ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గత 20 రోజులుగా భారత్ లో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
అతితక్కువ కొత్త కేసులున్న దేశాల్లో, ప్రతి పది లక్షల
జనాభాలో తక్కువ మరణాలున్న దేశాల్లో భారత్ కు స్థానం
Posted On:
27 JAN 2021 11:56AM by PIB Hyderabad
భారత్ లో రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గత 20 రోజులలో కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారు అధికంగా నమోదవుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,03,59,305 మంది కోవిడ్ బారి నుంచి బైటపడ్డారు.
గత 24 గంటలలో 13,320 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 96.91% అయింది.
రోజువారీ చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గటం చిత్రపటంలో స్పష్టంగా కనబడుతోంది. గత 24 గంటలలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 12,689.
దేశంలో ప్రస్తుతం కోవిడ్ తో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,76,498.
దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా మరింత తగ్గి ప్రస్తుతం 1.65% కు చేరింది.
గత వారంరోజులుగా దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో నమోదైన కొత్త కేసులు అతి తక్కువ. ఈ విధమైన సానుకూల ఫలితాలు స్థిరంగా కొనసాగటం వలన కేంద్రం అనుసరిస్తున్న పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే వ్యూహం ఫలించినట్టయింది.
తొలిదశలోనే పెద్ద ఎత్తున దూకుడుగా వ్యాధి నిర్థారణ పరీక్షలు జరగటం వలన బాధితులను గుర్తించి ఐసొలేషన్ లో ఉంచటమా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందించటమా అనేది నిర్థారించి అందుకు అనుగుణంగా నడుచుకోవటం సాధ్యమైంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన చికిత్సా వుధానాల మీద దృష్టి సారించాయి. ఐసొలేషన్ లో ఉన్నవారి మీద తగిన పర్యవేక్షణ సాగింది. తగినన్ని వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, మందులు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అందుబాటులో ఉంచటం, సకాలంలో అంబులెన్సుల ద్వారా
బాధితులను ఆస్పత్రులకు తరలించటం ద్వారా కేంద్రం అప్రమత్తంగా వ్యవహరించింది.
ఈ సంజీవని డిజిటల్ వేదిక ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేట్టు చూడటం, అదే సమయంలో కోవిడేతర వ్యాధులకు సైతం చికిత్సలో లోటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఐసియు లు నిర్వహించటం సత్ఫలితాలనిచ్చాయి.
ఇందులో ఢిల్లీ లోని ఎయిమ్స్ చాలా కీలకపాత్ర పోషించింది.
జనవరి 27 ఉదయం 8 గంటల వరకు 20,29, 480 మంది లబ్ధిదారులు కోవిడ్ టీకాలు అందుకున్నారు. గత 24 గంటలలో టీకా లబ్ధిదారుల సంఖ్య 5671 గా నమోదైంది. ఇందుకోసం 194 శిబిరాలు నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహిమ్చిన మొత్తం
శిబిరాల సంఖ్య 36,572.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,369
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
1,56,129
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
7,307
|
4
|
ఆస్సాం
|
19,837
|
5
|
బీహార్
|
88,450
|
6
|
చండీగఢ్
|
1,928
|
7
|
చత్తీస్ గఢ్
|
40,025
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
345
|
9
|
డామన్, దయ్యూ
|
320
|
10
|
ఢిల్లీ
|
33,219
|
11
|
గోవా
|
1,796
|
12
|
గుజరాత్
|
91,927
|
13
|
హర్యానా
|
1,05,419
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
13,544
|
15
|
జమ్మూ కశ్మీర్
|
16,173
|
16
|
జార్ఖండ్
|
18,413
|
17
|
కర్నాటక
|
2,31,607
|
18
|
కేరళ
|
71,973
|
19
|
లద్దాఖ్
|
670
|
20
|
లక్షదీవులు
|
676
|
21
|
మధ్యప్రదేశ్
|
67,083
|
22
|
మహారాష్ట్ర
|
1,36,901
|
23
|
మణిపూర్
|
2,485
|
24
|
మేఘాలయ
|
2,748
|
25
|
మిజోరం
|
4,852
|
26
|
నాగాలాండ్
|
3,675
|
27
|
ఒడిశా
|
1,77,090
|
28
|
పుదుచ్చేరి
|
1,813
|
29
|
పంజాబ్
|
39,418
|
30
|
రాజస్థాన్
|
1,61,332
|
31
|
సిక్కిం
|
1,047
|
32
|
తమిళనాడు
|
73,953
|
33
|
తెలంగాణ
|
1,30,425
|
34
|
త్రిపుర
|
19,698
|
35
|
ఉత్తరప్రదేశ్
|
1,23,761
|
36
|
ఉత్తరాఖండ్
|
14,546
|
37
|
పశ్చిమ బెంగాల్
|
1,22,851
|
38
|
ఇతరములు
|
43,675
|
మొత్తం
|
20,29,480
|
కొత్తగా కోలుకున్నవారిలో 84.52% మంది 9 రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 5,290 మంది, మహారాష్ట్రలో 2,106 మంది, కర్నాటకలో 738 మంది కోలుకున్నారు.
కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 84.73%మంది ఏడు రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 6,293 మంది, మహారాష్ట్రలో 2,405 మంది, కర్నాటకలో 529 మంది పాజిటివ్ గా తేలారు.
కొత్తగా గత 24 గంటలలో మరణించినవారిలో 83.94% మంది ఏదు రాష్ట్రాలవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 47 మంది, కేరళలో 19 మంది, చత్తీస్ గఢ్ లో 14 మంది చనిపోయారు.
భారత దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో ఒక మరణం చొప్పున మాత్రమే నమోదైంది.
***
(Release ID: 1692713)
Visitor Counter : 199
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam