ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

8 నెలల తరువాత భారత్ లో అతి తక్కువ కొత్త కేసులు; గత 24 గంటలలో 9,102పాజిటివ్ కేసులు

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నది 1.66% శాతమే

8 నెలల తరువాత రోజువారీ మరణాలు 117 కు తగ్గుదల

టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది సంఖ్య 20 లక్షలు

Posted On: 26 JAN 2021 11:18AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది. రోజువారీ కొత్త కేసులు కనిష్ఠ స్థాయికి చేరాయి.  గత 24 గంటలలో 9,102 కొత్త కేసులు వచ్చాయి.  ఇది 237 రోజుల తరువాత అతి తక్కువ.  గతఅ జూన్ 4న  9,304

కేసులు నమోదయ్యాయి.  స్థిరంగా, సానుకూల వ్యూహం అనుసరించటం వలన రోజువారీ కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనివలన మరణాలు కూడా బాగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 117 మరణాలు

నమోదయ్యాయి. ఇది 8 నెలల 9 రోజుల తరువాత జరిగింది.

 

WhatsApp Image 2021-01-26 at 9.59.20 AM.jpeg

భారత దేశంలో చికిత్సపొందుతున్న  కోవిడ్ బాధితుల సంఖ్య కూడా  1,77,266 కు చేరిందిమొ. త్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా  1.66% కి తగ్గింది. గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులు నికరంగా 6,916 తగ్గాయి.

 ప్రతి 10 లక్షలమందిలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 128 మాత్రమే.  జర్మనీ, రష్యా, బ్రెజిల్, ఇటలీ, యుకె, యు ఎస్ ఎ లాంటి దేశాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

 

WhatsApp Image 2021-01-26 at 10.19.03 AM.jpeg 

ప్రతి పది లక్షల జనాభాలో కేసుల సంఖ్య ప్రపంచంలోనే అతి తక్కువగా 7,736 గా నమోదైంది.

 

WhatsApp Image 2021-01-26 at 10.15.08 AM.jpeg 

జాతీయ టీకాల కార్యక్రమం కింద 2021 జనవరి 26 ఉదయం 8 గంటలవరకు కోవిడ్ టీకా లబ్ధిదారుల సంఖ్య 20,23,809 కి చేరింది. గత 24 గంటలలో 4,08,305  మందికి 7,764  శిబిరాలలో టీకాలు వేయించుకున్నారు.

ఇప్పటివరకు 36,378 శిబిరాలు నిర్వహించారు.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం  

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్ నికోబార్ దీవులు

2,369

2

ఆంధ్రప్రదేశ్

1,56,120

3

అరుణాచల్ ప్రదేశ్

7,307

4

ఆస్సాం

19,837

5

బీహార్

88,450

6

చండీగఢ్

1,928

7

చత్తీస్ గఢ్

40,025

8

దాద్రా, నాగర్ హవేలి

345

9

డామన్, డయ్యూ

320

10

ఢిల్లీ

33,219

11

గోవా

1,796

12

గుజరాత్

91,927

13

హర్యానా

1,05,419

14

హిమాచల్ ప్రదేశ్

13,544

15

జమ్మూ కశ్మీర్

16,173

16

జార్ఖండ్

18,413

17

కర్నాటక

2,31,172

18

కేరళ

71,973

19

లద్దాఖ్

670

20

లక్షదీవులు

676

21

మధ్య ప్రదేశ్

67,083

22

మహారాష్ట్ర

1,36,901

23

మణిపూర్

2,485

24

మేఘాలయ

2,748

25

మిజోరం

4,852

26

నాగాలాండ్

3,675

27

ఒడిశా

1,77,090

28

పుదుచ్చేరి

1,813

29

పంజాబ్

39,418

30

రాజస్థాన్

1,61,116

31

సిక్కిం

1,047

32

తమిళనాడు

69,027

33

తెలంగాణ

1,30,390

34

త్రిపుర

19,698

35

ఉత్తరప్రదేశ్

1,23,761

36

ఉత్తరాఖండ్

14,546

37

పశ్చిమ బెంగాల్

1,22,851

38

ఇతరములు

43,625

 

మొత్తం

20,23,809

 

మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఈ రోజుకు 1,03,45,985 కు చేరింది. ఇది కోలుకున్న శాతాన్ని 96.90%  కు చేర్చింది.  కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య  బాగా పెరుగుతూ ప్రస్తుతం 1,01,68,719 అయింది.

గడిచిన 24 గంటలలో 15,901 మంది కోలుకున్నారు.  

కొత్తగా కోలుకున్నవారిలో 83.68%  మంది 9 రాష్ట్రాల్లొ కేంద్రీకృతమయ్యారు. కేరళలో  ఒకరోజులో అత్యధికంగా 5,606 మంది కోలుకోగా  మహారాష్ట్రలో  3,080 మంది, కర్నాటకలో 1,036  మంది కోలుకున్నారు.

 

WhatsApp Image 2021-01-26 at 10.02.00 AM.jpeg 

కొత్తగా నమోదైన కేసులలో 81.76% మంది 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా 3361 కేసులు రాగా, మహారాష్ట్రలో 1842 కేసులు, తమిళనాడులో 540 కేసులు వచ్చాయి.

 WhatsApp Image 2021-01-26 at 9.50.02 AM.jpeg

గత 24 గంటలలో 117 మంది మరణించగా వారిలో 63.25% మంది  పరిమిత రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారుమహారాష్ట్రలో 30 మంది, కేరళలో 17 మంది, చత్తీస్ గఢ్ లో 13 మంది చనిపోయారు.  

 

WhatsApp Image 2021-01-26 at 9.52.53 AM.jpeg 

భారత్ లో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు 11. ఇది ప్రపంచంలో అతి తక్కువ సంఖ్య.

                                                            

WhatsApp Image 2021-01-26 at 10.11.29 AM.jpeg

****



(Release ID: 1692584) Visitor Counter : 211