన్ ప్రాంతాలు, వేచివుండే ప్రాంతాలలో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడంతో సహా గాలి సంబంధిత అంశాలను అన్ని వేళలా అమలు చేయవలసి ఉంటుంది. బహిరంగంగా ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ ఆరోగ్య సేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలని మార్గదర్శకాలతో పేర్కొన్నారు.
ప్రవేశ నిష్క్రమణల ప్రాంతాలలో రద్దీ లేకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. సింగల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో ప్రదర్శనల మధ్య తగినంత విరామం ఇవ్వవలసి ఉంటుందని మార్గదర్శకాలతో పేర్కొన్నారు.ముల్టీప్లె స్క్రీన్‌లలో రద్దీ లేకుండా చూడడానికి ప్రదర్శనల మధ్య సమయం పాటించవలసి ఉంటుంది.
టిక్కెట్లు, ఆహారం మరియు పానీయాల కోసం చెల్లింపుల చేయడానికి కాంటాక్ట్‌లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.టిక్కెట్ల కొనుగోలు చేయడానికి రోజంతా తెరిచి వుండేవిధంగా తగినంత సంఖ్యలోబాక్స్ ఆఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా చూడడానికి ముందస్తు బుకింగ్ విధానం అనుమతించబడుతుంది
మొత్తం ప్రాంగణంలోని శానిటైజేషన్ కి ప్రాధాన్యత ఇస్తూ మొత్తం ప్రాంగణం, సాధారణ సౌకర్యాలు మానవ సంబంధంలోకి వచ్చే అన్ని పాయింట్లు ఉదా. హ్యాండిల్స్, రెయిలింగ్లు మొదలైనవి తరచుగా శానిటైజ్ చేయాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.
చేయవలసిన పనులు, చేయకూడని పనులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రకటనలు, స్టాండులు, పోస్టర్ల రూపంలో చర్యలను అమలు చేయవలసి ఉంటుందని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.
వివరణాత్మక మార్గదర్శకాలను ఈ కింది లింక్‌లో చూడవచ్చును :
https://mib.gov.in/sites/default/files/FINAL%20SOP%20for%20Exhibition%20of%20Films%20%281%29.pdf
***
(रिलीज़ आईडी: 1693728)
आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam