ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య మరింత తగ్గి 1.71 లక్షలకు చేరిక దాదాపు 30 లక్షలమందికి కోవిడ్ టీకాలు
Posted On:
29 JAN 2021 11:59AM by PIB Hyderabad
భారత్ లో చికిత్సపొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అది 1,71,686 కు చేరింది. దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇది 1.60% మాత్రమే. ప్రతి పది లక్షల జనాభాలో కోవిడ్ చికిత్సపొందుతున్న వారి సంఖ్య దృష్ట్యా చూస్తే భారత్ లో చాలా తక్కువ మంది ఉన్నట్టు లెక్క. ప్రస్తుతం అది 7768 గా నమోదైంది. జర్మనీ, రష్యా, ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, యుకె, యు ఎస్ ఎ లాంటి దేశాలలో ఇది చాలా ఎక్కువగా ఉంది.
17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో కేసుల సంఖ్య జాతీయ సగటు (7768) కంటే తక్కువగా నమోదైంది.
భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షలు 19.5 కోట్లు దాటి ఈ రోజుకు 19,50,81,079 కు చేరుకున్నాయి. గత 24 గంటలలో 7,42,306 పరీక్షలు జరిగాయి. జాతీయ స్థాయిలో మొత్తం పాజిటివ్ శాతం 5.50% కు తగ్గింది.
2021 జనవరి 29 ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 30 లక్షలకు దగ్గరగా 29,28,053 గా నమోదైంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2656
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
171683
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
8656
|
4
|
ఆస్సాం
|
28918
|
5
|
బీహార్
|
107174
|
6
|
చండీగఢ్
|
2764
|
7
|
చత్తీస్ గఢ్
|
62115
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
493
|
9
|
దామన్, డయ్యూ
|
286
|
10
|
ఢిల్లీ
|
48008
|
11
|
గోవా
|
2882
|
12
|
గుజరాత్
|
162616
|
13
|
హర్యానా
|
115968
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
18848
|
15
|
జమ్మూ కశ్మీర్
|
22401
|
16
|
జార్ఖండ్
|
24315
|
17
|
కర్నాటక
|
286089
|
18
|
కేరళ
|
106583
|
19
|
లద్దాఖ్
|
818
|
20
|
లక్షదీవులు
|
746
|
21
|
మధ్యప్రదేశ్
|
195187
|
22
|
మహారాష్ట్ర
|
220587
|
23
|
మణిపూర్
|
2855
|
24
|
మేఘాలయ
|
3870
|
25
|
మిజోరం
|
6728
|
26
|
నాగాలాండ్
|
3973
|
27
|
ఒడిశా
|
194058
|
28
|
పుదుచ్చేరి
|
1813
|
29
|
పంజాబ్
|
50977
|
30
|
రాజస్థాన్
|
257833
|
31
|
సిక్కిం
|
1776
|
32
|
తమిళనాడు
|
88467
|
33
|
తెలంగాణ
|
151246
|
34
|
త్రిపుర
|
24302
|
35
|
ఉత్తరప్రదేశ్
|
294959
|
36
|
ఉత్తరాఖండ్
|
19517
|
37
|
పశ్చిమ బెంగాల్
|
187485
|
38
|
ఇతరత్రా
|
48,401
|
మొత్తం
|
29,28,053
|
గడిచిన 24 గంటలలో 5,72,060 మంది ఆరోగ్య రంగ సిబ్బంది 10,205 శిబిరాలలో టీకలౌ వేయించుకున్నారు.
ఇప్పటిదాకా మొత్తం 52,878 శిబిరాలు నిర్వహించబడ్దాయి.
ప్రతిరోజూ టీకాలు వేయించుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది.
టీకాలు వేయించుకున్నవారిలో 72.46% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.వారిలో అత్యధికశాతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా, ఆ తరువాత స్థానాల్లో కర్నాటక, రాజస్థాన్ ఉన్నాయి.
దేశంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య కోటీ మూడు లక్షలు దాటి 1,03,94,352 గా నమోదైంది.
కోఉకున్నవారి శాతం 96.96%. గత 24 గంటలలో 18,855 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య 20,746 గా నమోదైంది.
చత్తీస్ గఢ్ లో 6,451 కొత్త కేసులు రాగా 6,479 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 35 మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఒక్క సారిగా పెరగటానికి కారణం జిల్లా స్థాయి మొదలుకొని లెక్కలన్నీ తనిఖీ చేసి సమగ్రంగా తేల్చటమేనని ఆ రాష్ర్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా కోలుకున్నవారిలో 85.36% మంది కేవలం 7 రాష్ట్రాలలో కేంద్రీకృతమైనట్టు గుర్తించారు. చత్తీస్ గఢ్ లో ఒక్కరోజులో 6,479 మంది కోలుకున్నట్టు నమోదు కాగా కేరళలో 5,594 మంది, మహారాష్ట్రలో 3,181 మంది గత 24 గంటలలో కోలుకున్నారు
కొత్తగా కోవిడ్ నిర్థారణ జరిగిన కేసులలో 85.73% మంది కేవలం ఐదు రాష్టాలకు చెందినవే. చత్తీస్ గఢ్ లో అత్యధికంగా 6451 కొత్త కేసులు వచ్చాయి. పైన పేర్కొన్న విధంగా సంఖ్యలో పెరుగుదలకు కారణం జిల్లా, రాష్ట స్థాయి కేసుల సంఖ్య ను, మరణాలను, కోలుకున్నవారిని పూర్తి స్థాయిలో బేరీజు వేయటమే. చత్తీస్ గఢ్ తరువాత కేరళ 5771 కేసులతో రెండో స్థానంలో ఉండగా 2889 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది.
గత 24 గంటలలో 163 మంది కోవిడ్ బాధితులు మరణించారు. అందులో 85.89% మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందినవారున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 50 మంది మరణించగా చత్తీస్ గఢ్ లో 35, కేరళలో 19 మరణాలు నమోదయ్యాయి.
19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు జాతీయ సగటు (112) కంటే తక్కువగా నమోదయ్యాయి.
***
(Release ID: 1693199)
Visitor Counter : 213