రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఇవిలకు ప్రత్యామ్నాయ బ్యాటరీ సాంకేతికతల దిశగా పరిశోధన, అభివృద్ధి, బదిలీకి పిలుపిచ్చిన గడ్కరీ
Posted On:
28 JAN 2021 2:30PM by PIB Hyderabad
విద్యుత్‌తో నడిచే వాహనాలు ప్రస్తుత వాస్తవం అవుతున్న నేపథ్యంలో బాటరీతో, పవర్-ట్రైన్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా అవతరించవలసిన అవసరాన్ని కేంద్ర ఎంఎస్ ఎంఇ, రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ నొక్కి చెప్పారు.
వాహనాలలో ఉపయోగించే లిథియమ్-ఐయాన్ రీఛార్జిబుల్ బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే లిథియమ్ వ్యూహాత్మక నిల్వలపై నియంత్రణలో మనం ప్రస్తుతం సవాలును ఎదుర్కొంటున్నామంటూ, రానున్న సంవత్సరాలలో ఇవి రంగం పూర్తిగా దేశీయంగా బ్యాటరీ సాంకేతికత దిశగా మారాలని మంత్రి పిలుపిచ్చారు. ఇవి పరిశోథన, అభివృద్ధి రంగంలో అభివృద్ధి చేయనున్న మెటల్-ఎయిర్, మెటల్-ఐయాన్, ఇతర సంభావ్య సాంకేతికతలు కావచ్చు.
రవాణా రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించవలసిన అవసరాన్ని పట్టి చూపుతూ, మన దేశానికి చెందిన ఇనిస్టిట్యూషన్స్ ఆప్ ఎమినెన్స్ (ఐఒఇఎస్), పరిశ్రమ, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ప్రభుత్వ మద్దతుతో రానున్న సంవత్సరాలలో అటువంటి ప్రత్యామ్నాయ బ్యాటరీ సాంకేతికతలను తీవ్రంగా పరిశోధించి, అభివృద్ధి చేయవలసిన అవసరముందని నితిన్ గడ్కరీ చెప్పారు.
***
(Release ID: 1692965)
Visitor Counter : 223