ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మరింత తగ్గి 1.84 లక్షలకు చేరుకున్న క్రియాశీల కేసులు

ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 16 లక్షల ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు

కేవలం ఆరు రోజుల్లో 10 లక్షల టీకాలు

Posted On: 24 JAN 2021 11:08AM by PIB Hyderabad
దేశంలో అమలు చేస్తున్న 'పరీక్షించు- శోధించు-చికిత్స అందించు- పరీక్షించు' అన్నవ్యూహం ఆశించిన ఫలితాలను ఇస్తోంది. దీనికి నిదర్శనంగా దేశంలో రోజురోజుకి తగ్గుతున్న కేసుల సంఖ్యను చెప్పుకోవచ్చును. దేశంలో రోజురోజుకి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా క్రియాశేలక కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. 

ఈ రోజుకి దేశంలో క్రేయాశీలక కేసుల సంఖ్య 1,84,408గా వుంది. పాజిటివ్ కేసులలో క్రియాశీల కేసుల శాతం మరింత తగ్గి  1.73% గా వుంది . 

గత 24 గంటలలో దేశంలో 15,948 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటలలో క్రీయాశీలకకేసులలో  సగటున 1,254 కేసులు తగ్గాయి. 

దేశంలో క్రియాశీలంగా ఉన్న కేసులలో 75 శాతం కేసులు మహారాష్ట్ర, కర్ణాటక ఉత్తరప్రదేశ్,కేరళమరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉన్నాయి. 

WhatsApp Image 2021-01-24 at 10.06.45 AM.jpeg

ఈ కింది చిత్రం గత నెలలో మొదటి పది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో కేసులు తగ్గుముఖం పట్టిన సరళిని తెలియచేస్తుంది.  

 

WhatsApp Image 2021-01-24 at 10.17.14 AM.jpeg

జనవరి 24వ తేదీ ఉదయం 8 గంటల వరకు 16 లక్షల మంది ( 15,82,201) కొవిడ్ 19 టీకాలను తీసుకున్నారు. 

గడచిన 24 గంటలలో దాదాపు రెండు లక్షల ( 1,91,609) మందికి 3,512 సెషన్లలో టీకాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు 27,920 సెషన్లు నిర్వహించబడ్డాయి. 

 

ఎస్.

రాష్ట్రం / యుటి

లబ్ధిదారులు

1

అండమాన్ నికోబార్దీవులు

1,998

2

ఆంధ్రప్రదేశ్

1,47,030

3

అరుణాచల్ ప్రదేశ్

6,511

4

అస్సాం

13,881

5

బీహార్

76,125

6

చండీఘర్ 

1,502

7

ఛతీస్ ఘర్ 

28,732

8

దాద్రా  నగర్ హవేలి

345

9

డామన్ & డియు

283

10

ఢిల్లీ 

25,811

11

గోవా

1,561

12

గుజరాత్

78,466

13

హర్యానా

71,297

14

హిమాచల్ ప్రదేశ్

13,544

15

జమ్మూకాశ్మీర్

11,647

16

జార్ఖండ్

14,806

17

కర్ణాటక

1,88,971

18

కేరళ

53,529

19

లడఖ్

558

20

లక్షద్వీప్

633

21

మధ్యప్రదేశ్

38,278

22

మహారాష్ట్ర

99,885

23

మణిపూర్

2,319

24

మేఘాలయ

2,236

25

మిజోరం

3,979

26

నాగాలాండ్

3,443

27

ఒడిశా

1,52,371

28

పుదుచ్చేరి

1,478

29

పంజాబ్

30,319

30

రాజస్థాన్

67,270

31

సిక్కిం

960

32

తమిళనాడు

59,226

33

తెలంగాణ

1,10,031

34

త్రిపుర

14,252

35

ఉత్తర ప్రదేశ్

1,23,761

36

ఉత్తరాఖండ్

10,514

37

పశ్చిమ బెంగాల్

84,505

38

ఇతరాలు

40,144

మొత్తం

15,82,201

 

10 లక్షల వ్యాక్సిన్ మోతాదులను ఇవ్వడానికి భారతదేశం కేవలం  ఆరు రోజులు మాత్రమే తీసుకుంది. యుఎస్ఎయుకె వంటి దేశాలకు మరింత ఎక్కువ సమయం పట్టింది. ఈ సంఖ్య చేరుకోడానికి  యుకె 18 రోజులు,  యుఎస్ఎ 10 రోజులు తీసుకున్నాయి

WhatsApp Image 2021-01-24 at 10.03.45 AM.jpeg

మొత్తం కోలుకున్న కేసులు 10,316,786 గా  ఉన్నాయి.  ఇది రికవరీ రేటును  96.83% కి చేర్చింది. కోలుకొంటున్న సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.  .

కొత్తగా కోలుకున్న కేసులలో 84.30% 10 రాష్ట్రాలు / యుటిలలో ఉన్నట్లు గమనించడం జరిగింది.

కేరళలో  గరిష్టంగా ఒకే రోజు  5,283 కోలుకున్నారు.  3,694 కొత్త రికవరీలతో మహారాష్ట్ర ఆ తరువాతి స్థానంలో వుంది. 

WhatsApp Image 2021-01-24 at 10.02.29 AM.jpeg

గత 24 గంటల్లో 14,849 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.

కొత్త కేసులలో 80.67% ఆరు రాష్ట్రాలు మరియు యుటిలలో నమోదు అయ్యాయి,

కేరళలో గత 24 గంటల్లో గరిష్టంగా రోజువారీ కొత్త కేసులు 6,960 నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 2,697 కేసులు నమోదయ్యాయికర్ణాటకలో నిన్న 902 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

WhatsApp Image 2021-01-24 at 9.59.29 AM.jpeg

గడచిన 24 గంటలలో  155 మంది మరణించారు. వీరిలో79,35%  ఏడు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోఉన్నారు. 

మహారాష్ట్రలో 56 మంది మరణించారు. కేరళ మరియు ఢిల్లీలో వరుసగా 23 మరియు 10 మరణాలు నమోదు అయ్యాయి. .

 

 

 

WhatsApp Image 2021-01-24 at 10.00.58 AM.jpeg

***(Release ID: 1691933) Visitor Counter : 115